Guppedantha Manasu April 19th Episode: కొత్త ప్లాన్‌తో వచ్చిన ఎంఎస్ఆర్.. ఏకంగా డీబీఎస్‌టీ కాలేజ్‌కే ఎసరు..!
19 April 2023, 8:17 IST
- Guppedantha Manasu April 19th Episode: గుప్పెడంత మనసు ఈ రోజు ఎపిసోడ్‌లో విలన్ సౌజన్యరావు అలియస్ ఎంఎస్ఆర్ కొత్త ప్లాన్‌తో వస్తాడు. రిషికి తన ప్రపోజల్‌ను చెప్పాలని భావించిన అతడు.. రిషి కోరిక మేరకు జగతీ, వసుకు వివరిస్తాడు. డీబీఎస్టీ కాలేజ్‌ను తన కాలేజ్‌లో కలపాలని చెబుతాడు.
గుప్పెడంత మనసు లేటెస్ట్ ఎపిసోడ్
Guppedantha Manasu April 19th Episode: గుప్పెడంత మనసు ఈ రోజు ఎపిసోడ్‌లో వసు, రిషిధారలు.. ఇద్దరూ లాన్‌లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. కొత్తగా కట్టబోయే మెడికల్ బిల్డింగ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వసు ఇక్కడ చూడు ఈ ప్లాన్ బాగుందా అంటూ వసును అడుగుతాడు రిషి. ఇందుకు వసు కూడా ప్లాన్ బాగుంది సార్ అంటూ బదులిస్తుంది. మిషన్ ఎడ్యూకేషన్‌కు కూడా ఇంకో బిల్డింగ్ కట్టాలి అని వసుతో అంటాడు. సార్ రెండు ఒకేసారి అంటే కష్టమవుతుంది కదా.. ముందు మెడికల్ బిల్డింగ్ ప్రారంభించి ఆ తర్వాత మిషన్ ఎడ్యూకేషన్ ప్రారంభించండి అంటూ సలహా ఇస్తుంది. ఇందుకు రిషి కూడా సరే అంటాడు. ఇంజినీర్‌తో మాట్లాడి బ్లూ ప్రింట్ తీసుకొస్తే ఇంకా క్లారిటీ వస్తుంది అని రిషి చెబుతాడు. మీరు చాలా సహృదయులు సార్ అని మనసులో రిషి గురించి అనుకుంటుంది వసు.
వసును కాపాడిన రిషి..
ఇంతలో గాలి వచ్చి పేపర్లు ఎగురుతాయి. అవి బిల్డింగ్‌పై నుంచి కింద పడతుండటంతో వసు పట్టుకోడానికి ప్రయత్నిస్తుంటుంది. అలాగే కింద పడబోతుంది. వెంటనే పరిస్థితి గమనించిన రిషి.. ఆమె చేయి పట్టుకుని తన వైపునకు లాక్కుంటాడు. అనంతరం వసుపై కోప్పడతాడు. ఏంటి వసుధార చూసుకోవా? నీకేమైనా అయితే? అలా గుడ్డిగా వెళ్తే ఎలా అంటూ కసురుకుంటాడు. మీరున్నారుగా సార్ అంటూ వసు బదులిస్తుంది. మాట్లాడకు వసుధార.. ఇక్కడ నుంచి వెళ్లు అంటూ సీరియస్ అవుతాడు. వసు అక్కడ నుంచి వెళ్లగానే ఆమె గురించే ఆలోచిస్తుంటాడు రిషి.
వసుపై ఎక్కువగా కోప్పడ్డానా అని తనలో తను అనుకుంటూ ఉంటాడు. మరోపక్క వసు కూడా మరి ఇంతగా కోపగించుకోవాలా అనుకుంటుంది. ఇంతలోనే ఎంతైనా నాకోసమే కాదు రిషి సార్ అలా చేసింది తనకు తాను సర్దిచెప్పుకుంటూ ఉంటుంది. ఇంతలో రిషి నుంచి మెసేజ్ వస్తుంది. కోపం వచ్చిందా వసుధారా అని రిషి మెసేజ్ చేస్తాడు. ఏ లేదు లేదు అనుకుంటూనే.. ఇప్పుడే రిప్లయి ఇవ్వకూడదు.. చాలా రోజుల తర్వాత అవకాశం దొరికింది కదా.. కాసేపు సార్‌ను వెయిట్ చేయిద్దాం అని రిషిని ఆటపట్టించాలని అనుకుంటుంది. వసు నుంచి బదులు రాకపోవడంతో మరో మెసేజ్ చేస్తాడు రిషి. నిన్ను ఆ సిచ్యూవేషన్‌లో చూసేసరికి నాకు కోపం వచ్చింది.. నేనేమి కావాలని అరవలేదు, నీకేమైనా అవుతుందోమోనని భయపడ్డాను, ఇంకెప్పుడు అలా చేయకు వసుధార అంటూ రిషి వరుసగా సందేశాలు పంపిస్తుంటాడు. మరోపక్క వసు ఆమెసేజులు చూసి కూడా రిప్లయి ఇవ్వదు. అందుకు వసుకు పొగరు అంటారని రిషి తనలో తను అనుకుంటూ ఉంటాడు.
వసును వదిలేసి వెళ్లిన రిషి..
రాత్రి మెసేజులకు రిప్లయి ఇవ్వనుందుకు రిషి సార్‌కు ఇంకా కోపం వచ్చి ఉంటుంది. రానీ కొత్తగా ఏమంటారు పొగరు అని అనుకుంటారు అంతేగా అని ఏదో ఫైల్ వెతుకుతుంటుంది వసు. ఇంతలో రిషి వచ్చి కాలేజ్‌కు వెళ్దామా.. అంటే లేదు సార్ అని వసు చెబుతుంది. ఆల్రెడీ మేడమ్, డాడ్ వెళ్లారు.. పదా అనగానే.. ఆడపిల్లను సార్ నాకు టైమ్ పండుతుంది అని వసు అంటుంది. లేట్ అవుతుంది అనుకుంటే మీరు వెళ్లండి అని వసు అంటుంది. సరే వసు నన్ను అర్థం చేసుకున్నావు థ్యాంక్స్ అంటూ వెళ్లిపోతాడు రిషి. రాననగానే వెళ్లిపోవాలా.. కోపం వచ్చిందని కాసేపు బుజ్జగించవచ్చు కదా థ్యాంక్స్ అంటూ వెళ్లిపోయారు అనుకుంటూ అసహనం వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాను నడుచుకుంటూ వెళ్లిపోతాను అనుకుంటూ రోడ్డుపైకి వస్తుంది.
రిషిపై అలిగిన వసు..
వసు రోడ్డుపైకి రాగానే రిషి.. అక్కడే కారులో కూర్చొని ఉంటారు. వసును చూస్తూ అయితే నేను అనుకున్నది నిజమే అన్మమాట అని అనుకుంటాడు. మరోపక్క వసు కూడా రిషిని ఏమి పట్టించోకోనట్లు నడుచుకుంటూ వెళ్తుంది. ఆయన మాట్లాడితేనే మాట్లాడుదామని అనుకుంటుంది. కానీ రిషి పలకరించకపోవడంతో వసునే వచ్చి.. అతడిపై చిర్రుబుర్రులాడుతుంది. వెళ్తానన్న వాళ్లు వెళ్లొచ్చుగా ఎందుకు ఇక్కడే ఉన్నారు అంటూ వెటాకారమాడుతుంది. ఇక్కడ మీరు స్టైల్ గా నిలుచుని, కారు ఆపి ఉన్నారంటే ఏ అమ్మాయైనా ఏమనుకుంటుంది నాకోసమే అనుకుంటారు. నేను కూడాఅలాగే అనుకున్నాను. నీకోసమే అనుకున్నప్పుడు రావొచ్చుగా.. అనగా.. నేను రాను అని బదులిస్తుంది. సరే అదే మాటమీద ఉంటావుగా.. ఒపినియన్ మార్చుకోవుగా అనగానే మార్చుకోను అని వసు బదులిస్తుంది. సరే అని రిషి కారులో కూర్చుంటాడు.
కాసేపు వసు కూడా ఆలోచించి.. వెంటనే వచ్చి రిషి పక్కన కూర్చుంటుంది. అదేంటి రానన్నావ్‌గా అనగానే.. అన్నాను అయితే ఇప్పుడు ఏంటి సార్ అని ప్రశ్నిస్తుంది. అయితే ఇప్పుడు ఎందుకు వచ్చి కూర్చున్నావ్.. అనగానే.. ప్రేమ సార్ అని అంటుంది. వెంటనే రిషి కూడా నిన్ను ఎప్పుడు వదిలిపెట్టి వెళ్లను వసుధార.. అని అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటాడు.
కట్ చేస్తే సీన్ కాలేజ్‌లో ఓపెన్ అవుతుంది. ఇంజినీర్.. రిషికి బిల్డింగ్ ప్లాన్ వివరిస్తూ ఉంటాడు. ఇంతలో రిషికి సౌజన్యరావు(ఎంఎస్ఆర్) నుంచి ఫోన్ వస్తుంది. లాస్ట్ టైమ్ కలిసినప్పుడు డిటేల్డ్‌గా ప్రపోజల్ చెబుతామన్నారుగా.. దాని గురించి మాట్లాడటానికి ఎప్పుడు కలుద్దాం అని ప్రశ్నిస్తాడు. ఈ రోజు నాకు పని ఉందని చెప్పిన రిషి.. వసు, జగతీ వస్తారని, వారితో మాట్లాడమని చెబుతాడు. మీరుంటే బాగుంటుంది అని సౌజన్యరావు అంటాడు. మీరు కూడా ఉంటే బాగుంటుందని ఎంఎస్ఆర్ అంటారు. ఇందుకు రిషి.. వాళ్లు, నేను వేరు కాదని బదులిస్తాడు. నేను వాళ్లను ఇప్పుడే పంపిస్తానని చెబుతాడు.
అనంతరం ఎంఎస్ఆర్.. ఫోన్‌లో తన బాస్‌తో విషయం గురించి చెబుతాడు. రిషి రావట్లేదని, జగతీ, వసు వస్తున్నారని చెబుతాడు. అంతా మీరు చెప్పినట్లే జరుగుతుందని వివరిస్తాడు. అదే జరిగితే డీబీఎస్టీ కాలేజ్ పతనం ప్రారంభమైనట్లే అని అవతలి వ్యక్తి అంటాడు. సరే అని ఎంఎస్ ఫోన్ కట్టేస్తాడు. అనంతరం మిస్టర్ రిషేంద్ర భూషణ్ నీ పతనం ప్రారంభమైందని అంటాడు.
మరోవైపు జగతీ.. వసు కారులో సౌజన్యరావును కలవడానికి కారులో బయల్దేరుతారు. మరోపక్క రిషి.. మహేంద్రకు.. తమ కట్టబోయే బిల్డింగ్ ప్లాన్ గురించి చెబుతాడు. ఇంత త్వరగా నా ప్లాన్ అమలు అవుతుందని అనుకోలేదు డాడ్ అంటూ ఆనందపడతాడు రిషి. అందుకే ఎంఎస్ఆర్ మెడికల్ కాలేజ్ ప్రపోజల్‌కు ఓకే చెప్పినందుకు హ్యాపీగా ఉందని అంటాడు. ఇది తాతయ్య గారి కల అని మహేంద్రతో అంటాడు. ఆల్ ది బెస్ట్ మహేంద్ర అంటాడు. నాకు కాదు డాడ్.. డీబీఎస్టీ కాలేజ్‌కు చెప్పాలని ఇరువురు మాట్లాడుకుంటూ ఉంటారు.
ఎంఎస్ఆర్ ప్రపోజల్.. షాకైన జగతీ, వసు..
జగతీ, వసు.. ఎంఎస్ఆర్‌ను వెళ్లి కలుస్తారు. వీళ్లిద్దరికి ఎంఎస్ఆర్ తన ప్రపోజల్‌ను వివరిస్తాడు. అయితే ఎంఎస్ఆర్.. డీబీఎస్టీ కాలేజ్‌ను తన కాలేజ్‌లో కలపాలని అంటాడు. ఇందుకు జగతీ, వసులు షాక్ అవుతారు. ఇదే నేను మీకిచ్చే మంచి ప్రపోజల్ అని అంటాడు. ఎవరికి సార్..మీకా, మాకా అని వసు ప్రశ్నిస్తుంది. ఇందుకు రిషి సార్ ఒప్పుకోరని చెబుతుంది. ఒప్పుకోవాలి.. లేకుంటే మీరు ఒప్పించండి అని వారితో ఎంఎస్ఆర్ అంటాడు. అది ఎన్నటికీ జరగదని జగతీ అంటుంది. జరగాలి.. ఎందుకంటే మీ కాలేజ్ కంటే మాదే ముందుగా ఏర్పడిందని అతడు అంటాడు. అయితే ఏంటి సార్.. డీబీఎస్టీ కాలేజ్ మిషన్ ఎడ్యూకేషన్‌తో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది.. మా కాలేజ్ సేవలు అందరూ గుర్తిస్తున్నారని, అంత గొప్ప కాలేజ్ మీ కాలేజ్‌తో ఎలా కలుస్తుందనుకున్నారని వసు అంటుంది. ఇదే మీ ప్రపోజల్ అయితే ఈ టాపిక్ ఇక్కడితో వదిలేయండి.. మేడమ్ వెళ్దాం పదండి అంటూ బయల్దేరబోతుంది వసు.
ఒక్క నిమిషం అని ఎంఎస్ఆర్ అంటాడు. ఈ విషయం గురించి నేను డైరెక్టుగా రిషీతోనే మాట్లాడి ఒప్పిస్తాను అని అంటాడు. అది ఎప్పటికీ జరగదు.. డీబీఎస్టీ కాలేజ్‌ను తన ఊపిరిగా మార్చుకున్నాడు నా కొడుకు రిషి అని జగతీ హెచ్చరించి అక్కడ నుంచి వెళ్తారు. చూస్తాను ఎలా జరగదో అని ఎంఎస్ఆర్ అనుకుంటాడు. మరి ఎంఎస్ఆర్.. రిషిని ఒప్పిస్తాడా? అతడి ట్రాప్‌లో రిషి పడతాడా? లేదా అనేది తెలియాలంటే వచ్చే ఎపిసోడ్ వరకు చూడాలి.