తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mrs Chatterjee Vs Norway Trailer: పిల్లల కోసం ఓ దేశంపైనే తల్లి చేసే పోరాటం.. కంటతడి పెట్టిస్తున్న ట్రైలర్

Mrs Chatterjee vs Norway trailer: పిల్లల కోసం ఓ దేశంపైనే తల్లి చేసే పోరాటం.. కంటతడి పెట్టిస్తున్న ట్రైలర్

Hari Prasad S HT Telugu

28 March 2023, 13:10 IST

google News
    • Mrs Chatterjee vs Norway trailer: పిల్లల కోసం ఓ దేశంపైనే తల్లి చేసే పోరాటంతో కంటతడి పెట్టిస్తోంది మిసెస్ ఛటర్జీ vs నార్వే మూవీ ట్రైలర్. నిజ జీవితంలో జరిగిన ఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ తన నటనతో అదరగొట్టింది.
మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే సినిమాలో రాణీ ముఖర్జీ
మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే సినిమాలో రాణీ ముఖర్జీ

మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే సినిమాలో రాణీ ముఖర్జీ

Mrs Chatterjee vs Norway trailer: మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే.. బాలీవుడ్ లో రాబోతున్న కొత్త సినిమా ఇది. రాణీ ముఖర్జీ నటించిన ఈ సినిమా ట్రైలర్ గురువారం (ఫిబ్రవరి 23) రిలీజైంది. నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ ఆలియా భట్ ను కంటతడి పెట్టించింది. అర్జున్ కపూర్ ను కూడా భావోద్వేగానికి గురి చేసింది.

పిల్లల బాగోగులను సరిగా చూడటం లేదంటూ ఓ బెంగాలీ తల్లి నుంచి నార్వే ప్రభుత్వం వాళ్లను వేరు చేసి ఫోస్టర్ కేర్ లో ఉంచుతుంది. తనకు దూరమైన తన పిల్లలను తిరిగి పొందడానికి ఆ తల్లి ఎలాంటి పోరాటం చేస్తుందో ఇందులో చూపించారు. ఆ తల్లి పాత్రలో రాణి ముఖర్జీ కనిపించింది. ఈ ట్రైలర్ ను చూసిన తర్వాత తాను కంటతడి పెట్టినట్లు ఆలియా చెప్పగా.. రాణి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇది అని డైరెక్టర్ కరణ్ జోహార్ అన్నాడు.

ఈ ట్రైలర్ ను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. "ఏడిపించేసింది. కదిలించే ట్రైలర్" అని ఆలియా చెప్పంది. అటు అభిషేక్ బచ్చన్ కూడా దీనిపై స్పందిస్తూ.. చాలా పవర్‌ఫుల్ గా కనిపిస్తోంది.. ఆల్ ద బెస్ట్ అని అన్నాడు. ఈ సినిమా చూసి ప్రభావితం కాని తల్లిదండ్రులు ఉండరు అంటూ డైరెక్టర్ కరణ్ జోహార్ ఈ ట్రైలర్ ను షేర్ చేసుకున్నాడు. రాణి ముఖర్జీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇది అని అన్నాడు.

ఆషిమా చిబ్బర్ డైరెక్ట్ చేసిన ఈ మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే మూవీ మార్చి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. పిల్లలకు స్పూన్ తో కాకుండా చేత్తో తినిపిస్తోందని, వాళ్ల బాగోగులు కూడా సరిగా చూడటం లేదని ఓ భారతీయ తల్లి నుంచి ఆమె పిల్లలను వేరు చేస్తుంది నార్వే ప్రభుత్వం. ఇది నిజ జీవితంలో జరిగిన ఘటన. దాని ఆధారంగానే ఇప్పుడీ మిసెస్ ఛటర్జీ సినిమాను తెరకెక్కించారు.

ఈ మూవీ ట్రైలర్ చూసి తాను వణికిపోయానని బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ అన్నాడు. నార్వేలోని ఫోస్టర్ కేర్ వ్యవస్థపై ఓ భారతీయురాలైన తల్లి చేసే పోరాటాన్ని అద్భుతంగా చిత్రీకరించారని అతడు చెప్పాడు. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు. ఈ సినిమాలో రాణి ముఖర్జీతోపాటు అనిర్బన్ భట్టాచార్య, జిమ్ సర్బా, నీనా గుప్తా కూడా నటించారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం