The Night Manager Web Series Review: ది నైట్ మేనేజ‌ర్ వెబ్‌సిరీస్ రివ్యూ - బాలీవుడ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ సిరీస్ ఎలా ఉందంటే-the night manager web series review anil kapoor aditya roy kapoor sobhita dhulipala web series review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  The Night Manager Web Series Review Anil Kapoor Aditya Roy Kapoor Sobhita Dhulipala Web Series Review

The Night Manager Web Series Review: ది నైట్ మేనేజ‌ర్ వెబ్‌సిరీస్ రివ్యూ - బాలీవుడ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ సిరీస్ ఎలా ఉందంటే

Nelki Naresh Kumar HT Telugu
Feb 23, 2023 06:27 AM IST

The Night Manager Web Series Review: అనిల్‌క‌పూర్‌, ఆదిత్య రాయ్‌క‌పూర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన బాలీవుడ్ వెబ్ సిరీస్ ది నైట్ మేనేజ‌ర్ ఇటీవ‌ల డిస్నీప్ల‌స్ హాట్‌స్టార్‌లో రిలీజైంది. ఈ సిరీస్ ఎలా ఉందంటే...

అనిల్‌క‌పూర్‌, ఆదిత్య రాయ్‌క‌పూర్
అనిల్‌క‌పూర్‌, ఆదిత్య రాయ్‌క‌పూర్

The Night Manager Web Series Review: 2016లో రిలీజైన బ్రిటీష్ సిరీస్ ది నైట్ మేనేజ‌ర్ పెద్ద విజ‌యాన్ని సాధించింది. ఈ సిరీస్‌ను అదే పేరుతో అనిల్‌క‌పూర్‌, ఆదిత్య రాయ్‌క‌పూర్ హిందీలో రీమేక్ చేశారు. ఈ సిరీస్‌కు ప్రియాంక ఘోష్‌, సందీప్ మోడీ, రుక్ న‌బీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. శోభిత ధూళిపాళ్ల మ‌రో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించింది. డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో ఫ‌స్ట్ సీజ‌న్ రిలీజైంది. క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సిరీస్ ఎలా ఉందంటే...

నైట్ మేనేజ‌ర్ అన్వేష‌ణ‌…

షాన్‌ అలియాస్ శాన్ సేన్ గుప్తా (ఆదిత్య రాయ్ క‌పూర్‌) ఢాకాలోని ఫైవ్‌స్టార్ హోట‌ల్‌లో నైట్ మేనేజ‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు. షాన్‌ ప‌నిచేసే హోట‌ల్ ఫ్రెడ్డీ రెహ‌మాన్ (రేష్ లంబా) అనే డేంజ‌ర‌స్ క్రిమిన‌ల్ స్టే చేస్తాడు. స‌ఫీనా అనే 14 ఏళ్ల అమ్మాయిని ఫ్రెడ్డి బ‌ల‌వంతంగా పెళ్లిచేసుకుంటాడు. ఫ్రెడ్డీ బారి నుంచి స‌ఫీనాను కాపాడి అత‌డు చేస్తోన్న అక్ర‌మ వ్యాపారాల గురించి రీసెర్చ్ అనాల‌సిస్ వింగ్ ఆఫీస‌ర్ లిపిక స‌కియా రావ్‌కు (తిలోత్త‌మ షోమ్‌) ఇన్ఫ‌ర్మేష‌న్ ఇస్తాడు షాన్‌. కానీ స‌మాచారం లీక్ కావ‌డంతో స‌ఫీనాను షాన్‌ క‌ళ్లుముందే చంపేస్తారు.

వారి బారి నుంచి షాన్‌ పారిపోయి సిమ్లాలోని ఓ హోట‌ల్‌లో నైట్‌మేనేజ‌ర్‌గా చేరుతాడు. త‌న వ‌ల్లే స‌ఫీనా చ‌నిపోయింద‌నే గిల్టీ ఫీలింగ్‌తో బ‌తుకుతుంటాడు. సిమ్లా హోట‌ల్‌కు శైలేంద్ర ర‌న్‌గుప్తా అలియాస్ షెల్లీ (అనిల్ క‌పూర్‌) త‌న ప్రియురాలు కావేరి( శోభిత ధూళిపాళ్ల‌)తో పాటు బిజినెస్ పార్ట్‌న‌ర్స్‌తో దిగుతాడు. స‌ఫీనా మ‌ర్డ‌ర్‌కు షెల్లీని కార‌ణ‌మ‌ని తెలుసుకున్న షాన్‌ అత‌డికి సంబంధించి కీల‌క స‌మాచారాన్ని మ‌రోసారి లిపిక‌కు పంపిస్తాడు.

షిప్పింగ్ బిజినెస్ పేరుతో షెల్లీ అక్ర‌మ ఆయుధాల్ని స‌ప్లై చేస్తున్నాడ‌ని తెలుసుకుంటారు. స‌రైన ఆధారాల‌తో చ‌ట్టానికి ప‌ట్టించ‌డం కోసం లిపిక కోరిక మేర‌కు షెల్లీ టీమ్‌లో చేర‌తాడు షాన్‌. ఆ త‌ర్వాత ఏమైంది. షెల్లీకి సంబంధించిన కీల‌క ర‌హ‌స్యాల్ని షాన్‌ సేక‌రించాడా? షెల్లీ టీమ్‌లో చేర‌డానికి షాన్‌ వేసిన ప్లాన్ ఫ‌లించాయా? షెల్లీకి షాన్‌పై న‌మ్మ‌కం కుదిరిందా? అన్న‌దే (The Night Manager Web Series Review)ఈ సిరీస్ క‌థ‌.

బ్రిట‌న్ వెబ్‌సిరీస్...

2016లో రూపొందిన బ్రిట‌న్‌ వెబ్ సిరీస్ ది నైట్ మేనేజ‌ర్‌కు ఇండియ‌న్ అడాప్ష‌న్‌గా క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ఈ సిరీస్ తెర‌కెక్కింది. అనిల్ క‌పూర్‌, ఆదిత్య‌రాయ్ క‌పూర్‌, శోభిత ధూళిపాళ్ల వంటి స్టార్స్ న‌టించ‌డంతో ఈ బాలీవుడ్ వెబ్‌సిరీస్ అంద‌రిలో ఆస‌క్తిని రేకెత్తించింది.

ఈ సిరీస్‌కు ప్రియాంక ఘోష్‌, సందీప్ మోడీ, రుక్ న‌బీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. భిన్న నేప‌థ్యాలు క‌లిగిన ముగ్గురు వ్య‌క్తుల జీవితాల్ని లింక్ చేస్తూ క‌థ‌ను రాసుకున్న విధానం బాగుంది.

ఎమోష‌న‌ల్‌గా…

క్యారెక్ట‌ర్స్ ఇంట్ర‌డ‌క్ష‌న్స్ తో టైమ్‌పాస్ చేయ‌కుండా రోహింగ్యాల హింస కాండ నేప‌థ్యంలో క‌థ మొద‌ల‌వ్వ‌డంతోనే ఈసిరీస్‌పై క్యూరియాసిటీని రేకెత్తించారు ద‌ర్శ‌క‌త్ర‌యం. ఫ్రెడ్డీ బారి నుంచి స‌ఫీనాన‌కు కాపాడ‌టానికి షాన్‌ చేసే ప్ర‌య‌త్నాలు, ఈ క్ర‌మంలో అత‌డు వేసిన ప్లాన్స్‌తో ఎమోష‌న‌ల్‌గా ఫ‌స్ట్ ఎపిసోడ్ సాగుతుంది.

అనిల్ క‌పూర్ ఎంట్రీ...

సెకండ్ ఎపిసోడ్‌లో అనిల్ క‌పూర్ ఎంట్రీ ఇవ్వ‌డంతోనే సిరీస్ ఆస‌క్తిక‌రంగా మారుతుంది. షెల్లీ చేసే ఇల్లీగ‌ల్ బిజినెస్‌కు సంబంధించి త‌న తెలివితేట‌ల‌ను ఉప‌యోగించి షాన్‌ స‌మాచారాన్ని సేక‌రించే సీన్స్ ఆస‌క్తిని పంచుతాయి. షెల్లీ టీమ్‌లో చేర‌డానికి లిపిక‌తో క‌లిసి షాన్‌వేసే ఎత్తుల‌ను డైరెక్ట‌ర్స్ ఇంట్రెస్టింగ్‌రాసుకున్నారు.(The Night Manager Web Series Review)

షెల్లీ నుంచి అత‌డిని పార్ట‌న‌ర్స్‌ను దూరం సీన్స్ ఆక‌ట్టుకుంటాయి. షాన్‌పై న‌మ్మ‌కంతో త‌న టీమ్‌లో అత‌డిని చేర్చుకోవ‌డంతో ఫ‌స్ట్ సీజ‌న్ ఎండ్ అవుతుంది. . ఓ వైపు షెల్లీ అక్ర‌మ బిజినెస్‌, మ‌రోవైపు షాన్‌ ఇన్వేస్టిగేష‌న్‌తో నాలుగు ఎపిసోడ్స్ ఉత్కంఠ‌ను పంచుతాయి. వాటితో పాటు త‌న పై అధికారుల స‌పోర్ట్ లేకుండా లిపిక ఎలా ఇన్వేస్టిగేష‌న్‌లో ఎలా భాగ‌మైందో చూపించిన సీన్స్ రియ‌లిస్టిక్‌గా ఉన్నాయి.

శోభిత గ్లామ‌ర్‌...

ఆదిత్య రాయ్ క‌పూర్ క్యారెక్ట‌ర్ ప్ర‌ధానంగా ఈ సిరీస్ సాగుతుంది. నైట్ మేనేజ‌ర్‌గా ప‌నిచేస్తూనే రీసెర్చ్‌ అనాల‌సిస్ ఏజెన్సీతో క‌లిసి ప‌నిచేసే వ్య‌క్తిగా డిఫ‌రెంట్ షేడ్స్ క్యారెక్ట‌ర్‌లో చ‌క్క‌టి వేరియేష‌న్స్‌ చూపించాడు.

షెల్లీ అనే ఇంట‌ర్‌నేష‌న‌ల్ క్రిమిన‌ల్‌గా అనిల్ క‌పూర్ క్యారెక్ట‌ర్ స్టైలిష్‌గా సాగింది. ఆయ‌న‌లోని విల‌నిజాన్ని చాటిచెప్పే సీన్స్ ఫ‌స్ట్ సీజ‌న్‌లో పెద్ద‌గా లేవు. గ్లామ‌ర్ ప‌రంగా శోభిత ధూలిపాళ్ల అట్రాక్ట్ చేసింది. బికినీలో మెరిసింది. లిపిక‌గా తిలోత్త‌మ షోమో యాక్టింగ్ బాగుంది.

The Night Manager Web Series Review- క్రైమ్ థ్రిల్ల‌ర్ సిరీస్‌…

ది నైట్ మేనేజ‌ర్ ఇన్వేస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్ సినిమాల్ని ఇష్ట‌ప‌డేవారిని త‌ప్ప‌కుండా మెప్పిస్తుంది. ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్, యాక్టింగ్ సినిమాల‌కు ధీటుగా ఉండ‌టం ప్ల‌స్‌.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.