తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Most Watched Movie Of The Year: ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన సినిమా ఇదే.. ఆ హారర్ కామెడీ మూవీ రికార్డు బ్రేక్..

Most Watched Movie of the year: ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన సినిమా ఇదే.. ఆ హారర్ కామెడీ మూవీ రికార్డు బ్రేక్..

Hari Prasad S HT Telugu

20 December 2024, 13:51 IST

google News
    • Most Watched Movie of the year: ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన సినిమాగా పుష్ప 2 మరో రికార్డును సొంతం చేసుకుంది. ఈ క్రమంలో బాలీవుడ్ హారర్ త్రిల్లర్ మూవీ స్త్రీ2 రికార్డును బ్రేక్ చేసినట్లు టికెట్ బుకింగ్ వెబ్ సైట్ బుక్ మై షో వెల్లడించింది.
ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన సినిమా ఇదే.. ఆ హారర్ కామెడీ మూవీ రికార్డు బ్రేక్..
ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన సినిమా ఇదే.. ఆ హారర్ కామెడీ మూవీ రికార్డు బ్రేక్..

ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన సినిమా ఇదే.. ఆ హారర్ కామెడీ మూవీ రికార్డు బ్రేక్..

Most Watched Movie of the year: పుష్ప 2 రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. బాక్సాఫీస్ దగ్గరే కాదు.. వేర్వేరు రికార్డులు ఈ సినిమా సొంతమవుతున్నాయి. తాజాగా బుక్ మై షో (Bookmyshow) ప్రకారం 2024లో ఎక్కువ మంది చూసిన సినిమాగా నిలవడం విశేషం. నిజానికి ఈ ఏడాది టాలీవుడ్, బాలీవుడ్ లలో ఎన్నో పెద్ద సినిమాలు రిలీజయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర హోరాహోరీ ఫైట్ సాగింది. చివరికి లేట్ గా వచ్చినా పుష్ప 2 అంతకుముందు వచ్చిన అన్ని సినిమాలను వెనక్కి నెట్టేసింది.

బుక్ మై షో ఎక్కువ మంది చూసిన సినిమా

2024 త్వరలోనే ముగుస్తోంది. క్యాలెండర్ మారబోతోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జరిగిన వాటిని నెమరేసుకోవడం సహజమే. అలా బుక్ మై షో కూడా #BookMyShowThrowback పేరుతో ఇయర్ ఎండ్ రిపోర్టును రిలీజ్ చేసింది. ఇందులో పుష్ప 2 ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన సినిమా అని బుక్ మై షో అనౌన్స్ చేయడం విశేషం.

బాలీవుడ్ లో ఈ ఏడాది రికార్డులు తిరగరాసిన హారర్ కామెడీ మూవీ స్త్రీ2ని వెనక్కి నెట్టింది. శుక్రవారం (డిసెంబర్ 20) బుక్ మై షో ఈ రిపోర్టు రిలీజ్ చేసింది. దీని ప్రకారం పుష్ప 2 మూవీ 10.8 లక్షల సోలో వ్యూయర్స్ ని సొంతం చేసుకున్నట్లు తెలిపింది. నిజానికి రిలీజ్ కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ ఈ బుక్ మై షోలో పుష్ప 2 పలు రికార్డులను క్రియేట్ చేసింది.

ఇక ఏడాదిలో ఒక రోజు అత్యధిక టికెట్లు అమ్ముడైన రికార్డు నవంబర్ 1 అని బుక్ మై షో తెలిపింది. ఆ రోజు రికార్డు స్థాయిలో ఏకంగా 2.3 మిలియన్ల టికెట్లు అమ్ముడైనట్లు వెల్లడించింది. ఈ ఏడాది రీరిలీజ్ అయిన సినిమాలకు కూడా టికెట్ల అమ్మకాలు భారీగా ఉన్నట్లు చెప్పింది.

మ్యూజిక్ షోల హవా

ఇక 2024లో లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ లకు కూడా భారీగా డిమాండ్ ఏర్పడినట్లు తాజా బుక్ మై షో రిపోర్టు స్పష్టం చేసింది. ఈ ఏడాది మొత్తంగా 319 నగరాల్లో జరిగిన 30,687 లైవ్ ఈవెంట్ల టికట్లను బుక్ మై షో అందుబాటులో ఉంచింది. ఈ ఏడాది వీటి టికెట్ల కొనుగోలు 18 శాతం మేర పెరిగినట్లు తెలిపింది. నిక్ జొనాస్, దిల్జిత్ దోసాంజ్, అరిజిత్ సింగ్ లాంటి వాళ్ల కాన్సర్ట్ లకు ఫుల్ డిమాండ్ ఉన్నట్లు చెప్పింది.

అంతేకాదు ఈ మ్యూజిక్ కాన్సర్ట్ ల కోసం ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లిన వారి సంఖ్య కూడా భారీగా పెరిగింది. 2024లో ఇలా 4,77,393 మంది మ్యూజిక్ లవర్స్ ఈ ఈవెంట్స్ కోసం మరో నగరానికి వెళ్లారు. అహ్మదాబాల్ లో జరిగిన కోల్డ్‌ప్లే మ్యూజిక్ ఆఫ్ ద స్పియర్స్ వరల్డ్ టూర్ కోసం ఏకంగా 500 నగరాల నుంచి అభిమానులు తరలిరావడం విశేషం. మొత్తంగా ఈ మ్యూజిక్ ఈవెంట్లకు 8,87,166 మంది ఫ్యాన్స్ హాజరైనట్లు బుక్ మై షో రిపోర్టు తెలిపింది. అటు బుక్ మై షో స్ట్రీమ్ ద్వారా కూడా ఏకంగా 1,07,023 గంటల కంటెంట్ ను ప్రేక్షకులు చూడటం విశేషం.

తదుపరి వ్యాసం