తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Megastar Chiranjeevi: నాని డైరెక్టర్‌కి నెక్ట్స్ మూవీ ఛాన్స్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. మరో మాస్ సినిమా రాబోతుందా?

Megastar Chiranjeevi: నాని డైరెక్టర్‌కి నెక్ట్స్ మూవీ ఛాన్స్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. మరో మాస్ సినిమా రాబోతుందా?

Galeti Rajendra HT Telugu

02 December 2024, 9:12 IST

google News
  • Megastar Chiranjeevi Next Movie: దసరా సినిమాలో నానికి డిఫరెంట్ లుక్‌లో చూపించిన శ్రీకాంత్ ఓదెల.. మెగాస్టార్‌ చిరంజీవితో సినిమా ఛాన్స్ కొట్టేశారు. ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న విశ్వంభర పూర్తియిన వెంటనే.. ఈ మూవీ పట్టాలెక్కనుంది. 

నాని, శ్రీకాంత్ ఓదెల, మెగాస్టార్ చిరంజీవి
నాని, శ్రీకాంత్ ఓదెల, మెగాస్టార్ చిరంజీవి

నాని, శ్రీకాంత్ ఓదెల, మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి వరుసగా యంగ్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం బింబిసారా దర్శకుడు వశిష్ఠతో విశ్వంభర సినిమా చేస్తున్న చిరంజీవి.. తన నెక్ట్స్ సినిమా ఛాన్స్ దసరా మూవీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకి ఇచ్చారు. సరికొత్త లుక్‌తో నానీకి మాస్ హిట్ అందించిన శ్రీకాంత్ ఓదెల.. చిరంజీవిని మరింత మాస్‌గా చూపించే అవకాశం ఉంది.

ఎట్టకేలకి ఫలించిన నిరీక్షణ

వాస్తవానికి నానితో శ్రీకాంత్ ఓదెల మరో సినిమా కూడా చేస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ప్యారడైజ్ అనే సినిమా రాబోతుండగా.. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా కంటే ముందే చిరంజీవికి కథ చెప్పిన శ్రీకాంత్ ఓదెల.. మెగా కాంపౌండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఇన్నాళ్లు ఎదురు చూసినట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు అతని నిరీక్షణ ఫలించి.. చిరంజీవి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.

విశ్వంభరతో చిరంజీవి బిజీ

దసరా తర్వాత ఓ మాస్ కథని సిద్ధం చేసిన శ్రీకాంత్ ఓదెల.. చిరంజీవికి వినిపించగా లైన్ బాగా నచ్చిందట. పూర్తి బౌండ్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేయమని మెగాస్టార్ చెప్పినట్లు తెలుస్తోంది. ఫ్యాంటసీ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న విశ్వంభర షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ మూవీ షూటింగ్‌లో చిరంజీవి బిజీగా ఉన్నారు. కొత్త చరిష్మాటిక్‌ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులకి సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తూ.. విజువల్ వండర్‌లా ఈ మూవీ ఉండబోతోందని చిత్ర యూనిట్ చెప్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ అంచనాల్ని మరింత పెంచేసింది.

వచ్చే ఏడాది పట్టాలెక్కనున్న మూవీ

అటు విశ్వంభర షూటింగ్ పూర్తి.. ఇటు నాని ‘ప్యారడైజ్’ మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాత.. చిరంజీవి -శ్రీకాంత్ ఓదెల మూవీ పట్టాలెక్కనుంది. చిరంజీవి వీరాభిమాని అయిన శ్రీకాంత్ ఓదెల.. దసరా తర్వాతే మెగాస్టార్‌తో సినిమా చేయాలని ఆశించారట. కానీ.. విశ్వంభర కారణంగా.. డేట్స్ దొరక్కపోవడంతో.. నానితో ప్యారడైజ్‌ను చేసి.. ఆ తర్వాత మెగాస్టార్‌తో సినిమా చేయబోతున్నారు.

తదుపరి వ్యాసం