Marvel Movies: రాబోయే మూడేళ్లలో మార్వెల్ స్టూడియోస్ నుండి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే...
24 July 2022, 10:39 IST
రాబోయే మూడేళ్లలో తమ సంస్థ నుండి రానున్న పలు సినిమాలు, వెబ్ సిరీస్ ల రిలీజ్ డేట్స్ ను మార్వెల్ స్టూడియోస్ (marvel studios) ప్రకటించింది. ఆ సినిమాలు, సిరీస్ లు ఏవంటే...
అవెంజర్స్ సీక్రెట్ వార్
మార్వెల్ స్టూడియోస్ రూపొందించే సినిమాలు, వెబ్ సిరీస్ లకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ సూపర్ హీరో సినిమాలకు కోసం చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. మార్వెల్ సంస్థ తెరకెక్కించిన అవెంజర్స్, ఐరన్‌మ్యాన్,కెప్టెన్ అమెరికాతో పలు సూపర్ హీరో సినిమాలు వరల్డ్‌వైడ్‌గా ప్రేక్షకుల్ని అలరించాయి. భారీ వసూళ్లను రాబట్టాయి. తాజాగా మార్వెల్ సంస్థ రూపొందించనున్న తదుపరి సినిమాలు,వెబ్సిరీస్‌ల రిలీజ్ డేట్స్‌ను ఆదివారం ప్రకటించింది.
బ్లాక్‌పాంథర్ సినిమాకు వకాండా ఫరెవర్ పేరుతో సీక్వెల్ రూపొందిస్తోంది. నవంబర్ 11 2022లో ఈ సూపర్ హీరో సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ సీక్వెల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. అవెంజర్స్ సిరీస్‌లో భాగంగా అవెంజర్స్ సీక్రెట్ వార్ అనే సినిమాను తెరకెక్కిస్తోంది. ఈ చిత్రాన్ని నవంబర్ 7 2025లో రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించింది. అలాగే అవెంజర్స్ ది కాంగ్ ఆఫ్ డెస్టినీ సినిమాను మే 2 2025 ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ఫెంటాస్టిక్ ఫోర్ చిత్రాన్ని నవంబర్ 8 2024లో రిలీజ్ చేయనున్నట్లు పేర్కొన్నది.
థండర్‌బోల్ట్స్ ను జూలై 26 2024 విడుదల చేయనున్నట్లు చెప్పింది.కెప్టెన్ అమెరికా న్యూ వరల్డ్ ఆర్డర్ సినిమా మే 2 2024 లో రిలీజ్ కానుంది. బ్లేడ్ చిత్రాన్ని నవంబర్ 3 2023 లో విడుదలచేయబోతున్నారు. గార్డియన్ ఆఫ్ గెలాక్సీ సినిమాను మే 5 2023 ప్రేక్షకుల ముందుకు తీసుకున్నారు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ రిలీజ్ డేట్స్ ను వెల్లడించింది. డెవిల్ బోర్న్ అగైన్ సిరీస్ 2024లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు మార్వెల్ స్టూడియోస్ ప్రకటించింది. అగాథా కొవెన్ ఆఫ్ ఛావోస్ సిరీస్ ఐరాన్ హార్ట్,లోకి సీజన్ 2,ఏకో,సిరీస్‌లను వచ్చే ఏడాది రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది.
టాపిక్