తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Zte Blade A72 | శాంసంగ్ ఫోన్‌లను పోలినట్లుగా 'బ్లేడ్ సిరీస్‌' స్మార్ట్‌ఫోన్లు!

ZTE Blade A72 | శాంసంగ్ ఫోన్‌లను పోలినట్లుగా 'బ్లేడ్ సిరీస్‌' స్మార్ట్‌ఫోన్లు!

HT Telugu Desk HT Telugu

12 June 2022, 12:50 IST

google News
    • చైనీస్ మొబైల్ కంపెనీ ZTE కొరియన్ ప్రముఖ మొబైల్ బ్రాండ్ అయిన శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌లను పోలినట్లుగా రెండు సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఆ వివరాలు చూడండి..
ZTE Blade A72
ZTE Blade A72

ZTE Blade A72

మొబైల్ తయారీదారు ZTE తాజాగా తమ బ్రాండ్ నుంచి బ్లేడ్ సిరీస్‌లో కొత్తగా రెండు స్మార్ట్‌ఫోన్‌లను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. ZTE Blade A72, ZTE Blade A52 అనే పేర్లతో విడుదలైన స్మార్ట్‌ఫోన్‌లలోని ఫీచర్లు, స్పెసిఫికేషన్లు దాదాపు శాంసంగ్ ఫోన్‌లలో ఉన్నట్లుగానే ఉన్నాయి. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ సీపీయూ అలాగే 6,000 mAh సామర్థ్యం కలిగిన మెరుగైన బ్యాటరీ ప్యాక్ కలిగి ఉండటం ప్రధాన ఆకర్షణలు. అంతేకాకుండా ఇవి సరసమైన ధరల్లోనే లభించనున్నాయి. ఈ రెండు ఫోన్ల ధరలు రూ. 10 వేల లోపే ఉన్నాయి.

ఇంకా ఈ ఫోన్లలోని ఇతర ఫీచర్లు, స్పెసిఫికేషలు ఎలా ఉన్నాయో చూడండి.

ZTE Blade A72 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

90Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే

3 GB ర్యామ్, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్

ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ Unisoc SC9863A ప్రాసెసర్

వెనుకవైపు 13+2+2 ట్రిపుల్ డిజికామ్ సెటప్‌, ముందువైపు 5 MP సెల్ఫీ షూటర్

ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్

6000 mAh బ్యాటరీ సామర్థ్యం

ధర, సుమారు రూ. 9,000/-

ZTE Blade A52 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

60Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.51 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే

2 GB ర్యామ్, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్

ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ Unisoc SC9863A ప్రాసెసర్

వెనుకవైపు 13+2+2 ట్రిపుల్ డిజికామ్ సెటప్‌, ముందువైపు 5 MP సెల్ఫీ షూటర్

ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్

5000 mAh బ్యాటరీ సామర్థ్యం

ధర, సుమారు రూ. 7,000/-

ప్రస్తుతం ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లను మలేషియాలో కొనుగోలుదారులకు అందుబాటులోకి వచ్చాయి. ఇండియన్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తాయనేది కంపెనీ ఇంకా వెల్లడించలేదు. 

తదుపరి వ్యాసం