తెలుగు న్యూస్  /  Entertainment  /  Manushi Chillar Wants To Go Date With Ram Charan

Manushi Chillar | చరణ్‌పై మనస్సు పారేసుకున్న ప్రపంచ సుందరి.. డేట్‌కు రెడీ..!

03 June 2022, 21:42 IST

    • 2017లో ప్రపంచ సుందరిగా నెగ్గిన మానుషి చిల్లర్.. పృథ్వీరాజ్ సినిమాతో హిందీలో అరంగేట్రం చేసింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తన అభిమాన హీరో, డేట్‌కు వెళ్లాలనుకునే వ్యక్తి గురించి తెలియజేసింది.
రామ్ చరణ్-మానుషి
రామ్ చరణ్-మానుషి (HT)

రామ్ చరణ్-మానుషి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన నటనతో ఇప్పటికే చాలా మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయిన తర్వాత పాన్ఇండియా స్థాయిలో అదిరిపోయే హిట్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో బాలీవుడ్ హీరోయిన్లు కూడా ఆయనతో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ ఓ అడుగు ముందుకేసి చరణ్‌తో డేటింగ్ చేయాలనుందని తన మనస్సులో మాట చెప్పేసింది. హిందీలో తన తొలి చిత్రమైన సామ్రాట్ పృథ్వీరాజ్ చిత్ర ప్రమోషన్లలో భాగంగా మీడియాతో ఇంటర్వ్యూ సందర్భంగా ఈ విషయాలను తెలియజేసింది.

ట్రెండింగ్ వార్తలు

Mahesh Babu new look: పెళ్లి వేడుకకు కొత్త లుక్‌లో మహేష్ బాబు.. జుట్టు పట్టుకొని ఆట పట్టించిన అక్క మంజుల

Theatre releases this week: ఈ వారం థియేటర్లలోకి రానున్న 5 సినిమాలు.. డిఫరెంట్ జానర్లతో..

Bullet 50 Days: ప్రభాస్, గోపీచంద్ లాగా రవి వర్మ.. పాపులర్ డైరెక్టర్ కామెంట్స్

Biggest Flop Movie: ఒక్క సినిమాతోనే రూ.170 కోట్ల నష్టం.. ఇండియన్ సినిమాలో భారీ నష్టాలను మిగిల్చిన మూవీస్ ఇవే

మానుషిని తన ఫేవరెట్ హీరో ఎవరని అడుగ్గా.. తనకు రామ్ చరణ్ అంటే చాలా ఇష్టమని బదులిచ్చింది. అంతేకాకుండా తన తర్వాతి చిత్రం ఎవరితో చేయాలనుందని అడుగ్గా.. తిరిగి రామ్ చరణ్ అనే సమాధానమిచ్చింది. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమా చూశానని, అందులో చరణ్ నటన చూసి ఆయనకు అభిమానిగా మారినట్లు స్పష్టం చేసింది.

మరో ఇంటర్వ్యూలో చిత్రసీమలో ఈ హీరోతో డేటింగ్‌కు వెళ్లాలనుందని మానుషిని అడుగ్గా.. అప్పుడు కూడా తన సమాధానంలో ఎలాంటి మార్పు లేదు. తిరిగి రామ్ చరణ్ అనే బదులిచ్చింది. అయితే ఆయనకు ఇప్పటికే వివాహం జరిగింది కదా అని ప్రశ్నించగా.. ఒకవేళ చరణ్‌కు పెళ్లి కాకపోతే తప్పకుండా ఆయనను డేటింగ్‌కు వెళ్దామని అడిగేదాన్నని తెలిపింది. అయితే డేటింగ్‌లో ఏం చేసేవారని ప్రశ్నించగా.. ఇద్దరం తమకు ఇష్టమైన భోజనం తినేవాళ్లమని, కలిసి సినిమా చూసేవాళ్లమని, ఇంకా బోలెడన్ని కబుర్లు చెప్పుకునే వాళ్లమని సమాధానమిచ్చింది. మొత్తానికి మన మెగా పవర్ స్టార్‌ను ఈ ప్రపంచ సుందరి విపరీతంగా అభిమానిస్తుందని తెలుస్తుంది.

ఆమె నటించిన తొలి చిత్రం సామ్రాట్ పృథ్వీరాజ్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇది పృథ్వీరాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కింది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.