తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Akshay Kumar | మన చరిత్ర మొత్తం మొఘల్స్‌ గురించే.. మరి పృథ్విరాజ్‌ సంగతేంటి?

Akshay Kumar | మన చరిత్ర మొత్తం మొఘల్స్‌ గురించే.. మరి పృథ్విరాజ్‌ సంగతేంటి?

HT Telugu Desk HT Telugu

01 June 2022, 20:55 IST

google News
    • బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ నటించిన సామ్రాట్‌ పృథ్వీరాజ్‌ ఈ శుక్రవారం రిలీజ్‌ కాబోతోంది. ఈ సందర్భంగా మన పుస్తకాల్లోని చరిత్ర గురించి అక్షయ్‌ చేసిన కామెంట్స్‌పై ట్విటర్‌లో ఓవైపు విమర్శలు, మరోవైపు సమర్థనలు వస్తున్నాయి.
ఏఎన్ఐ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న అక్షయ్ కుమార్
ఏఎన్ఐ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న అక్షయ్ కుమార్ (ANI)

ఏఎన్ఐ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న అక్షయ్ కుమార్

అక్షయ్‌ కుమార్‌, మిస్‌ వరల్డ్‌ మానుషి చిల్లార్‌ నటించిన సామ్రాట్‌ పృథ్వీరాజ్‌ రిలీజ్‌కు టైమ్‌ దగ్గర పడింది. మేకర్స్‌ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే దేశంలోని ప్రతి స్కూల్లోనూ ఈ సినిమా చూసేలా చిన్నారులను ఎంకరేజ్‌ చేయాలని పిలుపునిచ్చిన అక్షయ్‌కుమార్‌.. తాజాగా ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మన చరిత్ర పుస్తకాలపై చేసిన కామెంట్స్‌ వైరల్ అవుతున్నాయి.

ఈ కామెంట్స్‌పై కొందరు నెగటివ్‌గా స్పందిస్తుండగా.. మరికొందరు అక్షయ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. మన చరిత్ర పుస్తకాల్లో దేశాన్ని ఆక్రమించిన వాళ్ల గురించి చాలా సమాచారం ఉంది కానీ.. సామ్రాట్ పృథ్విరాజ్‌ గురించి రెండు, మూడు లైన్లు మాత్రమే ఉందంటూ అక్షయ్‌ విమర్శించాడు. "దురదృష్టవశాత్తూ మన చరిత్ర పుస్తకాల్లో సామ్రాట్ పృథ్వీరాజ్‌ గురించి కేవలం 2-3 లైన్స్‌ మాత్రమే ఉన్నాయి. కానీ ఆక్రమణదారుల గురించి చాలా సమాచారం ఉంది. మన సంస్కృతి గురించి, మన రాజుల గురించి ఏ సమాచారం లేదు. మన చరిత్ర పుస్తకాల్లో వాళ్ల గురించి రాసేవాళ్లే లేరు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని నేను విద్యాశాఖ మంత్రిని కోరుతున్నాను. మొఘల్స్‌ గురించి తెలుసుకోవాల్సిందే. కానీ మన రాజుల సంగతేంటి. వాళ్లు కూడా గొప్పవాళ్లే" అని అక్షయ్‌ అన్నాడు.

ఈ కామెంట్స్‌పై ట్విటర్‌ రెండుగా చీలిపోయింది. అసలు మొఘల్స్‌ ఉన్న టైమ్‌ ఏంటి? పృథ్వీరాజ్‌ ఉన్న టైమ్‌ ఏంటి అని కొందరు ప్రశ్నిస్తే.. పృథ్వీరాజ్‌ గురించి ఎన్ని చాప్టర్లు మన పుస్తకాల్లో ఉన్నాయో మరికొందరు చెప్పుకొచ్చారు. నువ్వు స్కూల్లో మార్షల్‌ ఆర్ట్స్‌ కాకుండా చరిత్ర పుస్తకాలు సరిగ్గా చదివి ఉంటే ఇప్పుడీ ప్రశ్న అడిగేవాడివి కాదని మరొకరు కామెంట్ చేశారు. మౌర్యులు, గుప్తులు, చోళులు, చాళుక్యుల గురించి మన పుస్తకాల్లో ఉన్నాయి కదా అని ఇంకొకరు ప్రశ్నించారు.

ఇక మరికొందరు ట్విటర్‌ యూజర్లు మాత్రం అక్షయ్‌కు మద్దతుగా ట్వీట్లు చేశారు. అక్షయ్‌ చెప్పినట్లు మన పుస్తకాల్లో మన రాజుల గురించి వివరంగా ఎప్పుడూ చెప్పలేదని ఓ యూజర్‌ ట్వీట్‌ చేశాడు. పృథ్వీరాజ్‌ చౌహాన్‌ జీవితచరిత్ర ఆధారంగా ఈ సామ్రాట్‌ పృథ్వీరాజ్‌ మూవీ తెరకెక్కింది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం