తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aadujeevitham Trailer: ఉత్కంఠభరితంగా ఆడుజీవితం ట్రైలర్.. మరో మాస్టర్‌ పీస్ కానుందా!

Aadujeevitham Trailer: ఉత్కంఠభరితంగా ఆడుజీవితం ట్రైలర్.. మరో మాస్టర్‌ పీస్ కానుందా!

09 March 2024, 15:17 IST

google News
    • The Goat Life Aadujeevitham Trailer: ఆడు జీవితం - ది గోట్ లైఫ్ సినిమా ట్రైలర్ వచ్చేసింది. పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా ట్రైలర్ ఉత్కంఠ భరితంగా ఉంది. సర్వైవల్ యాక్షన్ మూవీగా ఈ చిత్రం వస్తోంది.
Aadujeevitham Trailer: పృథ్విరాజ్ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా ట్రైలర్ వచ్చేసింది.. ఉత్కంఠ భరితంగా..
Aadujeevitham Trailer: పృథ్విరాజ్ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా ట్రైలర్ వచ్చేసింది.. ఉత్కంఠ భరితంగా..

Aadujeevitham Trailer: పృథ్విరాజ్ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా ట్రైలర్ వచ్చేసింది.. ఉత్కంఠ భరితంగా..

Aadujeevitham Trailer: ‘ఆడుజీవితం - ది గోట్‍లైఫ్’ సినిమాపై కొంతకాలంగా విపరీతమైన ఆసక్తి నెలకొంది. మలయాళ స్టార్ యాక్టర్ పృథ్విరాజ్ సుకుమారన్ ఈ మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. డైరెక్టర్ బ్లెస్సీ సుమారు 10 ఏళ్ల పాటు ఈ సినిమా కోసమే సమయం అంకితం చేశారు. సర్వైవల్ థ్రిల్లర్ మూవీగా ఆడుజీవితం వస్తోంది. ఈ సినిమా ట్రైలర్ నేడు (మార్చి 9) వచ్చేసింది.

ఎడారిలో సవాళ్లు

మిడిల్ ఈస్ట్ దేశంలో చిక్కుకుపోయిన నజీబ్ అనే పాత్రను ఆడుజీవితం మూవీలో చేశారు పృథ్విరాజ్ సుకుమారన్. ఎడారిలో శారీరక, మానసిక సంఘర్షణను ఎదుర్కొంటుంటాడు. ఇక్కడ లోపలి నుంచి ఎవరూ తప్పించుకోలేరంటూ ఈ ట్రైలర్‌లో వాయిస్ ఓవర్ వినిపిస్తూ ఉంటోంది. ఎడారిలో చాలా సవాళ్లు ఇబ్బందులను నజీబ్ ఎదుర్కొంటాడు. తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ ట్రైలర్లో అమలాపాల్ కూడా కనిపించారు. లవ్ స్టోరీ కూడా ఈ చిత్రంలో ప్రధానంగా ఉండనుంది. సైనూ పాత్రను అమల పోషించారు.

ట్రైలర్ ఎలా ఉందంటే..

అడ్వెంచర్ సర్వైవల్ థ్రిల్లర్ ఆడుజీవితం ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. 1 నిమిషం 33 సెకన్ల పాటు ఉన్న ఈ ట్రైలర్ ఇంటెన్స్‌గా ఉంది. పృథ్విరాజ్ సుకుమారన్‍కు తన కెరీర్లోనే ఒకానొక బెస్ట్ క్యారెక్టర్‌గా ఇది నిలువడం కచ్చితం అనిపిస్తోంది. ఆయన మేకోవర్, యాక్టింగ్ వావ్ అనిపిస్తున్నాయి. సునీల్ కేఎస్.. సినిమాటోగ్రఫీ టాప్ నాచ్‍గా ఉంది. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రహమాన్ ఇచ్చిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఇంటెన్సిటీని పెంచింది. దర్శకుడు బ్లెస్సీ టైకింగ్ కూడా అద్భుతంగా సాగింది. ట్రైలర్‌తో ఈ మూవీ అంచనాలను మరింత పెంచేసింది.

యథార్థ కథ ఆధారంగా..

రచయిత బెన్యామిన్ రాసిన ఆడుజీవితం బుక్ ఆధారంగా అదే పేరుతో ఈ చిత్రాన్ని దర్శకుడు బ్లెస్సీ తెరకెక్కించారు. యదార్థ కథ ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. సౌదీ అరేబియాకు ఉపాధి కోసం వెళ్లి.. బలవంతంగా బానిసగా గొర్రెల కాపరీగా మారిన ఓ వ్యక్తి నిజజీవిత కథ ఆధారంగా ఈ మూవీ వస్తోంది. ఆ ఏడారి నుంచి అతడు ఎలా బయటపడ్డారనేదే ఈ ఆడుజీవితం స్టోరీగా ఉండనుంది.

ఆడుజీవితం సినిమా మార్చి 28వ తేదీన పాన్ ఇండియా రేంజ్‍లో విడుదల కానుంది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, తమిళం భాషల్లో రిలీజ్ అవుతుంది. ఆడుజీవితం కోసం పదేళ్ల పాటు కష్టపడ్డారు దర్శకుడు బ్లెసీ. ఆయన ఈ మూవీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని చాలా పరిశోధన చేసి తెరకెక్కించారు. స్టోరీ, టెక్నికల్ అంశాలను చూస్తుంటే ఈ సినిమా అంతర్జాతీయ రేంజ్‍లో కనిపిస్తోంది. మలయాళం ఇండస్ట్రీ నుంచి మరో మాస్టర్ పీస్ మూవీ వస్తుందనే అంచనాలను పెంచింది.

మ్యూజిక్ లాంచ్ ఈవెంట్

ఆడుజీవితం సినిమా ప్రమోషన్లను కూడా మూవీ టీమ్ జోరుగా చేస్తోంది. ఇందులో భాగంగా మ్యూజిక్ లాంచ్ జరగనుంది. మార్చి 10వ తేదీన కొచ్చిలో ఈ ఈవెంట్ జరగనుంది. ఏఆర్ రహమాన్ ఈ ఈవెంట్‍లో లైవ్ పర్ఫార్మెన్స్ చేయనున్నారు. మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు ఈ ఈవెంట్‍లో పాల్గొననున్నారు. భారీ స్థాయిలో ఈ ఈవెంట్‍కు మూవీ టీమ్ ప్లాన్ చేసింది.

ఆడుజీవితం చిత్రాన్ని బ్లెస్సీ, జిమ్మి జీన్ లూయిస్, స్టీవెన్ ఆడమ్స్ నిర్మిస్తున్నారు. పృథ్విరాజ్, అమలాపాల్‍తో పాటు జిమ్మీ, రిక్ అబీ కూడా ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం