తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Action Thriller Ott: ఓటీటీలోకి మమ్ముట్టి బ్లాక్‍బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. డేట్ ఇదే.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Action Thriller OTT: ఓటీటీలోకి మమ్ముట్టి బ్లాక్‍బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. డేట్ ఇదే.. తెలుగులోనూ స్ట్రీమింగ్

30 July 2024, 14:00 IST

google News
    • Turbo OTT Release Date: టర్బో సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది. తెలుగులో కూడా స్ట్రీమింగ్‍కు రానుంది.
Action Thriller OTT: ఓటీటీలోకి మమ్ముట్టి బ్లాక్‍బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. డేట్ ఇదే.. తెలుగులోనూ స్ట్రీమింగ్
Action Thriller OTT: ఓటీటీలోకి మమ్ముట్టి బ్లాక్‍బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. డేట్ ఇదే.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Action Thriller OTT: ఓటీటీలోకి మమ్ముట్టి బ్లాక్‍బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. డేట్ ఇదే.. తెలుగులోనూ స్ట్రీమింగ్

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి.. వివిధ జానర్లలో విభిన్నమైన చిత్రాలు చేస్తున్నారు. మంచి విజయాలు సాధిస్తున్నారు. మమ్ముట్టి మెయిన్ రోల్ చేసిన ఫోక్ హారర్ చిత్రం భ్రమయుగం ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చి సూపర్ హిట్ అయింది. దీని తర్వాత యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘టర్బో’ చేశారు మమ్ముట్టి. ఈ చిత్రం మే 23వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీ కూడా హిట్ సాధించింది. టర్బో సినిమా ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టేందుకు రెడీ అయింది.

స్ట్రీమింగ్ డేట్

టర్బో సినిమా ఆగస్టు 9వ తేదీన సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవనుంది. ఈ చిత్రంలో మమ్ముట్టి మెయిన్ రోల్ చేయగా.. కన్నడ స్టార్ రాజ్ బీ శెట్టి విలన్ పాత్ర పోషించారు.

టర్బో చిత్రం థియేటర్లలో మలయాళంలో మాత్రమే రిలీజ్ అయింది. అయితే, ఓటీటీలోకి తెలుగు, తమిళం, కన్నడ, హిందీ డబ్బింగ్ వెర్షన్‍లను కూడా సోనీలివ్ తీసుకొస్తోంది. ఈ మూవీ ఓటీటీలోనూ సూపర్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

టర్బో చిత్రానికి వైశాఖ్ దర్శకత్వం వహించారు. పక్కా యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని హీరో మమ్ముట్టినే నిర్మించారు. ఈ సినిమాకు మిధున్ మాన్యుయెల్ థామస్ కథ అందించారు. టర్బో మూవీలో మమ్ముట్టి, రాజ్ బీ శెట్టితో పాటు అంజన జయప్రకాశ్, షబరీష్ వర్మ, సునీల్, కబీర్ దుహాన్ సింగ్, నిరంజన అనూప్ కీలకపాత్రలు పోషించారు.

కలెక్షన్లు ఇలా..

టర్బో చిత్రానికి సుమారు రూ.70 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ దాదాపు రూ.23 కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. మొదట్లో కాస్త మిక్స్డ్ టాక్ వచ్చిన బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం బాగా పర్ఫార్మ్ చేసింది. మమ్ముట్టి మరోసారి తన యాక్టింగ్‍తో అదరగొట్టారు. టర్బో మూవీకి క్రిస్టో గ్జేవియర్ సంగీతం అందించగా.. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ చేశారు.

టర్బో స్టోరీ

జీప్ డ్రైవర్‌గా చేసే టర్బో జోస్ పాత్రను ఈ సినిమాలో పోషించారు మమ్ముట్టి. క్రిస్మస్ పండుగ జరుపునేందుకు తన సొంత ఊరు ఉడుక్కికి వస్తాడు జోస్. ఆ సమయంలో తన స్నేహితుడు జెర్రీ (శబరీష్ వర్మ)పై కొందరు దాడి చేయగా.. జోస్ కాపాడతాడు. ఇందులేఖ (అంజనా జయప్రకాశ్)ను జెర్రీ ప్రేమిస్తుంటాడు. ఈ దాడికి అదే కారణమని జోస్ తెలుసుకుంటాడు. జెర్రీ, ఇందులేఖను ఒక్కటి చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇంటి నుంచి ఇందును తీసుకొచ్చేస్తాడు. అయితే, ఇందులేఖను జోస్ తీసుకొచ్చాక ఆమె ఎవరో తెలియదని జెర్రీ అంటాడు. జోస్‍పై కిడ్నాప్ కేసు నమోదవటంతో చెన్నైకు వెళ్లిపోతాడు. ఇందులేఖ కూడా చెన్నైలోనే ఉంటుంది. ఆమెను చంపేందుకు గ్యాంగ్‍స్టర్ షణ్ముగ సుందరం (రాజ్ బీ శెట్టి) ప్రయత్నిస్తుంటాడు. అసలు ఇందులేఖ తెలియదని జెర్రీ ఎందుకు చెప్పాడు? ఇందులేఖను షణ్ముగ నుంచి జోస్ కాపాడాడా? బ్యాంక్ స్కామ్ మిస్టరీ ఏంటి? అనేది టర్బో సినిమాలో ముఖ్యమైన అంశాలుగా ఉంటాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం