తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Malayalam: మలయాళంకు దగ్గరిగా తెలుగు.. ఆ గొర్రెలకు తేడా: మలయాళ డైరెక్టర్ కామెంట్స్

Malayalam: మలయాళంకు దగ్గరిగా తెలుగు.. ఆ గొర్రెలకు తేడా: మలయాళ డైరెక్టర్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

24 March 2024, 6:06 IST

google News
  • Malayalam Director Blessy The Goat Life: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన లేటెస్ట్ సినిమా ది గోట్ లైఫ్. దీన్ని తెలుగులో ఆడు జీవితం టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. ఇటీవల జరిగిన ది గోట్ లైఫ్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌లో తెలుగు భాషపై డైరెక్టర్ బ్లెస్సీ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

మలయాళంకు దగ్గరిగా తెలుగు.. ఆ గొర్రెలకు తేడా: మలయాళ డైరెక్టర్ కామెంట్స్
మలయాళంకు దగ్గరిగా తెలుగు.. ఆ గొర్రెలకు తేడా: మలయాళ డైరెక్టర్ కామెంట్స్

మలయాళంకు దగ్గరిగా తెలుగు.. ఆ గొర్రెలకు తేడా: మలయాళ డైరెక్టర్ కామెంట్స్

Director Blessy About Telugu Language: మలయాళంలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన పృథ్వీరాజ్ సుకుమారన్ లేటెస్ట్ మూవీ ది గోట్ లైఫ్ (తెలుగులో ఆడు జీవితం). ఈ చిత్రాన్ని మలయాళంతోపాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా మార్చి 28న విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ తెరకెక్కించారు. ఇటీవల జరిగిన ది గోట్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మలయాళ డైరెక్టర్ బ్లెస్సీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

"తెలుగు స్టేట్స్‌లో మా సినిమాను రిలీజ్ చేస్తున్న మైత్రీ మూవీ రవి గారికి, శశి గారికి థ్యాంక్స్. తెలుగు ఆడియెన్స్ అందరికీ కృతజ్ఞతలు. తెలుగు నాకు ఇష్టమైన భాష. మలయాళంకు దగ్గరగా ఉంటుంది. నెక్ట్ టైమ్ తెలుగులో మాట్లాడుతాను. మొదట ఈ సినిమాను రాజస్థాన్ ఎడారిలో షూట్ చేయాలని అనుకున్నాం. అయితే అక్కడ డీప్ డెజర్ట్ లొకేషన్స్ దొరకలేదు. అరేబియన్ గొర్రెలకు మన వాటికి తేడా ఉంటుంది. ఇలాంటి డీటెయిల్స్ వల్ల విదేశాలకు వెళ్లి షూటింగ్ చేశాం" అని డైరెక్టర్ బ్లెస్సీ అన్నారు.

"మేము షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు యూఎస్ డాలర్‌కు ఇండియా రూపీ మారకం 60 రూపాయలు. ఇప్పుడది 83 రూపాయల దాకా వచ్చింది. ఈ ఫ్లక్షువేషన్ మా బడ్జెట్ మీద ప్రభావం చూపించింది. దాదాపు 150 రోజులు ఎడారిలో షూటింగ్ చేశాం. అక్కడ ఖర్చు ఎక్కువైంది. బడ్జెట్ పెరిగినా మేము అనుకున్న ఫీల్ సినిమాలో తీసుకురాగలిగాం" అని ది గోట్ లైఫ్ డైరెక్టర్ బ్లెస్సీ చెప్పుకొచ్చారు. కాగా ది గోట్ లైఫ్ సినిమాను గోట్ డేస్ నవల ఆధారంగా రూపొదించారు.

విజువల్ రొమాన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ది గోట్ లైఫ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, డైరెక్టర్ బ్లెస్సీ, హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ లూయిస్‌తోపాటు మూవీని తెలుగులో విడుదల చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవి శంకర్ యెర్నేని, శశి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాలీవుడ్ యాక్టర్ తన భావాలను పంచుకున్నాడు.

"నేను నటించిన మొదటి భారతీయ చిత్రమిది. ది గోట్ లైఫ్ వంటి అద్భుతమైన చిత్రంతో ఇండియన్ ఆడియెన్స్‌కు పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నేను ఇబ్రహీం ఖాద్రీ అనే క్యారెక్టర్‌లో నటించాను. ఇదొక కీలక పాత్ర. హీరో క్యారెక్టర్ నజీబ్ చేస్తున్న సుదీర్ఘ ప్రయాణంలో అతనికి హెల్ప్ చేసే క్యారెక్టర్ నాది. ఈ సినిమా కోసం ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో షూటింగ్ చేసిన కాస్ట్ అండ్ క్రూ అందరినీ అప్రిషియేట్ చేయాలి" అని జిమ్మీ జీన్ లూయిస్ తెలిపాడు.

"జోర్డాన్ వంటి కంట్రీస్‌లో షూటింగ్ చేశాం. నెలలు, ఏళ్లుగా చిత్రీకరణ సాగింది. ఒక టైమ్‌లో ది గోట్ లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి చేయగలమా లేదా అనిపించింది. కానీ, మా డైరెక్టర్ బ్లెస్సీ పట్టుదలగా చిత్రీకరణ పూర్తి చేశాడు. ఈ సినిమా కోసం వివిధ నగరాల్లో ప్రమోషన్ చేస్తున్నాం. ఈ నెల 28న థియేటర్స్‌లో ది గోట్ లైఫ్/ఆడు జీవితం సినిమా చూడండి. మీరు తప్పకుండా థ్రిల్ అవుతారు" అని యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్ చెప్పుకొచ్చాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం