తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mahesh Babu On Krishna: నాన్న అభిమానుల్లో నేను ఒక‌డిని - కృష్ణ జ‌యంతి సందర్భంగా మ‌హేష్ ఎమోష‌న‌ల్ పోస్ట్‌

Mahesh Babu on Krishna: నాన్న అభిమానుల్లో నేను ఒక‌డిని - కృష్ణ జ‌యంతి సందర్భంగా మ‌హేష్ ఎమోష‌న‌ల్ పోస్ట్‌

HT Telugu Desk HT Telugu

31 May 2023, 12:16 IST

google News
  • Mahesh Babu on Krishna: త‌న తండ్రి, సూప‌ర్ స్టార్ కృష్ణ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న్ని స్మ‌రించుకుంటూ ఎమోష‌న‌ల్ లెట‌ర్‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు మ‌హేష్‌బాబు. అంతే కాకుండా త్రివిక్ర‌మ్ సినిమాలోని కొత్త లుక్‌ను రిలీజ్ చేశాడు.

మ‌హేష్‌బాబు
మ‌హేష్‌బాబు

మ‌హేష్‌బాబు

Mahesh Babu on Krishna: తండ్రి, సూప‌ర్ స్టార్ కృష్ణ జ‌యంతి రోజున సోష‌ల్ మీడియాలో ఎమోష‌న‌ల్ లెట‌ర్ రిలీజ్ చేశాడు మ‌హేష్‌బాబు (Mahesh Babu). కృష్ణ మోస‌గాళ్ల‌కు మోస‌గాడు మూవీ రీ రిలీజ్ అవుతోండ‌టంపై ఆనందం వ్య‌క్తం చేశాడు. తండ్రి కృష్ణ కోట్లాది అభిమానుల్లో తాను ఒక‌డిన‌ని మ‌హేష్‌బాబు ఈ లెట‌ర్‌లో పేర్కొన్నాడు. అభిమానులంద‌రికీ సూప‌ర్ స్టార్ కృష్ణ‌గారు ప‌ద్మాల‌య స్టూడియోస్ బ్యాన‌ర్‌పై తీసిన ఎన్నో గొప్ప సినిమాల్లో మోస‌గాళ్ల‌కు మోస‌గాడు అంటే ప్ర‌త్యేక‌మైన ప్రేమ‌, అభిమానం ఉన్నాయి.

ఆ రోజుల్లోనే హాలీవుడ్ చిత్రాల‌ను త‌ల‌ద‌న్నే స్థాయిలో ఒక తెలుగు చిత్రాన్ని నిర్మించి విజ‌య‌వంతం చేసిన సాహ‌సి నాన్న‌గారు. యాభై రెండేళ్ల క్రిత‌మే గుర్రాలు, గ‌న్ ఫైటింగ్స్‌, భారీ సెట్టింగులు, బ్యూటీఫుల్ లొకేష‌న్స్, అతి పెద్ద తారాగ‌ణం, కౌబాయ్ గెట‌ప్స్‌తో బ‌డ్జెట్ ప‌రిధులు దాటి తెలుగు ప్రేక్ష‌కుల‌కు మాత్ర‌మే కాకుండా ఇంగ్లీష్‌, హిందీ, త‌మిళం, బెంగాళీ వంటి భాష‌ల్లో యాభై దేశాల‌కు పైగా ఈ సినిమాను చూపించిన ఘ‌న‌త నాన్న‌గారిది.

ఈ సంవ‌త్స‌రం మే 31 నాడు (నేడు) నాన్న‌గారి జ‌యంతి సంద‌ర్భంగా ఈ సినిమాను ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో రీ రిలీజ్ చేస్తున్నాం. తెలుగు సినిమాకు ప్ర‌తి కొత్త సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని అందించిన లెజెండ్ అండ్ విజ‌న‌రీ నాన్న‌గారు. ఆయ‌న జ్ఞాప‌కార్థం మ‌నంద‌రం మ‌ళ్లీ మోస‌గాళ్ల‌కు మోస‌గాడు సినిమాను డిజిట‌ల్‌లో కొత్త సాంకేతిక విలువ‌ల‌తో చూసి ఆ అనందాన్ని, అనుభూతిని పొంది ఆయ‌న్ని స్మ‌రించుకుందాం అని ఈ లెట‌ర్‌లో పేర్కొన్నాడు.

స్పెష‌ల్ లుక్‌లో మ‌హేష్‌

కృష్ణ జ‌యంతి సంద‌ర్భంగా త్రివిక్ర‌మ్ (Trivikram) ద‌ర్శ‌క‌త్వంలో తాను న‌టిస్తోన్న తాజా సినిమాలోని కొత్త పోస్ట‌ర్‌ను సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నాడు మ‌హేష్‌బాబు. ఇందులో త‌ల‌కు కండువా క‌ట్టుకుంటూ మాస్ లుక్‌లో మ‌హేష్‌బాబు స్టైలిష్‌గా క‌నిపిస్తోన్నారు. అత‌డి చుట్టూ రౌడీలు ఉండ‌టం ఆస‌క్తిని పంచుతోంది.

ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. సినిమా టైటిల్‌ను ఈ రోజు సాయంత్రం రివీల్ చేయ‌బోతున్నారు. ఈ సినిమాకు గుంటూరు కారం అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్లు స‌మాచారం. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో పూజాహెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా న‌టిస్తోన్నారు.

తదుపరి వ్యాసం