Maama Mascheendra Teaser: మామా మశ్చీంద్ర టీజర్ రిలీజ్ చేసిన మహేష్‌బాబు - ట్రిపుల్ రోల్‌లో సుధీర్ ఇరగదీశాడుగా
Mama Mascheendra Teaser: సుధీర్‌బాబు మామామశ్చీంద్ర టీజర్‌ను శనివారం అగ్ర హీరో మహేష్‌బాబు రిలీజ్ చేశాడు. ఈ టీజర్‌లో ట్రిపుల్ రోల్‌లో సుధీర్‌బాబు కనిపిస్తోన్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఎగ్జైటింగ్‌గా సాగిన ఈ టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
Mama Mascheendra Teaser: తనలోని రాక్షసుడిని సిల్వర్‌స్క్రీన్‌పై చూపించడానికి హీరో సుధీర్‌బాబు రెడీ అవుతోన్నాడు. అతడు హీరోగా నటిస్తోన్న మామా మశ్చీంద్ర మూవీ టీజర్ శనివారం రిలీజైంది. ఈ టీజర్‌ను స్టార్ హీరో మహేష్‌బాబు సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో మూడు గెటప్‌లలో సుధీర్‌బాబు కనిపిస్తోన్నాడు. ఓ గెటప్‌లో బొద్దుగా డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తోండగా మరో రోల్‌లో మోడ్రన్ లుక్‌లో దర్శనమిచ్చాడు.
సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్‌లో టీజర్ ఎండింగ్‌లో మూడో లుక్ కనిపించడం ఆసక్తిని పంచుతోంది. సుధీర్‌బాబులోని నెగెటివ్ షేడ్స్‌ను ఆవిష్కరిస్తూ టీజర్ ఇంట్రెస్టింగ్‌మొదలైంది. దేవుడు అడిగాడంటా నన్ను చేరడానికి ఏడు జన్మలు నాకు భక్తుడిగా బతుకుతావా...లేక మూడు జన్మలు రాక్షసుడిగా బతుకుతారా అని...ఏడు జన్మలు నీకు దూరంగా ఉండే కన్నా మూడు జన్మల రాక్షస బతుకే మిన్న దేవతలే కోరుకున్నారు అనే టీజర్ ఆరంభంలో వచ్చే డైలాగ్ ఆకట్టుకుంటోంది.
ఆ తర్వాత కంప్లీట్‌గా ఫన్ మోడ్‌లోకి టీజర్ టర్న్ అయ్యింది. రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో వచ్చే కామెడీ ఆకట్టుకుంటోంది. వాళ్లద్దరిని ఒకేసారి చంపాలి అంటూ సుధీర్‌బాబు చెప్పగానే...మరో రెండు గెటప్‌లు చూపిస్తూ ఇంట్రెస్టింగ్‌గా టీజర్ ఎండ్ అయ్యింది. మామా మశ్చీంద్ర టీజర్‌చూస్తుంటే సుధీర్‌బాబు ఈ సినిమాలో ట్రిపుల్‌రోల్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రయోగాత్మక కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాకు నటుడు హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తోన్నాడు. ఈషారెబ్బా, మృణాళిని రవి హీరోయిన్లుగా నటిస్తోన్నారు. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్‌మోహన్ రావు నిర్మిస్తోన్న ఈసినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తోన్నాడు.
టాపిక్