Hunt Release on Aha and Amazon Prime: ఒకే రోజు రెండు ఓటీటీలలో సుధీర్‌బాబు హంట్ రిలీజ్
Hunt Release on Aha and Amazon Prime: సుధీర్‌బాబు హీరోగా నటించిన హంట్ సినిమా రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కానుంది. ఆ ప్లాట్‌ఫామ్స్ ఏవంటే...
Hunt Release on Aha and Amazon Prime: సుధీర్‌బాబు హంట్ మూవీ రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఫిబ్రవరి 10 నుంచి ఆహాతో పాటు అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. హంట్ మూవీ డిజిటల్ రైట్స్‌ను రెండు ఓటీటీ సంస్థలు దక్కించుకున్నట్లు సమాచారం.
ఆహాలో కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే రిలీజ్ కానుండగా ఆమెజాన్ ప్రైమ్‌లో మాత్రం తెలుగుతో పాటు మిగిలిన లాంగ్వేజ్‌లలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో సుధీర్‌బాబుతో పాటు ప్రేమిస్తే భరత్, సీనియర్ హీరో శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటించారు.
ఓ ప్రమాదంలో గతాన్ని మర్చిపోయిన పోలీస్ ఆఫీసర్ ఓ ఐపీఎస్ అధికారి మర్డర్ కేసును ఎలా సాల్వ్ చేశాడన్నదే ఈ సినిమా హంట్ సినిమా కథ. ఇందులో సుధీర్‌బాబు గే పాత్రలో నటించారు. క్లైమాక్స్‌లో ఈ ట్విస్ట్ రివీల్ చేసి ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్ చేసింది చిత్ర యూనిట్. కేవలం ఈ ట్విస్ట్‌ను మాత్రమే నమ్ముకొని రూపొందించిన ఈ సినిమాను ప్రేక్షకులు మెప్పించలేకపోయింది.
దాంతో థియేటర్లలో విడుదలైన పదిహేను రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతున్నది. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న ఈ సినిమా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. హంట్ సినిమాకు మహేష్ సూరపనేని దర్శకత్వం వహించాడు.
మలయాళంలో విజయవంతమైన ముంబాయి పోలీస్ సినిమాకు రీమేక్‌గా హంట్ తెరకెక్కినట్లు ప్రచారం జరిగింది. ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ పతాకంపై వి ఆనంద్ ప్రసాద్ నిర్మించారు.