Foods to eat and avoid now: సీజన్ మారుతోంది.. ఈ ఆహారానికి మారండి..
Foods to eat and avoid now: వింటర్ సీజన్ ముగిసి వేసవి సీజన్‌కు దగ్గరగా ఉన్నాం. మారుతున్న సీజన్‌కు అనుగుణంగా మనం తీసుకోవాల్సిన ఆహారం, తీసుకోకూడని ఆహారం గురించి నిపుణుల సలహాలు, సూచనలు ఇవీ..
క్రమంగా చలిగాలులు తగ్గి వేసవికి దగ్గరయ్యాం. ప్రస్తుతం వాతావరణం అటు చల్లగా కాకుండా, ఇటు వేడిగా కాకుండా మధ్యస్తంగా ఉంది. బయట తిరిగేందుకు ఇది అనుకూలమైన కాలం. అయితే ఏ సీజన్ అయినా మారుతున్న సమయంలో అది రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపిస్తుంది. సీజన్ మారుతున్నప్పుడు ఇందుకు అనుగుణంగా ఆహార అలవాట్లు కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. వింటర్ సీజన్‌తో పోలిస్తే ఇప్పుడు క్యాలరీలు అంతగా అవసరం ఉండదు. బెర్రీ, పుచ్చ కాయ, పుదీనా, సలాడ్స్, చేపలు, యోగర్ట్ వంటి సులువుగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. పాస్తా, ఆలు గడ్డ, బ్రెడ్ వంటి అధిక క్యాలరీలు ఇచ్చే ఆహారానికి విరామం ఇవ్వాలి.
‘వాతావరణం మారినప్పుడు మన శరీరం అందుకు అనుగుణంగా మారేందుకు వీలుగా తగిన పోషకాలు గల ఆహారం తీసుకోవాలి..’ అని అపోలో హాస్పిటల్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ వర్షా గోరే వివరించారు.
వేసవి సమీపిస్తున్నప్పుడు తీసుకోవాల్సిన, వదిలేయాల్సిన ఆహారం
పండ్లు, కూరగాయలు: బెర్రీ, పుచ్చ కాయ, ఈ సీజన్‌లో లభించే ఆకు కూరలు, కూరగాయలు తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌క గురి కాకుండా ఉంటుంది.
తృణ ధాన్యాలు, చిరు ధాన్యాలు: క్వినోవా, గోధుమ, బ్రౌన్ రైస్, దలియా, జొన్నలు, రాగులు, హోల్ వీట్ బ్రెడ్ వంటి తృణ ధాన్యాలు, చిరు ధాన్యాలు సుస్థిర శక్తిని అందిస్తాయి. రెగ్యులర్ ఆహారానికి బదులు వీటికి మారడం ఇప్పుడు అవసరం.
ప్రొటీన్: తేలిక మాంసాహారాలైన చికెన్, చేపలు, అలాగే చిక్కుళ్లు వంటి వాటి నుంచి లభించే ప్రోటీన్ కండరాలు పుంజుకునేలా చేస్తుంది.
ప్రొబయోటిక్స్: యోగర్ట్, పెరుగు వంటి ప్రొబయోటిక్ ఆహారాలు మీ జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
తేలిగ్గా, సులువుగా జీర్ణమయ్యే సలాడ్స్, గ్రిల్ చేసిన మాంసాహారం, స్టీమ్ చేసిన లేదా బేక్ చేసిన చేపలు మీ జీర్ణాశయ పనితీరును మెరుగ్గా చేస్తాయి.
FOODS TO AVOID: తీసుకోకూడని ఆహారం
డీప్ ఫ్రై ఫుడ్: డీప్ ఫ్రై చేసిన ఆహారం, ప్రాసెస్డ్ ఫుడ్స్, అధి కొవ్వు గల ఆహారం ఈ సమయంలో తీసుకోరాదు. జీర్ణక్రియ కష్టంగా మారుతుంది. శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌కు దారితీస్తుంది.
పిండి పదార్థాలు గల ఆహారం: స్టార్చ్ అధికంగా ఉండే పాస్తా, ఆలు గడ్డ, బ్రెడ్ వంటి వాటికి ఈ సమయంలో దూరంగా ఉండాలి.
చక్కెర పానీయాలు: సీజన్ మారుతున్నప్పుడు శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవాలి. అలాగే షుగర్ కంటెంట్ ఉండే పానీయాలు, అలాగే సోడా వంటి వాటికి దూరంగా ఉండాలి. ఈ పానీయాలు డీహైడ్రేషన్‌కు దారితీస్తాయి.
‘సమతుల ఆహారం ఇలాంటి సీజన్ మార్పు సమయాల్లో ఉపయోగపడుతుంది. తగినంత నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు లోనుకాకుండా దోహపడుతుంది. వేడి వాతావరణం తట్టుకోగలుగుతాం..’ అని డాక్టర్ గోరే వివరించారు.