Ottu Movie Review: ఒట్టు మూవీ రివ్యూ - అరవింద్ స్వామి, ఈషారెబ్బా గ్యాంగ్‌స్టర్ మూవీ ఎలా ఉందంటే
Ottu Movie Review: అరవింద్‌స్వామి, కుంచకోబన్, ఈషారెబ్బా ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ఒట్టు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది.
Ottu Movie Review: అరవింద్ స్వామి(Arvind Swamy), కుంచకోబోబన్(Kunchacko Boban), ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ఒట్టు. ఫెలినీ టీపీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో మలయాళంతో పాటు తెలుగులో రిలీజైంది. ఈ మలయాళ సినిమాకు తమిళ హీరో ఆర్య నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమాతోనే టాలీవుడ్ హీరోయిన్ ఈషారెబ్బ(Eesha Rebba) మాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసింది. గ్యాంగ్‌స్టర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఎలా ఉందంటే…
గ్యాంగ్‌స్టర్ గతం మర్చిపోతే...
కిట్టు (కుంచకోబోబన్) తన ప్రియురాలు కళ్యాణితో (ఈషారెబ్బా) కలిసి విదేశాలకు వెళ్లే ప్రయత్నాల్లో ఉంటాడు.కానీ అందుకు చాలా డబ్బు అవసరం కావడంతో తనకు ఆప్తుడైన చాచా (ఆడుకాలం నరేన్) ద్వారా ఓ డీల్ కుదుర్చుకుంటాడు. అసైనర్ అనే గ్యాంగ్‌స్టర్ ఓ ఎటాక్‌లో చనిపోతాడు. అదే గ్యాంగ్‌వార్‌లో గాయపడిన అసైనర్ నమ్మిన బంటు డేవిడ్ (అరవింద్ స్వామి) అలియాస్ దావుద్ గతం మార్చిపోతాడు.
డబ్బు కోసం డేవిడ్‌కు గతాన్ని తిరిగి గుర్తుచేసే డీల్‌ను కిట్టు చేపడతాడు. డేవిడ్‌తో స్నేహం చేస్తాడు. డేవిడ్‌పై ఎటాక్ జరిగిన ప్లేస్‌కు తీసుకెళ్తే తప్పకుండా పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయని భావించిన కిట్టు ముంబై నుంచి ఉడిపి కి డేవిడ్‌తో కలిసి బయలుదేరుతాడు.
ఈ జర్నీలో ఏం జరిగింది? శత్రువుల దాడిలో అసైనర్ నిజంగా చనిపోయాడా? అసలైన డేవిడ్ ఎవరు? కిట్టుకు డేవిడ్‌కు ఉన్న సంబంధం ఏమిటి? డేవిడ్ వేసిన ప్లాన్‌లోనే కిట్టు చిక్కుకున్నాడా? కిట్టును డేవిడ్ ఎందుకు చంపాలని చూశాడు? కిట్టును ప్రేమించిన కళ్యాణి ఎవరన్నదే ఒట్టు (Ottu Movie Review)సినిమా కథ.
మూడు పార్ట్‌లుగా...
ఒట్టు సినిమాను మొత్తం ఛాప్టర్ 1, చాఫ్టర్ 2, ఛాప్టర్ 3 పేరుతో మూడు పార్ట్‌లుగా తీయబోతున్నట్లు దర్శకుడు ఫెలినీ టీపీ ప్రకటించారు. సినిమాపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని రేకెత్తించేందుకు తొలుత చాఫ్టర్ 2 తెరకెక్కించారు.
ఈ సినిమాకు ఓ ప్రీక్వెల్, మరో సీక్వెల్‌తో ఉండబోతున్నట్లు అనౌన్స్‌చేశాడు . ఛాప్టర్ 2 మొత్తం గతం మర్చిపోయిన ఓ గ్యాంగ్‌స్టర్ జీవితం చుట్టూ తిరుగుతుంది. అతడికి గతాన్ని గుర్తుచేసేందుకు కిట్టు అనే సాధారణ యువకుడు ఎలాంటి ప్రయత్నాలు చేశాడన్నదే ఒట్టు సినిమా(Ottu Movie Review) మెయిన్ పాయింట్.
రోడ్ జర్నీ బ్యాక్‌డ్రాప్....
క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్ లేకుండా కిట్టు, కల్యాణి సమస్యల్లో ఉన్నట్లుగా చూపించే సీన్‌తోనే సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత డేవిడ్ కు గతాన్ని గుర్తు చేసేందుకు అతడితో కిట్టు స్నేహం చేయడం, అందుకోసం వేసే ప్లాన్స్‌తో సినిమా నిదానంగా సాగుతుంది. కిట్టు, డేవిడ్ నేపథ్యాలు ఏమిటన్నది రివీల్ కాకుండా రోడ్ జర్నీ బ్యాక్‌డ్రాప్‌లో ప్రీ క్లైమాక్స్ వరకు ఫ్లాట్‌గా సినిమా సాగుతుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి ఒక్కో ట్విస్ట్ రివీల్ చేసుకుంటూ వెళ్లాడు డైరెక్టర్.
క్లైమాక్స్ ట్విస్ట్ హైలైట్...
కిట్టుతో జర్నీ చేస్తోంది డేవిడ్ కాదని అసైనర్ అనే నిజాన్ని వెల్లడించే సీన్ బాగుంది. ఆ తర్వాత అసలు డేవిడ్ ఎవరనే ట్విస్ట్ ఈ సినిమాకు హైలైట్‌గా ఉంటుంది. కిట్టు వేసిన ప్లాన్ ప్రకారమే కథ నడుస్తుందని అనుకునే లోపు ఆ ప్లాన్ వేసింది అసైనర్ అంటూ సర్‌ప్రైజ్ చేస్తాడు.
కిట్టు, డేవిడ్‌లలో గతాన్ని ఎవరు మర్చిపోయారు? కళ్యాణి నిజంగా కిట్టును ప్రేమించిందా? ఇలా గుక్కతిప్పుకోకుండా ఒకదాని తర్వాత మరొ షాక్ ఇస్తూనే ఉంటాడు డైరెక్టర్. అసైనర్‌పై దాడి చేసింది ఎవరన్నది రివీల్ చేసి నెక్స్ట్ ఛాప్టర్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు.
పాయింట్ బాగున్నా...
ఒట్టు కోసం దర్శకుడు ఎంచుకున్న కథ బాగున్నా దానిని స్క్రీన్‌పై ప్రజెంట్ చేయడంలో పూర్తిగా తడబడ్డాడు. ఆర్ట్ ఫిలిం మాదిరిగా సినిమా చాలా నిదానంగా సాగుతుంది. కథ ఎంతకు ముందుకు కదలకా అక్కడే తిరుగుతుంది. అరవింద్ స్వామి, కుంచకో బోబన్ మధ్య సీన్స్ పూర్తిగా బోరింగ్‌గా సాగుతాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి లాస్ట్ 20 మినిట్స్ ఆసక్తికరంగా నడిపించాడు.
ఈషారెబ్బా మలయాళ ఎంట్రీ…
గతాన్ని మర్చిపోయిన గ్యాంగ్‌స్టర్‌గా అరవింద్ స్వామి యాక్టింగ్ బాగుంది. తక్కువ డైలాగ్స్ తో ఎక్స్‌ప్రెషన్స్‌తోనే యాక్టింగ్ రాబడుతూ ఈ పాత్రలో ఒదిగిపోయాడు. కిట్టు అనే సాధారణ యువకుడిగా కుంచకోబోబన్ సహజ నటనను కనబరిచాడు. వీరిద్దరి పాత్రల చుట్టే సినిమా సాగుతుంది. కళ్యాణిగా ఈషారెబ్బకు యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. చివరలో ఆమె క్యారెక్టర్‌లో వచ్చే మలుపు బాగుంది.
Ottu Movie Review-స్లోఫేజ్ మూవీ...
ఒట్టు బోరింగ్, స్లోఫేజ్ గ్యాంగ్‌స్టర్ మూవీ. కథలో వచ్చే మలుపులు బాగున్నా కథనం మాత్రం టీవీ సీరియల్‌గా నిదానంగా సాగుతుంది. అరవింద్ స్వామి, కుంచకోబోబన్ యాక్టింగ్ కోసం ఓ సారి చూడొచ్చు.