Guntur Kaaram Tamil Trp: గుంటూరు కారం తమిళ్ వెర్షన్‌కు షాకింగ్ టీఆర్‌పీ రేటింగ్ -తెలుగుతో పోలిస్తే సగం కూడా రాలేదుగా
23 August 2024, 20:31 IST
Guntur Kaaram Tamil Trp: మహేష్‌బాబు గుంటూరు కారం మూవీ తమిళంలో డైరెక్ట్‌గా టీవీలోనే టెలికాస్ట్ అయ్యింది. ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా సన్ టీవీలో గుంటూరు కారం తమిళ వెర్షన్‌ను టెలికాస్ట్ చేశారు. తమిళ ఫస్ట్ టీవీ ప్రీమియర్‌కు 4.50 టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది.
గుంటూరు కారం తమిళ్ టీఆర్‌పీ రేటింగ్
Guntur Kaaram Tamil Trp Rating: ఈ ఏడాది గుంటూరు కారంతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు మహేష్‌బాబు. త్రివిక్రమ్, మహేష్‌బాబు కాంబోలో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కిన గుంటూరు కారం డిసపాయింట్ చేసింది. మహేష్‌బాబు అభిమానులను సైతం ఈ మూవీ మెప్పించలేకపోయింది.
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందిన గుంటూరు కారం మూవీ 150 కోట్లలోపే వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. యాభై కోట్లకుపైనే గుంటూరు కారం నష్టాలను తెచ్చిపెట్టినట్లు వార్తలొచ్చాయి. ట్రేడ్ వర్గాలకు భిన్నంగా ప్రొడ్యూసర్లు మాత్రం గుంటూరు కారం తమకు ప్రాఫిట్స్ తెచ్చిపెట్టినట్లు స్టేట్‌మెంట్స్ ఇచ్చారు.
గుంటూరు కారం తమిళ్ వెర్షన్...
కాగా గుంటూరు కారం తమిళ వెర్షన్ డైరెక్ట్‌గా టీవీలోనే టెలికాస్ట్ అయ్యింది. ఇటీవల ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్ట్ 15న గుంటూరు కారం తమిళ వెర్షన్ టీవీలోకి వచ్చింది.సన్ టీవీలో మహేష్ మూవీ టెలికాస్ట్ అయ్యింది. గుంటూరు కారం తమిళ టీవీ ప్రీమియర్‌కు 4.50 టీఆర్‌పీ రేటింగ్ వచ్చింది.
గుంటూరు కారం తెలుగు ఫస్ట్ టీవీ ప్రీమియర్‌కు 9.23 టీఆర్‌పీ రేటింగ్ రాగా...తమిళ ప్రీమియర్‌కు అందులో సగం కూడా టీఆర్‌పీ రాకపోవడం గమనార్హం. మహేష్‌బాబు సినిమాలకు తమిళనాట అంతగా ఆదరణ లేదు అని చెప్పడానికి గుంటూరు కారం టీవీ ప్రీమియర్ ఉదాహరణ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తోన్నారు.
శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లు...
తల్లీకొడుకుల అనుబంధానికి యాక్షన్ అంశాలను జోడించి దర్శకుడు డైరెక్టర్ త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో మహేష్‌బాబుకు జోడీగా శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. మరో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి కనిపించింది. తొలుత గుంటూరుకారంలో పూజాహెగ్డేను హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ డేట్స్ సర్ధుబాటు కాకపోవడంతో పూజా హెగ్డే ఈ మూవీ నుంచి తప్పుకున్నది. ఆమె స్థానంలో మీనాక్షి చౌదరిని తీసుకున్నారు.
మహేష్ యాక్టింగ్ బాగుంది కానీ...
గుంటూరు కారం సినిమాలో రవణగా మహేష్‌బాబు యాక్టింగ్, శ్రీలీలతో లవ్ ట్రాక్, తమన్ పాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. కానీ త్రివిక్రమ్ కథలో కొత్తదనం, డైలాగుల్లో మెరుపులు లేకపోవడంతో సినిమా ఫెయిల్యూర్‌గా నిలిచింది. ముఖ్యంగా త్రివిక్రమ్ సినిమాల్లో ఉండే మ్యాజిక్కు గుంటూరు కారంలో మిస్సయింది.
గుంటూరు కారం సినిమాలో ప్రకాష్‌రాజ్, జయరామ్, రమ్యకృష్ణ, జగపతిబాబు, వెన్నెల కిషోర్, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. అతడు, ఖలేజా తర్వాత మహేష్‌బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో మూడో మూవీగా గుంటూరు కారం నిలిచింది.
రాజమౌళి మూవీ కోసం మేకోవర్...
గుంటూరు కారం తర్వాత దిగ్గజ దర్శకుడు రాజమౌళితో మహేష్‌బాబు యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతోన్నాయి. త్వరలోనే ఈ సినిమాను ఆఫీషియల్‌గా లాంఛ్ చేయబోతున్నట్లు సమాచారం.
రాజమౌళ్లి మూవీ కోసం కంప్లీట్‌గా మేకోవర్ అవుతున్నాడు మహేష్‌బాబు. ఇందులో కొత్త లుక్‌లో మహేష్‌బాబు కనిపించనున్నట్లు సమాచారం. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో మహేష్‌బాబు, రాజమౌళి మూవీ తెరకెక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది.