New Telugu TV Serial: కొత్త సీరియల్ ‘సీతారామ’ ప్రారంభం.. టెలికాస్ట్ టైమింగ్స్, స్టోరీలైన్ ఇవే
Seetha Rama Telugu Serial: సీతారామ పేరుతో తెలుగులో కొత్త సీరియల్ ప్రారంభమైంది. జీ తెలుగు టీవీ ఛానెల్‍లో ఈ సీరియల్ వస్తోంది. కన్నడ సీరియల్‍కు డబ్బింగ్ వెర్షన్‍గా ప్రసారమవుతోంది. సీతారామ సీరియల్ టెలికాస్ట్, స్టోరీలైన్ వివరాలు ఇవే.
టీవీ ఛానెళ్లలో సీరియళ్ల హవా కొనసాగుతూనే ఉంది. అందుకే వీటిపైనే ఛానెల్స్ ఎక్కువగా దృష్టి సారిస్తుంటాయి. ఓ సీరియల్ అయిపోగానే.. కొత్త దాన్ని తీసుకొచ్చేందుకు రెడీగా ఉంటాయి. జీ తెలుగు టీవీ ఛానెల్ కొత్తగా ఓ సీరియల్‍ను ప్రారంభించింది. ‘సీతారామ’ పేరుతో ఈ సీరియల్ వచ్చింది. నేడు (ఆగస్టు 12) ఈ సిరీయల్ షురూ అయింది.
సీతారామ గురించి..
సీతారామ సీరియల్‍లో వైష్ణవి గౌడ, గగన్ చిన్నప్ప, రితూ సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు. పూజ లోకేశ్, చందూ, మేఘన శంకరప్ప, సతీశ్ చంద్ర కీలకపాత్రలు పోషించారు. సీత (వైష్ణవి), శ్రీరామ్ (గగన్)ను చిన్నారి సిరి (రితూ) ఒక్కటయ్యేలా చేస్తుందా అనే స్టోరీతో ఈ సీరియల్ వస్తున్నట్టు జీ తెలుగు టీజర్లను తీసుకొచ్చింది.
డబ్బింగ్‍తో..
సీతారామ సీరియల్ కన్నడలో ప్రసారం అవుతోంది. దానికి తెలుగు డబ్బింగ్‍నే జీ తెలుగు ఇప్పుడు తీసుకొచ్చింది. కన్నడలోనూ సీతారామ పేరుతోనే ఈ సీరియల్ ఉంది. మరాఠీ సీరియల్ మాఝీ తుజీ రెషింగాత్ కథ ఆధారంగా సీతారామ సీరియల్ రూపొందింది. హిందీ, బెంగాలీ, ఒడియాలోనే రీమేక్ అయ్యింది. కన్నడ రీమేక్‌కు.. తెలుగులో డబ్బింగ్‍తో ఈ సీరియల్ వచ్చింది.
టెలికాస్ట్ టైమింగ్స్
సీతారామ సీరియల్ నేడు (ఆగస్టు 12) జీ తెలుగు టీవీ ఛానెల్‍లో మొదలైంది. ప్రతీ సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 5.30 గంటలకు సీరియల్ ప్రసారం కానుంది.
స్టోరీలైన్
భర్త నుంచి విడిపోయిన సీత తన కూతురు సిరిని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఆ పాపకు చిన్నతనంలోనే డయాబెటిస్ ఉంటుంది. నాన్న కోసం పాప పరితపిస్తుంటుంది. సీత సర్దిచెబుతూ ఉంటుంది. విదేశాల నుంచి తిరిగి వచ్చే బిజినెస్‍మ్యాన్ శ్రీరామ్‍తో సీత, సిరికి పరిచయం అవుతుంది. సీతతో రామ్ ప్రేమలో పడతాడు. వారిద్దరూ ఒక్కటవ్వాలని అనుకుంటారు. వీరి పెళ్లికి సిరి అంగీకరిస్తుందా? ఆ తర్వాత ఏం జరిగింది? వీరి గతం ఏంటి? కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయి? ఎలాంటి సవాళ్లు ఎదురయ్యేయనే అంశాల చుట్టూ సీతారామ సీరియల్ సాగేలా కనిపిస్తోంది.
ఇటీవలే మరో సీరియల్
జీ తెలుగులో ఇటీవలే “కలవారి కోడలు.. కనక మహాలక్ష్మి” సీరియల్ మొదలైంది. ఆగస్టు 5వ తేదీన ఈ సిరీయల్ మొదలైంది. ప్రతీ సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 2 గంటలకు ఈ సీరియల్ టెలికాస్ట్ అవుతోంది. ముందు 3 గంటలకు రాగా.. ఇటీవలే టైమ్ మారింది. ఈ సీరియల్‍లో యుక్త, విశ్వమోహన్, ఆర్తి కులకర్ణి, కోటేశ్వరరావు, పూజ, హీనా రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. వర్ధన్ రెడ్డి దర్శకత్వం వహించారు.