తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Maharani 2 Web Series Review: వావ్‌ మహారాణి.. పొలిటికల్‌ డ్రామా అంటే ఇలా ఉండాలి

Maharani 2 Web Series Review: వావ్‌ మహారాణి.. పొలిటికల్‌ డ్రామా అంటే ఇలా ఉండాలి

Hari Prasad S HT Telugu

27 August 2022, 15:31 IST

    • Maharani 2 Web Series Review: వావ్‌ మహారాణి అని అనకుండా ఉండలేరు మీరు ఈ వెబ్‌ సిరీస్‌ చూసిన తర్వాత. అసలుసిసలు పొలిటికల్‌ డ్రామా ఎలా ఉంటుందో కళ్లకు కట్టిందీ సిరీస్‌.
మహారాణి 2 వెబ్ సిరీస్
మహారాణి 2 వెబ్ సిరీస్ (Twitter)

మహారాణి 2 వెబ్ సిరీస్

Maharani 2 Web Series Review: రాజకీయం ఎక్కడైనా రంజుగానే ఉంటుంది. అది బీహార్‌లాంటి రాష్ట్రంలో అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడి పొలిటికల్‌ డ్రామా ఎప్పుడూ రక్తి కట్టిస్తూనే ఉంటుంది. తెరపై కనిపించేవి అందరికీ తెలుసు. కానీ తెరవ వెనుక జరిగే డ్రామా సంగతేంటి? ఇది తెలుసుకోవాలంటే మహారాణి వెబ్‌సిరీస్‌ చూడాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు

TV Serial Actor Chandu: ఆమె వల్లే మేం విడిపోయాం.. ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదు: సీరియల్ నటుడు చందూ భార్య

OTT Movie: చైన్ బిజినెస్ మోసాలు.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Laya: ఆ డైరెక్టర్ చంపుతానని బెదిరించాడు.. 18 ఏళ్లకు నిజం బయటపెట్టిన హీరోయిన్ లయ

Sunil: మ‌మ్ముట్టి సినిమాలో విల‌న్‌గా సునీల్ - ట‌ర్బోతో మ‌ల‌యాళంలోకి ఎంట్రీ - ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

వాస్తవ ఘటనలను ఆధారంగా చేసుకొని తీసిన ఈ సిరీస్ తొలి సీజన్‌ ఎంత ఆకట్టుకుందో.. తాజాగా వచ్చిన మహారాణి 2 కూడా అంతే. నిజం చెప్పాలంటే తొలి సీజన్‌ కంటే కాస్త ఎక్కువ థ్రిల్‌నే పంచింది. అసలు ఓ పొలిటికల్‌ డ్రామాను స్క్రీన్‌పై ఎలా చూపించాలో పక్కాగా అలాగే చూపించారు ఈ సిరీస్‌ మేకర్స్‌. సోనీ లివ్‌ ఓటీటీలో ఆగస్ట్‌ 25న మహారాణి సీజన్‌ 2 వచ్చింది.

మహారాణి 2 స్టోరీ ఏంటి?

మహారాణి తొలి సీజనే ఎంతో రక్తి కట్టించేలా సాగింది. 1990లనాటి బీహార్‌ రాజకీయాలకు ఈ సిరీస్‌ అద్దం పట్టింది. ముఖ్యంగా అప్పటి బీహార్‌ రాజకీయ పరిణామాలు తెలిసిన వాళ్లయితే ఈ సిరీస్‌ను ఇంకా బాగా ఎంజాయ్‌ చేస్తారు. మొదటి సీజన్‌ చూస్తుటే లాలూ ప్రసాద్‌ యాదవ్‌, రబ్రీ దేవిలు గుర్తుకు రావడం ఖాయం. నిజానికి వాస్తవ ఘటనల ఆధారంగానే ఈ సిరీస్‌ తెరకెక్కించినా.. వాటికి తమదైన ట్విస్టులు, డ్రామాను జోడించి మేకర్స్‌ మరింత రక్తి కట్టించారు.

ముఖ్యమంత్రిగా ఉన్న భీమా భారతి (సోహమ్‌ షా)పై దాడి జరగడం, ఆ తర్వాత తన భార్య అయిన రాణి భారతి (హ్యూమా ఖురేషి)ని సీఎంని చేయడం.. అక్షరం ముక్క కూడా రాని ఆమె క్రమంగా ఏకు మేకుగా మారి.. కుంభకోణాలకు పాల్పడిన తన భర్తనే జైలుకు పంపడంలాంటి ఘటనలతో తొలి సిరీస్‌ సాగింది. రెండో సీజన్‌లో రాజకీయం మరింత రంజుగా సాగుతుంది.

జైలు నుంచి బయటకు వచ్చిన భీమా భారతి మళ్లీ సీఎం పదవిని దక్కించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు.. వాటికి చెక్‌ పెట్టడానికి అప్పటికే పాలిటిక్స్‌లో ఆరితేరిన రాణి భారతి వేసే ఎత్తులు.. ఈ భార్యభర్తల గొడవలతోపాటు సున్నితమైన అంశాలను లేవనెత్తి రాజకీయంగా సొమ్ము చేస్తూ ప్రతిపక్ష నేత నవీన్‌ కుమార్‌ (అమిత్ సియాల్‌) సాగించే రాజకీయాలు.. ఇలా ప్రతి ఎపిసోడ్‌ ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది.

1990లలోనే కాదు.. ఇప్పటికీ బీహార్‌ రాజకీయాలు మొత్తం కులం, మతం, ప్రాంతం చుట్టే తిరుగుతుంటాయి. పైగా 1999లో బీహార్‌లో జార్ఖండ్‌ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు కూడా జరిగాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ఆ విభజన వాదాన్ని ఎలా వాడుకున్నారో మనం ఈ సిరీస్‌లో చూడొచ్చు. నిజంగా ఇలాంటి సున్నితమైన అంశాలను స్క్రీన్‌పై చూపించడం కత్తి మీద సామే. కానీ ఇందులో మేకర్స్‌ సక్సెసయ్యారనే చెప్పాలి. మహారాణి 2లో మొత్తం 10 ఎపిసోడ్లు ఉండగా.. చివరి రెండు ఎపిసోడ్లలో ఊహించని ట్విస్ట్‌లు సిరీస్‌ను మరింత ఆసక్తికరంగా మార్చాయనడంలో సందేహం లేదు.

మహారాణి 2.. అద్భుతమైన రైటింగ్.. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే

మహారాణి 2 వెబ్‌ సిరీస్‌ ఓ పొలిటికల్‌ డ్రామా. దీనిని ప్రేక్షకులను కట్టిపడేసేలా చెప్పడం అంత సులువు కాదు. కానీ అద్భుతమైన రైటింగ్‌, గ్రిప్పింగ్ స్క్రీన్‌ ప్లే కారణంగా ఈ డ్రామా రక్తి కట్టింది. ఈ సిరీస్‌కు క్రియేటర్‌తోపాటు రైటర్‌ కూడా అయిన సుభాష్‌ కపూర్‌, రెండో సీజన్‌ డైరెక్టర్‌ రవీంద్ర గౌతమ్‌లకు ఈ క్రెడిట్‌ దక్కుతుంది. ఇక ఈ సిరీస్‌కు డైలాగులు అదనపు బలం.

మహారాణి 2.. నటించలేదు.. జీవించేశారు..

మహారాణి 2 వెబ్‌ సిరీస్‌కు అతి పెద్ద బలం నటీనటులే. ఇందులో ప్రతి పాత్ర నటించడం కాదు జీవించేశారు. కథలో ప్రధాన పాత్ర అయిన రాణి భారతి క్యారెక్టర్‌ పోషించిన హ్యూమా ఖురేషి నుంచి ఆమె భర్త, మాజీ ముఖ్యమంత్రి భీమా భారతి పాత్రలో కనిపించిన సోహమ్‌ షా, ప్రతిపక్ష నేత నవీన్‌కుమార్‌ పాత్రలో కనిపించిన అమిత్‌ సియాల్‌.. ఇలా ప్రతి ఒక్కరూ నటనలో ఇరగదీశారు.

మొదటి సీజన్‌ కంటే రెండో సీజన్‌ కాస్త సాగదీసినట్లుగా అక్కడక్కడా అనిపించినా.. వీళ్ల నటనతో దానిని కవర్‌ చేసేశారు. ముఖ్యంగా హ్యూమా ఖురేషి అయితే రాణి భారత పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసింది. మహారాణి వెబ్‌ సిరీస్‌కు అతి పెద్ద బలం ఆమెనే అనడంలో ఎలాంటి సందేహం లేదు. బీహార్‌ నేపథ్యంలో సాగే కథ కావడంతో అక్కడి రాజకీయాన్ని నిజంగానే ఒంటబట్టించుకున్నారా అనేంతలా నటించేశారు. ఈ విషయంలో మహారాణి 2కు వందకు వంద మార్కులు వేసినా తక్కువే.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం