Ravi Teja: రామారావు ఆన్ డ్యూటీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ కన్ఫార్మ్.. ఎప్పుడంటే?
రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ ఓటీటీ విడుదల తేదీ కన్ఫార్మ్ అయింది. ఈ సినిమా వచ్చే నెల 15 నుంచి సోనీ లివ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. శరత్ మండవ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
మాస్ మహారాజ రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో వచ్చిన సినిమా రామారావు ఆన్ డ్యూటీ. గత నెల 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. రవితేజ కెరీర్‌లోనే అత్యంత దారుణమైన కలెక్షన్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. దీంతో ఓటీటీలోనైనా త్వరగా విడుదల చేస్తారా? అని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూడసాగారు. అయితే ఇటీవల తెలుగు నిర్మాతల మండలి చర్చల అనంతరం సినిమా విడుదలైన 50 రోజులకు కానీ చిత్రం ఓటీటీలోకి విడుదల కాదు. దీంతో రామారావు ఆన్ డ్యూటీ ఓటీటీలో స్ట్రీమింగ్ ఆలస్యమైంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదలపై అప్డేట్ వచ్చింది.
ఈ సినిమా సోని లివ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబరు 15వ తేదీ నుంచి ఈ చిత్రం ప్రసారం కానున్నట్లు సదరు ఓటీటీ సంస్థ తెలియజేసింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రామారావు ఆన్ డ్యూటీ చిత్రం అందుబాటులోకి రానునట్లు స్పష్టం చేసింది.
ఎర్రచందనం మాఫియా గురించి ఈ సినిమా కథాంశం తిరుగుతోంది. డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేసే హీరో.. ఎర్రచందనం మాఫియా గుట్టును ఎలా బయటకు తీశాడనేది చిత్ర కథ. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, ఆర్‌టీ టీమ్ వర్క్స్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. ఈయనతో పాటు రవితేజ తన స్వీయ నిర్మాణంలో ఈ సినిమాను నిర్మించారు. శరత్ మండవ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దివ్యాంశ కౌశిక్, రజీశా విజయన్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. శ్యామ్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చారు. నాజర్, పవిత్రా లోకేశ్, తనికెళ్ల భరణి కీలక పాత్రలు పోషించారు. జులై 29న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం.
సంబంధిత కథనం
టాపిక్