తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Maar Muntha Chod Chinta Song Lyrics: మార్ ముంత చోడ్ చింత సాంగ్ లిరిక్స్ ఇవే.. డబుల్ ఇస్మార్ట్ నుంచి డబుల్ మాస్ సాంగ్

Maar Muntha Chod Chinta Song Lyrics: మార్ ముంత చోడ్ చింత సాంగ్ లిరిక్స్ ఇవే.. డబుల్ ఇస్మార్ట్ నుంచి డబుల్ మాస్ సాంగ్

Hari Prasad S HT Telugu

17 July 2024, 11:15 IST

google News
    • Maar Muntha Chod Chinta Song Lyrics: మార్ ముంత చోడ్ చింత అంటూ డబుల్ ఇస్మార్ట్ మూవీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజైన సంగతి తెలుసు కదా. మాస్ బీట్స్ తోపాటు అదిరిపోయే లిరిక్స్ తో ఈ పాట ఇన్‌స్టాంట్ హిట్ అయింది.
మార్ ముంత చోడ్ చింత సాంగ్ లిరిక్స్ ఇవే.. డబుల్ ఇస్మార్ట్ నుంచి డబుల్ మాస్ సాంగ్
మార్ ముంత చోడ్ చింత సాంగ్ లిరిక్స్ ఇవే.. డబుల్ ఇస్మార్ట్ నుంచి డబుల్ మాస్ సాంగ్

మార్ ముంత చోడ్ చింత సాంగ్ లిరిక్స్ ఇవే.. డబుల్ ఇస్మార్ట్ నుంచి డబుల్ మాస్ సాంగ్

Maar Muntha Chod Chinta Song Lyrics: డబుల్ ఇస్మార్ట్ మూవీ నుంచి డబుల్ మాస్ తో వచ్చిన మార్ ముంత చోడ్ చింత సాంగ్ లిరిక్స్ చూశారా? మంగళవారం (జులై 16) రిలీజైన ఈ పాట మాస్ బీట్స్ తో ఊపేస్తోంది. ఉస్తాద్ రామ్ పోతినేని డ్యాన్స్, మణిశర్మ బీట్స్, రాహుల్ సిప్లిగంజ్ గళంతో ఈ పాట ఇన్‌స్టాంట్ హిట్ గా మారిపోయింది.

మార్ ముంత చోడ్ చింత లిరిక్స్

మార్ ముంత చోడ్ చింత పాటను కాసర్ల శ్యామ్ రాశాడు. మణిశర్మ మ్యూజిక్ అందించగా.. రాహుల్ సిప్లిగంజ్, ధనుంజయ్ సీపన, కీర్తన శర్మ పాడారు. హైదరాబాద్ గల్లీలు దద్దరిల్లేలా ఈ పాటను కంపోజ్ చేశారు. ఇక రామ్ ఎనర్జటిక్ స్టెప్పులు పాటకు పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆగస్ట్ 15న రిలీజ్ కానుంది.

లిరిక్స్ ఇవే..

కలకత్తా మీఠా పాన్‌లెక్క

మస్తుగున్నవు గానీ పోరీ..

నే బగర్‌కత్తా బాబా జర్దా

తట్టుకుంటవ చోరీ..

అమ్మనీయమ్మ బోరాన్ బోరాన్ ఉందిరా పోరీ

అర్రె మనమే అనుకున్నా.. ఇది కూడా బ్రాండేరా భయ్

నాగ నాగ నాగ నాగపురి సంత్ర

నలిపేస్తా రాయె నా టప్పా చబుత్రా

నాగ నాగ నాగ నాగపురి సంత్ర

ఆగ ఆగ ఆగమయ్యీ.. పడతలేదు నిద్ర

నువ్ గంతగింత గాదు అసలే డబుల్ ఇస్మార్టూ

నీ జోరు చూస్తే గూడ్సు రైలు గుద్దుకున్నట్టు

నువ్వు పూల పూల అంగి యేసి ఇస్టైల్ గొట్టు

ఓల్డ్ సిటీ ఊగిపోద ఓల్డ్ మంకు తాగినట్టు

సైసరాదే పూసలేసుకున్న పిల్లా..

పూసుకుంట నిన్ను చార్మినారు సెంటులా..

సీసలెక్క ఉన్న షేపు చూస్తె మల్లా..

పిస్సపిస్స ఐతాందే నా దిల్లులా..

ఏం జేద్దామంటవ్ మరి

మార్ ముంత చోడ్ చింత

మార్ మార్ మార్ మార్ మారూ ముంత

చోడ్ చోడ్ చోడ్ చోడ్ చోడో చింత

మార్ మార్ మార్ మార్ మారూ ముంత

చోడ్ చోడ్ చోడ్ చోడ్ చోడో చింత

యో బాయ్స్.. సీస మూత తీసింగ్స్..

గ్లాస్ ల మందు పోసింగ్స్..

గటాగటా తాగింగ్స్..

ఎంజాయ్.. పండుగో..

ఎంజాయ్.. పండుగో..

ఓ ప్యారీ.. తోతాపరీ..

బొమ్మల నడుమ బొట్టు ఏదే..

దార్కారీ.. నా శంకరీ..

నీ గుండెలపైనా అంటుకుందే..

నడిమిట్లున్నా.. నడుమట్లా తిప్పకే..

మునుపట్లా.. శెక్కరొచ్చిందే..

షంషేర్ అంటూ నడుసొస్తాంటే..

సెంటర్ల టక్కరయ్యిందే..

ఎర్రఎర్ర ఎర్రగున్న సెంపలల్లా..

సిర్రగోనె ఆడమంది సిగ్గు బిల్లా..

సుర్రసుర్ర సుర్రుమంటు సూడు పిల్లా..

వుండుండి కాలుతాందె కాకరపుల్లా..

ఏం జేద్దామంటవ్ మరి..

ఇగ జెప్తజూడు..

మార్ ముంత చోడ్ చింత

మార్ మార్ మార్ మార్ మారూ ముంత

చోడ్ చోడ్ చోడ్ చోడ్ చోడో చింత

మార్ మార్ మార్ మార్ మారూ ముంత

చోడ్ చోడ్ చోడ్ చోడ్ చోడో చింత

యో బాయ్స్.. సీస మూత తీసింగ్స్..

గ్లాస్ ల మందు పోసింగ్స్..

గటాగటా తాగింగ్స్..

ఎంజాయ్.. పండుగో..

ఎంజాయ్.. పండుగో..

మార్ మార్ మార్ మార్ మారూ ముంత

చోడ్ చోడ్ చోడ్ చోడ్ చోడో చింత

మార్ మార్ మార్ మార్ మారూ ముంత

చోడ్ చోడ్ చోడ్ చోడ్ చోడో చింత

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం