తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Liger Advance Bookings: దుమ్ము రేపుతున్న లైగర్‌ అడ్వాన్స్‌ బుకింగ్స్

Liger Advance Bookings: దుమ్ము రేపుతున్న లైగర్‌ అడ్వాన్స్‌ బుకింగ్స్

HT Telugu Desk HT Telugu

22 August 2022, 14:16 IST

    • Liger Advance Bookings: లైగర్‌ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ దుమ్ము రేపుతున్నాయి. ఈ మూవీతో విజయ్‌ దేవరకొండ రేంజ్‌ మరో లెవల్‌కు వెళ్లే ఛాన్స్‌ కనిపిస్తోంది.
లైగర్ అడ్వాన్స్ బుకింగ్స్ కు తెలుగులో ఫుల్ డిమాండ్
లైగర్ అడ్వాన్స్ బుకింగ్స్ కు తెలుగులో ఫుల్ డిమాండ్ (Twitter)

లైగర్ అడ్వాన్స్ బుకింగ్స్ కు తెలుగులో ఫుల్ డిమాండ్

Liger Advance Bookings: మచ్‌ అవేటెడ్‌ పాన్‌ ఇండియా మూవీ లైగర్‌ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ విషయంలో సంచలనాలు సృష్టిస్తోంది. ఈ నెల 25న ఈ మూవీ రిలీజ్‌ కానున్న విషయం తెలిసిందే. అయితే 20వ తేదీనే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. ఈ మధ్య కాలంలో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతున్న పరిస్థితుల్లో లైగర్‌ మాత్రం దూసుకెళ్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Kalki 2898 AD Bujji: ‘బుజ్జీ’ కోసం భారీ ఈవెంట్ ప్లాన్ చేసిన కల్కి 2898 ఏడీ టీమ్.. ఎప్పుడు.. ఎక్కడ అంటే!

OTT: ఓటీటీలో అదరగొడుతున్న అభినవ్ గోమఠం కామెడీ డ్రామా సినిమా.. మరో మైల్‍స్టోన్ దాటేసింది

Brahmamudi: డబ్బు కోసమే మాయా బిడ్డ డ్రామా.. కావ్యకు రాజ్ వార్నింగ్.. భయపడిపోయిన శైలేంద్ర.. కొత్తగా మీరా అబార్షన్ డ్రామా

OTT Movies To Watch: ఓటీటీలో ఈ వారం ఈ 4 మిస్ అవ్వొద్దు.. దేని దానికే డిఫరెంట్.. ఇక్కడ చూసేయండి మరి!

ఊహించినట్లే తెలుగు వెర్షన్‌కు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. మేకర్స్‌ దేశమంతా తిరుగుతూ ప్రమోషన్లు బాగానే చేస్తున్నా.. హిందీ బెల్ట్‌లో మాత్రం లైగర్‌ అడ్వాన్స్‌ బుకింగ్స్ ఆశించిన రేంజ్‌లో లేవు. అయితే ప్రస్తుతం అక్కడ కూడా పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో క్రమంగా పెరిగే అవకాశం ఉంది. ఈ సినిమాతోనే విజయ్‌ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు.

ఈ మూవీలో అతని లుక్‌, ట్రైలర్‌లో యాక్టింగ్‌ స్కిల్స్‌కు నార్త్‌ ఆడియెన్స్‌ కూడా బాగానే కనెక్ట్‌ అయ్యారు. దీంతో హిందీలోనూ ఈ సినిమా బాగానే ఆడుతుందని మేకర్స్‌ ఆశతో ఉన్నారు. తెలుగు, హిందీల్లో ఒకేసారి షూట్‌ చేసిన ఈ సినిమాను తమిళం, మలయాళం, కన్నడల్లోకి మాత్రం డబ్‌ చేశారు. తొలి రోజు అడ్వాన్స్‌ బుకింగ్స్‌ రూపంలో లైగర్‌కు రూ.1.7 కోట్లు వచ్చాయి. ఇందులో చాలా వరకూ తెలుగు వెర్షన్‌ సాధించినవే.

ఇక దేశవ్యాప్తంగా మొత్తం 90 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. రిలీజ్‌కు మరో మూడు రోజులు ఉండటంతో ఈ సంఖ్య భారీగా పెరగవచ్చు. ఇక హైదరాబాద్‌లో మాత్రం లైగర్‌ హంగామా మామూలుగా లేదు. ఇప్పటికే 15 శాతం షోలు హౌజ్‌ఫుల్‌ కావడం విశేషం. ఇది పక్కా తెలుగు సినిమా.. మన సినిమానే ఇండియాకు చూపిస్తున్నాం అని ప్రమోషన్లలో విజయ్ చెబుతున్నాడు. మరి లైగర్ అతని కెరీర్‌ను ఎలా మలుపు తిప్పుతుందో చూడాలి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం