తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kriti Reaction On Date With Tiger: టైగర్‌తో రిలేషన్‌పై స్పందించిన కృతి సనన్.. డేటింగ్‌పై ఆసక్తికర సమాధానం!

Kriti Reaction on Date with Tiger: టైగర్‌తో రిలేషన్‌పై స్పందించిన కృతి సనన్.. డేటింగ్‌పై ఆసక్తికర సమాధానం!

30 August 2022, 11:09 IST

    • Kriti Reaction on Date with Tiger: కాఫీ విత్ కరణ్ ఏడో సీజన్‌లో కృతి సనన్, టైగర్ ష్రాఫ్ పాల్గొన్నారు. ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కరణ్ జోహార్.. వీరిని వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ప్రశ్నలు.. అడుగ్గా.. వారు ఆసక్తికర సమాధానాలిచ్చారు.
కృతి సనన్
కృతి సనన్ (Twitter)

కృతి సనన్

Kriti Reaction on Date with Tiger: బాలీవుడ్ పాపులర్ షో కాఫీ విత్ కరణ్ ఏడో సీజన్ దిగ్విజయంగా ప్రదర్శితమవుతోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ప్రసారమవుతోన్న ఈ షోలో ఇప్పటికే సౌత్ సెన్సేషనల్ సమంత, విజయ్ దేవరకొండ లాంటి స్టార్లు సందడి చేశారు. తాజాగా ఈ షోలో బాలీవుడ్ యంగ్ హీరోహీరోయిన్లు టైగర్ ష్రాఫ్, కృతి సనన్ పాల్గొన్నారు. వీరు నటించిన గణపత్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ షోలో సందడి చేశారు. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ షో హోస్ట్ చేస్తున్న కరణ్ జోహర్ ఎప్పటి లాగానే వీరిని కూడా వ్యక్తిగత విషయాల గురించి అడిగారు. ఇందుకు వారు ఆసక్తికర సమాధానాలను ఇచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

TV Serial Actor Chandu: ఆమె వల్లే మేం విడిపోయాం.. ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదు: సీరియల్ నటుడు చందూ భార్య

OTT Movie: చైన్ బిజినెస్ మోసాలు.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఈ ప్రోమోను గమనిస్తే.. కృతి సనన్ తను మొదటి ఆడిషన్‌కు వెళ్లిన సినిమా గురించి చెప్పింది. తాను మొదట సారి స్టూడెండ్ ఆఫ్ ది ఇయర్ 1 సినిమాకు ఆడిషన్‌కు వెళ్లాలనని, ఆ సినిమాకు మీరే దర్శకత్వం వహించారని, ఆ సినిమా అవకాశం తనకు రాలేదని కరణ్‌కు సమాధానమిస్తుంది. ఇందుకు కరణ్.. ఊప్స్ అంటూ షాక్ అవుతారు. అనంతరం టైగర్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. మీ విషయంలో టైగర్ అస్సలు చొరవ తీసుకోవడం లేదని మీరెప్పుడైనా బాధపడ్డారా? అని కరణ్ ప్రశ్నించగా.. మధ్యలో టైగర్ అందుకుని.. ఆమె చొరవ తీసుకుందని నవ్వుతూ బదులిచ్చారు. ఈ విషయంపై కృతి సనన్ స్పందిస్తూ.. అతడితో నేను ఇంతవరకు డేట్‌కు వెళ్లలేదని తెలిపింది.

అనంతరం రణ్‌వీర్ సింగ్‌ను ఏం అసూయ పరుస్తుంది అని టైగర్‌ను అడగ్గా.. నాకు తెలిసి అతడి భార్య అని టైగర్ బదులిస్తాడు. ఎందుకు అని కరణ్ తిరిగి ప్రశ్నించగా.. ఎందుకంటే ఆమె చాలా ప్రతిభావంతురాలు, అందంగా ఉంటుంది అని స్పష్టం చేశాడు. ఈ విషయంలో కరణ్.. రణ్‌వీర్‌ను వెనుకేసుకొని రాకపోవడం గమనార్హం.

కృతి సనన్ వర్క్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె టైగర్ సరసన గణ్‌పత్ అనే సినిమా చేస్తోంది. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కాకుండా కార్తీక్ ఆర్యన్‌తో షెహజాదా, వరుణ్‌ధావన్‌తో బెహెడియా, ప్రభాస్ సరసన ఆదిపురుష్ లాంటి చిత్రాల్లో నటిస్తోంది. టైగర్ గణ్‌పత్‌తో పాటు బడే మియా చోటే మియా అనే సినిమాను చేస్తున్నాడు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం