Krishna mukunda murari serial february 5th episode: కృష్ణ చేతి నుంచి చేజారిన హారతి.. మురారి ప్రమాదంలో పడబోతున్నాడా?
05 February 2024, 7:15 IST
- Krishna mukunda murari serial february 5th episode: సంతోషంగా ఉన్న కృష్ణ జీవితం కీలక మలుపు తిరగబోతుంది. వరుసగా జరుగుతున్న ప్రమాదాల వల్ల మురారి ప్రమాదంలో పడబోతున్నాడని అర్థం అవుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫిబ్రవరి 5 వ తేదీ ఎపిసోడ్
Krishna mukunda murari serial february 5th episode: కృష్ణ, మురారి బైక్ మీద వెళ్తుంటే ఒక పిల్లాడు వాళ్ళకి ఎదురుపడతాడు. దుప్పటి దొంగతనం చేసి వెళ్తున్నాడని ఒక వ్యక్తి ఆ పిల్లాడిని కొట్టబోతుంటే కృష్ణ ఆపి అతన్ని పంపించేస్తుంది. దుప్పటి ఎందుకు దొంగిలించావని మురారి అడుగుతాడు. అమ్మకి జ్వరంగా ఉందని చలికి తట్టుకోలేకపోతుందని దుప్పటి దొంగతనం చేసినట్టు చెప్తాడు. పిల్లాడి మాటలకి కృష్ణ చాలా బాధపడుతుంది. మందులు కొనడానికి కూడా తన దగ్గర డబ్బులు లేవని చలి తగ్గడం కోసం దుప్పటి కప్పుదామని చేసినట్టు చెప్తాడు. వెంటనే ఆ పిల్లాడిని బండి ఎక్కించుకుని దుప్పటి మందులు కొని తీసుకొచ్చి ఆమెకి ఇస్తారు. కృష్ణ ఆమెకి డబ్బులు కూడా ఇచ్చి ఏమైనా అవసరం అయితే ఫోన్ చేయమని చెప్తుంది. రోడ్డు మీద ఉన్న వాళ్ళకి మనమే షెల్టర్ ఇద్దామని అంటుంది. మురారి కూడా అందుకు ఒప్పుకుంటాడు.
కృష్ణకి తప్పిన ప్రమాదం
కృష్ణ దేవుడి ముందు నిలబడి దణ్ణం పెట్టుకుంటుంది. అన్ని సమస్యలు తీరిపోయాయి. ఆదర్శ్ ఇంటికి రావడంతో అందరూ సంతోషంగా ఉన్నారు. ముకుంద మారిపోయి ఆదర్శ్ తో సంతోషంగా ఉంటుంది. కానీ పెద్దత్తయ్యకి నమ్మకం కలగడం లేదు ముకుందని ఇంకా అనుమానంగానే చూస్తున్నారు. ఆవిడ అనుమానం తొలగిపోయే ప్రయత్నం చేస్తున్నా అది నెరవేరేలా చూడు. అప్పుడు ఆదర్శ్ ముకుంద సంతోషంగా ఉంటారు. నేను నా భర్త కూడా సంతోషంగా ఉంటామని దేవుడికి హారతి ఇస్తుంటే అందులోని హారతి కర్పూరం కింద పడుతుంది. అది కృష్ణ చూసుకోదు. అక్కడ నిప్పు అంటుకుంటుంది. అది చూసి కృష్ణ కంగారుపడుతుంది. ఎందుకు ఇలా జరిగిందని కృష్ణ ఆలోచిస్తుంది. గతంలో కృష్ణ హారతి తీసుకోబోతుండగా అది హారతి ఆరిపోయింది. ఇప్పుడు పూజలో మంటలు అంటుకున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి ఇలా అపశకునాలు జరుగుతున్నాయంటే మళ్ళీ ఏదైనా అరిష్టం జరగబోతుందా అని భయపడుతుంది.
మురారికి చెప్పడం కోసం కృష్ణ గదిలోకి పరుగున వస్తుంది. ఏమైందని అడుగుతాడు. హారతి తీసుకుంటుంటే హారతి ఆరిపోయింది కదా. మళ్ళీ ఇప్పుడు అలాంటిదే జరిగింది. దేవుడి గదిలో పూజ చేసుకుని హారతి తీసుకుందామని అనుకుంటే హారతి కిందపడి మొత్తం కాలిపోయిందని కంగారుగా చెప్తుంది. కళ్ళు మూసుకుని దణ్ణం పెట్టుకుంటున్నాను ఒక్క క్షణం ఆలస్యం అయినా ఆ మంట నా చీరకి అంటుకునేదని చెప్తుంది. అంత నిర్లక్ష్యం ఏంటని మురారి కూడా కంగారుపడతాడు. నాకేం కాదు నా భయం అంతా మీ గురించి. ఆడవాళ్ళు పూజ చేసేది మాంగల్యం కోసమే కదా. అలాంటప్పుడు ఇలా జరిగితే ఆ మాత్రం భయం ఉండదా అంటుంది. డాక్టర్ చదువుకుని ఇలాంటి మూఢ నమ్మకాలు నమ్ముతావ్ ఏంటని తనకి సర్ది చెప్పడానికి చూస్తాడు. కానీ కృష్ణ మాత్రం మురారికి ఏమవుతుందోనని భయపడుతుంది. గుడికి తీసుకుని వెళ్ళమని అడుగుతుంది. ఏం కాదని చెప్తాడు కానీ కృష్ణ మాత్రం గుడికి తీసుకుని వెళ్ళమని పట్టుబడుతుంది.
బెస్ట్ కపుల్ కాంపిటీషన్ లో గెలవాలని డిసైడ్ అయిన ముకుంద
హారతి వల్ల మంటలు అంటుకున్నాయని ఎవరికి చెప్పకు పెద్దమ్మ మరింత సెంటిమెంట్ గా తీసుకుంటుందని మురారి చెప్తాడు. ఎక్కడికి వెళ్తున్నారని రేవతి అడిగితే గుడికి వెళ్తున్నామని కృష్ణ చెప్తుంది. అయితే ఆదర్శ్ అన్నయ్య వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళమని నందిని అంటుంది. వాళ్ళు బయల్దేరారు కదా వెళ్లనివ్వు అనేసరికి మధు అనుమానంగా చూస్తాడు. నువ్వు అలా చూడకు వాళ్ళు నేను వెళ్ళడం ఇష్టం లేదని అలా చెప్పడం లేదు ఆల్రెడీ రెడీ అయ్యారు కదా నేను రెడీ అయ్యే సరికి లేట్అవుతుందని చెప్పి కృష్ణ వాళ్ళని వెళ్ళమని చెప్తుంది. నేను ఆది సాయంత్రం వెళ్తామని అంటుంది. మీరు వేరుగా వెళ్లడమే బెటర్ మేము గోపి వాళ్ళ దగ్గరకి వెళ్తున్నామని బెస్ట్ కపుల్ కాంపిటీషన్ గురించి కనుక్కుని వస్తామని మురారి వెళ్లిపోతారు. ఈ కాంపిటీషన్ నుంచి ఎలా తప్పించుకోవాలా అని ముకుంద ఆలోచిస్తుంది.
మన ఇంట్లో నుంచి రెండు జంటలు పార్టిసిపెట్ చేస్తున్నాయ్ కదా ఎవరు గెలుస్తారు. కృష్ణ వాళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు ఉంటారు. వాళ్ళు గెలిచినా ఒడిపోయినా మనకి వచ్చిన నష్టం ఏం లేదు. కానీ మీరు మాత్రం ఛాలెంజ్ గా తీసుకోవాలి. ఆ కపుల్ ప్రైజ్ మీరు తీసుకోవాలని నందిని ఆదర్శ్ కి చెప్తుంది. నిజమే ఈ కాంపిటీషన్ లో గెలిస్తే అత్తయ్యకి నామీద ఉన్న అనుమానం తొలగిపోతుంది కానీ అందుకోసం ఆదర్శ్ తో కలిపి అడుగులు వేయడానికి మనసు రావడం లేదు ఏం చేయాలని ముకుంద ఆలోచిస్తుంది. కృష్ణ వాళ్ళు గుడికి వస్తారు. కృష్ణ డల్ గా ఉండేసరికి మురారి కూడా బాధపడతాడు. నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకుని భయపడుతున్నావ్ ఏం కాదని మురారి చెప్తాడు. ఒకసారి జరిగితే ప్రమాదం అనుకోవచ్చు కానీ పదే పదే జరిగితే ఏమనుకోవాలని కృష్ణ బాధగా అంటుంది.
మురారికి ఆపద రాబోతుందా?
కృష్ణ జరిగింది మొత్తం పంతులికి చెప్తుంది. నాకేదో అయిపోతుందని భయం కాదు. రెండు సార్లు నా భర్త కోసం సౌభాగ్యం కోసం పూజ చేస్తున్నప్పుడు ఇలా జరిగింది. అందుకే నా భర్తకి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని భయంగా ఉందని చెప్తుంది. ఇలా జరుగుతున్న చిన్న చిన్న ప్రమాదాలు జరగబోయే పెద్ద ప్రమాదానికి సంకేతాలు. అవి మంచి కావచ్చు చెడు కావచ్చు. నీ భర్త కోసం భయపడుతున్నావ్ కాబట్టి మురారి జాతకం అడుగుతాడు. నీకు మృత్యుంజయ మంత్రం చెప్తాను దాన్ని పఠిస్తూ హారతి వెలిగించమని చెప్తాడు. అలా చేస్తే రాబోయే ప్రమాదాలు తొలగిపోతాయాఅని కృష్ణ అడుగుతుంది. భగవంతుడి మీద భారం వేసి హారతి వెలిగించమని చెప్పి మృత్యుంజయ మంత్రం చెవిలో చెప్తాడు. కృష్ణ హారతి వెలిగించి దణ్ణం పెట్టుకుని కళ్ళు తెరిచేసారికి హారతి మళ్ళీ ఆరిపోతుంది.
తరువాయి భాగంలో..
బెస్ట్ కపుల్ కాంపిటీషన్ క్యాన్సిల్ అయ్యిందని చెప్పేసరికి ముకుంద సంతోషపడుతుంది. కానీ అదే ప్రోగ్రామ్ మనం చేస్తామని కృష్ణ వాళ్ళు చెప్తారు. వాలంటైన్స్ డే రోజు మన ఇంట్లో ఉన్న కపుల్స్ తో బెస్ట్ కపుల్ కాంపిటీషన్ పెడతాం. అందులో బెస్ట్ కపుల్ ఎవరో డిసైడ్ చేస్తామని కృష్ణ చెప్తుంది.