Krishna mukunda murari april 5th: ఆదర్శ్ తో సంగీత పెళ్లి చేస్తానన్న ముకుంద.. కృష్ణ, మురారి ఇల్లు వదిలి వెళ్లిపోతారా?
05 April 2024, 7:52 IST
- Krishna mukunda murari serial april 5th episode: ఆదర్శ్ తో సంగీత పేలి చేస్తానని రజినితో చేతులు కలుపుతుంది. ముకుంద. అటు ఆదర్శ్ కి మురారి వాళ్ళ మీద రోజురోజుకీ ద్వేషం పెరిగిపోతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఏప్రిల్ 5వ తేదీ ఎపిసోడ్
Krishna mukunda murari serial april 5th episode: శ్రీనివాస్ కూతురికి పిండం పెట్టేస్తాడు. అది చూసి మీరా తండ్రి మీద వాలి ఏడుస్తుంది. శ్రీనివాస్ నా కూతురు చనిపోలేదు నీలోనే ఉంది. ఈరోజు నుంచి నా కూతురిని నీలోనే చూసుకుంటానని మీరాని ఓదారుస్తాడు. తెలిసి అన్నావో తెలియక అన్నావో కానీ అద్భుతమైన ఐడియా ఇచ్చావని అనుకుంటుంది.
కృష్ణ మీద మాట పడనివ్వని భవానీ
ఎలాగైనా ఆదర్శ్ కి సంగీతని ఇచ్చి పెళ్లి చేయాలని ఏదో ఒకటి చేయాలని రజిని అనుకుంటుంది. కృష్ణ అటుగా వెళ్తుంటే పిలిచి ముకుంద ఎలా చనిపోయిందని అడుగుతుంది. అందరూ చనిపోయినట్టే చనిపోయిందని వంకరగా సమాధానం చెప్తుంది. కృష్ణ మాటలకు రజినీకి బీపీ పెరిగి భవానీని పిలుస్తుంది. నీ కోడలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందని చెప్తుంది.
నేను ఏం అడిగినా పెడసరిగా సమాధానం చెప్తుంది, అసలు మమ్మల్ని మనుషులుగా కూడా చూడటం లేదని కంప్లైంట్ ఇస్తుంది. ఆ మాట నేను ఒప్పుకోను ఈ ఇంట్లో అందరి బాగోగులు చూసే వాళ్ళు ఈ ఇంట్లో ఎవరైనా ఉన్నారంటే అది కృష్ణ మాత్రమే. తను ఎవరిని తక్కువగా చూడదు నిన్ను కూడా అని భవానీ అంటుంది. మీకేం మర్యాదలు చేయాలని కృష్ణ నిలదీస్తుంది.
ఏం అడిగినా వంకరగా సమాధానం చెప్తుందని అంటే కృష్ణ మాట తీరు అంతేనని మురారి వెనకేసుకొస్తాడు. ఇప్పుడే ముకుందకు పెద్ద ఖర్మ చేసి వచ్చాం దాని పిండం ఒక్క కాకి కూడా ముట్టలేదు. తన ఆత్మ శాంతించించలేదని మేము బాధపడుతుంటే ఈ గొడవలు ఏంటని భవానీ కోపంగా అంటుంది.
మీరాని ముకుందగా మార్చిన ఆదర్శ్
ముకుంద డ్రామా మొదలు పెడుతుంది. కూలబడి ఏడుస్తుంటే అందరూ కంగారుపడతారు. ఏమైందని ఆదర్శ్ అడిగితే ముకుంద గుర్తుకు వచ్చిందని చెప్తుంది. ముకుంద వాళ్ళ నాన్న ఒకమాట అన్నారు నా కూతురు చనిపోలేదు నీలోనే ఉందని అన్నారు. తనని చూసుకున్నాట్టే నన్ను చూసుకున్నారు. కానీ నేను ముకుంద అని ఎవరిని పిలవాలి? ఈ బాధ నన్ను వెంటాడుతూనే ఉంటుందని ఏడుస్తుంది.
మీరా మనకి కావాల్సిన వాళ్ళు ఒక్కసారిగా కనిపించకపోతే ఆ బాధ తట్టుకోవడం కష్టం. వాళ్ళ జ్ఞాపకాలు మనల్ని వెంటాడి వేధిస్తాయి. కానీ కొన్నేళ్ళ తర్వాత ఆ జ్ఞాపకాలు మనుషులు మరుగున పడిపోతాయి. అంతవరకు వాటిని మోయక తప్పదని భవానీ చెప్తుంది. ఆదర్శ్ ముకుందతో ఉన్న క్షణాలు గుర్తు చేసుకుంటాడు.
అవసరం లేదమ్మా ఏది మర్చిపోవాల్సిన అవసరం లేదు. ఏ బాధ లేకుండా ఎప్పటికీ గుర్తుంచుకునే దారి ఉంది. ఇప్పటి నుంచి మీరా పేరు ముకుంద అని అంటాడు. దీంతో ఇంట్లో అందరూ షాక్ అవుతారు. మీరాని ఆదర్శ్ ముకుంద అని పిలుస్తూ మాట్లాడతాడు. ముకుంద అనే పేరు వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో తెలిసి కూడా మళ్ళీ ఆ పేరు ఎందుకని మధు అంటాడు. కానీ ఆదర్శ్ మాత్రం శ్రీనివాస్ మీరాలో ముకుందని చూసుకుంటే మీకేంటి ప్రాబ్లం అంటాడు.
పగతోనే ఇలా చేసాడు
ముకుంద అంటే ఈ ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు కానీ మీరా అంటే అందరికీ ఇష్టమే కదా. కానీ తనకి ముకుంద ఇష్టం అంటాడు. మీరా కోరికను నెరవేరుద్దామని ఆదర్శ్ తల్లిని బతిమలాడతాడు. దీంతో భవానీ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. మౌనంగా ఉన్నావంటే ఒప్పుకున్నాట్టే కదాని ఆదర్స్ వెళ్ళి మీరాని పేరు మార్చడం ఇష్టమే కదాని అడుగుతాడు. ఇష్టం కాదు ఇది నా అదృష్టమని అంటుంది.
ఈ క్షణం నుంచి అందరూ నన్ను ముకుంద అని పిలవండి ఆనందంగా పలుకుతానని అంటుంది. ఇంట్లో అందరూ కోపంగా చూస్తారు. మీరాకు ముకుంద పేరు పెట్టడం ఏంటని కృష్ణ మురారిని అడుగుతుంది. మన మీద పగ తీర్చుకుంటున్నాడు. ముకుంద లేకపోయినా తన పేరు ఇంట్లో వినపడేలా చేయాలని ఇలా చేశాడని అంటుంది.
ముకుంద చనిపోవడానికి మనం కారణం కాదు కదా మనకేంటి ఇబ్బంది. కానీ నా బాధ అంతా ఆదర్శ్ గురించి. జరిగింది మర్చిపోయి ఆదర్శ్ మనల్ని క్షమిస్తాడని అనుకున్నాం కానీ ఇప్పుడు మీరాని ముకుంద అని పిలిస్తే జరిగింది ఏదీ మర్చిపోలేడని మురారి అంటాడు.
మీరా పేరు మార్చడం నచ్చలేదన్న మురారి
ఆదర్శ్ మనసు ఎలాగైనా మార్చాలి, ముకుంద చావుకు మనం కారణం కాదని నమ్మించాలని కృష్ణ అంటే ఎక్కడ నమ్ముతున్నాడు. మనల్ని శత్రువులుగా చూస్తున్నాడని మురారి బాధగా అంటాడు. మీరా ముకుంద ఫ్రెండ్ కదా పైగా మీరా ఏం చెప్తే అది వింటునట్టు కనిపిస్తున్నాడు. తనతో మనం మాట్లాడిద్దామని కృష్ణ ఐడియా ఇస్తుంది.
సరే మాట్లాడమని చెప్దామని అంటాడు. ముకుంద గదిలోకి వచ్చి మురారి షర్ట్ పట్టుకుని తన ప్లాన్ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని తెగ సంతోషపడిపోతుంది. నీకోసం రూపం మార్చుకున్నాను నీ నోటితో ముకుంద అని పిలిపించుకోవడం మిస్ అయ్యిందని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆదర్శ్ నాపేరుని ముకుంద అని మార్చేశాడు. ఇప్పుడు నేను మళ్ళీ నీ ముకుందని అయిపోయానని అనుకుంటుంది.
రజినితో చేతులు కలిపిన ముకుంద
రజిని ఆదర్శ్ కనీసం సంగీత వైపు చూడటం లేదని రగిలిపోతుంది. బావని వలలో వేసుకోవడం చేతకావడం లేదని కూతురిని తిడుతుంది. బావ పట్టించుకొకపోతే నేనేం చేస్తానని అంటుంది. ముకుందని మర్చిపోతే కానీ నీవైపు కన్నెత్తి చూస్తాడు, అసలు ఆదర్శ్ ముకుందని మర్చిపోతాడో లేదోనని అంటుంది. ముకుంద ఎంట్రీ ఇస్తుంది. మరచిపోవడం ఎంత సేపు పిన్ని గారు అని వరస కలిపేస్తుంది.
చచ్చిపోయిన పెళ్ళాం పేరు నీకు పెడితే నువ్వు తల ఊపావు. నీ మనసులో ఏముందని డౌట్ పడుతుంది. నేను తన ఫ్రెండ్ అని పెట్టాడని అంటుంది. ఏమో నీకు తన పెళ్ళాం పేరు పెట్టిన వాడు రేపు నీలో తన పెళ్ళాన్ని చూసుకుంటే ఏంటని రజినీ అడిగేసరికి ముకుంద షాక్ అవుతుంది. రేపు నీకు ఆదర్శ్ ని పెళ్లి చేసుకోవాలని ఆశ పుడితే ఏంటి పరిస్థితని అంటుంది. తనకి ఆ ఆలోచన లేదని ముకుంద చెప్తుంది. నేను చెప్పినట్టు చేయండి ఆదర్శ్ తో మీ కూతురు పెళ్లి చేసే బాధ్యత తనదని అంటుంది.
తరువాయి భాగంలో..
కృష్ణ మురారి బయటకి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఆదర్శ్ తాగుతూ కనిపిస్తాడు. మాకోసం కాకపోయినా పెద్దమ్మ కోసమొక్కసారి ఆలోచించు అంటాడు. దీంతో ఆదర్శ్ కోపంగా అరుస్తాడు. ఈరోజు నేను ఇలా అయిపోవడానికి కారణం మీరు నువ్వు కృష్ణ కలిసి నా జీవితాన్ని సర్వ నాశనం చేశారు. నువ్వు ఉంటున్న ఈ ఇంట్లో నేను ఉంటున్నాను చూడు అందుకు నాకు నేనే ఏదో ఒకటి చేసుకుని చచ్చిపోయేవాడిని. నేనే నీ ప్లేస్ లో ఉంటే నేను ఈ ఇంట్లో ఉండే వాడిని కాదని అరుస్తాడు. ఇదంతా ముకుంద, భవానీ చూస్తూ ఉంటారు.
టాపిక్