తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Koffee With Karan 8: స్పీడ్‍ డయల్‍లో అతడి నంబర్: రిలేషన్‍షిప్‍ను జాన్వీ కపూర్ కన్ఫార్మ్ చేసేసిందా?

Koffee with Karan 8: స్పీడ్‍ డయల్‍లో అతడి నంబర్: రిలేషన్‍షిప్‍ను జాన్వీ కపూర్ కన్ఫార్మ్ చేసేసిందా?

01 January 2024, 21:28 IST

    • Koffee with Karan 8: తన బాయ్‍ఫ్రెండ్ గురించి బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ దాదాపు కన్ఫార్మ్ చేసేశారు. కాఫీ విత్ కరణ్ 8 షోకు వచ్చిన ఆమె పొరపాటును ఈ విషయం చెప్పేసింది. ఆ వివరాలివే..
జాన్వీ కపూర్
జాన్వీ కపూర్

జాన్వీ కపూర్

Koffee with Karan 8: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రేమలో ఉన్నారంటూ కొంతకాలంగా పుకార్లు వస్తూనే ఉన్నాయి. తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియాతో ఆమె డేటింగ్ చేస్తున్నారని వినిస్తోంది. ఈ రూమర్లకు ఊతమిచ్చేలా కొన్ని కార్యక్రమాల్లో కలిసికట్టుగా కనిపించారు జాన్వీ, పహారియా. వారిద్దరూ లవ్‍లో మునిగితేలుతున్నారంటూ రూమర్స్ గట్టిగా వస్తున్నాయి. అయితే, ఈ విషయంపై ఇద్దరూ మౌనం దాలుస్తూ వచ్చారు. అయితే, తాజాగా జాన్వీ కపూర్ తన సోదరి ఖుషి కపూర్‌తో కలిసి ‘కాఫీ విత్ కరణ్ 8’ టాక్‍షోలో పాల్గొన్నారు. కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహిస్తున్న ఈ పాపులర్ షోలో పహారియాతో తన రిలేషన్ గురించి పొరపాటున హింట్ ఇచ్చేశారు జాన్వీ.

ట్రెండింగ్ వార్తలు

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

TV Serial Actor Chandu: ఆమె వల్లే మేం విడిపోయాం.. ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదు: సీరియల్ నటుడు చందూ భార్య

OTT Movie: చైన్ బిజినెస్ మోసాలు.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Laya: ఆ డైరెక్టర్ చంపుతానని బెదిరించాడు.. 18 ఏళ్లకు నిజం బయటపెట్టిన హీరోయిన్ లయ

కాఫీ విత్ కరణ్ 8 తదుపరి ఎపిసోడ్‍కు సంబంధించిన ప్రోమో వచ్చింది. జాన్వీ కపూర్, ఖుషి కపూర్ ఈ ఎపిసోడ్‍కు గెస్టులుగా వచ్చారు. వారిని రిలేషన్‍షిప్స్, డేటింగ్ గురించి సమాచారం రాబట్టేందుకు కరణ్ జోహార్ చాలా ప్రయత్నించారు. ప్రశ్నలు అడిగారు. జాన్వీ కపూర్ డేటింగ్ చేసిన ముగ్గురి పేర్లు చెప్పాలని ఖుషిని అడిగారు కరణ్. అయితే, చెప్పొద్దు అంటూ ఖుషిని ఆపారు జాన్వీ.

ఆ తర్వాత “నీ ఫోన్ స్పీడ్ డయల్‍‍ లిస్టులో ఉన్న ముగ్గురు ఎవరు” అని జాన్వీ కపూర్‌ను కరణ్ అడిగారు. దీంతో జాన్వీ తొందరలో ఆన్సర్ చెప్పారు. “పప్పా (బోనీ కపూర్), ఖుషి, షిక్కు” అని జాన్వీ చెప్పేశారు. వీరిలో షిక్కూ అంటే శిఖర్ పహారియానే. షిక్కు అని జాన్వీ బ్లష్ అయ్యారు. పొరపాటు చెప్పేశానే అనేలా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. విషయం బయటపడిందనేలా కరణ్ కూడా గట్టిగా నవ్వుతూ అటు తిరిగారు.

శిఖర్ పహారియా నంబర్ తన ఫోన్ స్పీడ్ డయల్‍లో ఉందని చెప్పడంతో అతడి డేటింగ్‍ను జాన్వీ దాదాపు కన్ఫార్మ్ చేసినట్టయింది. అందులోనూ అతడి పేరు చెప్పాక ఆమె సిగ్గు పడిన విధానం చూస్తే విషయం అర్థమవుతోందని కూడా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడే శిఖర్ పహారియా.

జాన్వీ కపూర్, ఖుషి కపూర్ పాల్గొన్న ఈ కాఫీ విత్ కరణ్ ఎపిసోడ్ డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో జనవరి 4న స్ట్రీమింగ్‍కు రానుంది.

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర చిత్రంతో టాలీవుడ్‍లోకి ఎంట్రీ ఇస్తున్నారు జాన్వీ కపూర్. ఈ చిత్రంలో పక్కా పల్లెటూరి అమ్మాయిలా లంగావోణీలో జాన్వీ కనిపించనున్నారు. దేవర నుంచి వచ్చిన ఆమె ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. దేవర పార్ట్-1 గ్లింప్స్ జనవరి 8వ తేదీన రానుంది. అలాగే, భారీ బడ్జెట్‍తో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ఈ ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం