Crime Thriller OTT: ఓటీటీలోకి వచ్చిన తెలుగు హీరోయిన్ తమిళ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ - ఫ్రీ స్ట్రీమింగ్ ఎందులో అంటే?
24 October 2024, 11:43 IST
Crime Thriller OTT: తెలుగు హీరోయిన్ ఆనంది ప్రధాన పాత్రలో నటించిన తమిళ మూవీ వైట్‌రోజ్ ఓటీటీలోకి వచ్చింది. ఓవర్‌సీస్‌లో సింప్లీసౌత్ ఓటీటీలో రిలీజైంది. వైట్‌రోజ్ మూవీ కన్నడ, హిందీ వెర్షన్స్ యూట్యూబ్‌లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోన్నాయి.
క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ
Crime Thriller OTT: తెలుగు హీరోయిన్ ఆనంది నటించిన తమిళ మూవీ వైట్‌రోజ్ ఓటీటీలోకి వచ్చింది. సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ కే రాజశేఖర్ దర్శకత్వం వహించాడు. ఆనందితో పాటు కే సురేష్ కీలక పాత్రలు పోషించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ దాదాపు ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. సింప్లీ సౌత్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ ఓటీటీలో కేవలం ఓవర్‌సీస్ ఆడియెన్స్ మాత్రమే ఈ మూవీని చూడొచ్చు.
అమెజాన్ ప్రైమ్‌లో...
ఇండియన్ ఆడియెన్స్ వైట్‌రోజ్ మూవీని చూడాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందేనని మేకర్స్ చెబుతోన్నారు. త్వరలోనే అమెజాన్ ప్రైమ్‌లో వైట్‌రోజ్ మూవీ రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్‌ను మాత్రం రివీల్ చేయలేదు. వైట్‌రోజ్ కన్నడ, హిందీ వెర్షన్స్ మాత్రం ఇప్పటికే యూట్యూబ్‌లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోన్నాయి.హిందీ వెర్షన్ ఐదు మిలియన్లకుపైగా వ్యూస్‌ను దక్కించుకున్నది.
కమర్షియల్ ఫెయిల్యూర్...
క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన వైట్‌రోజ్ మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఆనంద యాక్టింగ్‌కు పేరొచ్చిన కమర్షియల్‌గా ఆశించిన విజయాన్ని దక్కించుకోలేకపోయింది.
వైట్‌రోజ్ మూవీ కథ ఇదే...
దివ్య (ఆనంది) ఓ సూపర్ మార్కెట్‌లో పనిచేస్తుంటుంది. అష్రఫ్‌ను (విజీత్) ప్రేమించి పెళ్లిచేసుకుంటుంది. సాఫీగా సాగిపోతున్న ఆమె ఫ్యామిలీ లైఫ్ ఒక్కరోజులో మొత్తం తలక్రిందులవుతుంది. ఓ సైకో కిల్లర్ (ఆర్‌కే సురేష్) దివ్య కూతురిని కిడ్నాప్ చేస్తాడు. మరోవైపు ఫేక్ ఎన్‌కౌంటర్‌లో ఆమె భర్త అష్రఫ్‌ను పోలీసులు చంపేస్తారు.
తన భర్తపై పడిన నిందను తొలగించుకోవడమే కాకుండా సైకో కిల్లర్ బారి నుంచి కూతురిని దివ్య ఎలా కాపాడుకుంది? ఈ పోరాటంలో ఆమెకు ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? ఆ సైకో కిల్లర్ దివ్యను ఎందుకు టార్గెట్ చేశాడు అన్నదే ఈ మూవీ కథ.
మారుతి బస్‌స్టాప్ మూవీతో...
ఆనంది అచ్చ తెలుగు హీరోయిన్ కావడం గమనార్హం. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈరోజుల్లో మూవీలో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అతడి దర్శకత్వంలోనే వచ్చిన బస్‌స్టాప్ మూవీలో హీరోయిన్‌గా నటించింది. తెలుగులో జాంబీరెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్, మారేడుమిల్లి ప్రజానికంతో పాటు పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.
కయల్ ఆనందిగా...
కయల్ మూవీతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఆనంది. కయల్ సూపర్ హిట్ కావడంతో కయల్ ఆనందిగా ఫేమస్ అయ్యింది. తమిళంలో ఇప్పటివరకు ఇరవైకిపైగా సినిమాలు చేసింది. కాజల్ లీడ్‌రోల్‌లో నటించిన లైవ్ టెలికాస్ట్ వెబ్‌సిరీస్‌లో ఆనంది ఓ కీలక పాత్రలో మెరిసింది.