Kavya Thapar: రొమాన్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది.. రవితేజతో కెమిస్ట్రీ అలా: ఈగల్ హీరోయిన్ కావ్య థాపర్
07 February 2024, 7:43 IST
Kavya Thapar About Romance With Ravi Teja In Eagle Movie: మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ మూవీ ఈగల్. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌తోపాటు మరో హీరోయిన్ కావ్య థాపర్ కూడా నటిస్తోంది. ఈగల్ మూవీలో రవితేజతో రొమాన్స్ చాలా కొత్తగా, డిఫరెంట్‌గా ఉంటుందని కావ్య థాపర్ తెలిపింది.
రొమాన్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది.. రవితేజతో కెమిస్ట్రీ అలా: ఈగల్ హీరోయిన్ కావ్య థాపర్
Kavya Thapar About Eagle Movie: మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ స్టైలీష్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఫిబ్రవరి 9న ఈగల్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ కావ్య థాపర్ 'ఈగల్' విశేషాలని తాజాగా పంచుకున్నారు.
'ఈగల్' ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు?
ఓ బాలీవుడ్ సినిమా షూటింగ్ కోసం ముంబైలో ఉన్న సమయంలో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని గారు ఈగల్ కథ చెప్పారు. చాలా కొత్తగా, అద్భుతంగా అనిపించింది. తప్పకుండా సినిమా చేయాలని అనుకున్నాను. అన్నిటికంటే రవితేజ గారి సినిమాలో చేయడం గొప్ప అవకాశం. లుక్ టెస్ట్ చేసిన తర్వాత ఎంపిక చేశారు. ఈగల్‌లో యాక్షన్ రోమాన్స్ చాలా యూనిక్‌గా ఉంటాయి. రోమాన్స్ అయితే చాలా డిఫరెంట్‌గా, కొత్తగా ఉంటుంది. కచ్చితంగా ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు.
ఈగల్ లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?
ఇందులో నా పాత్ర పేరు రచన. జీవితంలో చాలా యునిక్ గోల్స్ ఉన్న అమ్మాయిగా కనిపిస్తాను. ఇందులో చాలా అద్భుతమైన ప్రేమకథ ఉంది. దాని గురించి అప్పుడే ఎక్కువ రివిల్ చేయకూడదు (నవ్వుతూ). రవితేజ గారు, నా పాత్రల మధ్య కెమిస్ట్రీ చాలా యూనిక్‌గా ఉంటుంది. సినిమా చాలా బాగా వచ్చింది. ఈగల్‌పై రవితేజ గారు, డైరెక్టర్ కార్తిక్, మా టీం అంతా చాలా హ్యాపీగా, కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఈగల్ తప్పకుండా ప్రేక్షకులని చాలా గొప్పగా అలరిస్తుంది.
రవితేజ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
రవితేజ గారితో సినిమా చేయడం నా అదృష్టం. రవితేజ గారి వ్యక్తిత్వానికి నేను పెద్ద అభిమానిని. ఆయన చాలా పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు. సెట్స్‌లో చాలా సరదాగా, సపోర్టివ్‌గా ఉంటారు. ఆయనతో వర్క్ చేయడం మర్చిపోలేని అనుభూతి. ఈగల్ బ్యూటీఫుల్ జర్నీ. పోలాండ్, లండన్ ఇలా అద్భుతమైన ఫారిన్ లోకేషన్స్‌లో ఇంటర్ నేషనల్ లెవల్‌లో షూట్ చేశారు. నిజంగా ఒక వెకేషన్‌లానే అనిపించింది. చాలా ఎంజాయ్ చేశాను.
ఈగల్ విషయంలో మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ?
రచయిత మణిగారు ''అద్భుతంగా నటించారు. తెరపై కావ్య కాకుండా రచన కనిపించింది' అన్నారు. రచయిత నుంచి ఈ ప్రశంస రావడం చాలా తృప్తిని ఇచ్చింది. నా వరకూ పాత్రకు వందశాతం న్యాయం చేశాననే నమ్ముతున్నాను. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో వవర్క్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. సినిమాని ఇంటర్నేషనల్‌గా చాలా గ్రాండ్‌గా చిత్రీకరించారు. వారితో మరిన్ని చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాను.
కోవిడ్ టైం మీ కెరీర్‌పై ప్రభావం చూపించిందా?
కోవిడ్ కారణంగా దాదాపు అందరికీ ఒక బ్రేక్ టైం వచ్చింది. అయితే ఈ సమయంలో ఎక్ మినీ కథ, ఫర్జీ వెబ్ సిరిస్ చేశాను. అలాగే ఇంట్లో ఉండటం, ఇంటి భోజనం తినడం, ఫ్యామిలీతో సమయాన్ని గడపటం, తోచిన సాయం చేయడం.. ఇవన్నీ కూడా చేసే అవకాశం ఆ సమయం కల్పించింది. ఫుల్ మాస్ యాక్షన్ సినిమా చేయాలని ఉంది (నవ్వుతూ). అలాగే సూపర్ నేచురల్ సినిమాలు చేయాలని ఉంది.