తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kaun Banega Crorepati 15: కౌన్ బనేగా క్రోర్‌పతి కొత్త సీజన్ వచ్చేస్తోంది.. ఎప్పటి నుంచో తెలుసా?

Kaun Banega Crorepati 15: కౌన్ బనేగా క్రోర్‌పతి కొత్త సీజన్ వచ్చేస్తోంది.. ఎప్పటి నుంచో తెలుసా?

Hari Prasad S HT Telugu

31 July 2023, 22:12 IST

google News
    • Kaun Banega Crorepati 15: కౌన్ బనేగా క్రోర్‌పతి కొత్త సీజన్ వచ్చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమోను సోనీ ఛానెల్ సోమవారం (జులై 31) రిలీజ్ చేసింది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఈ షోను హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.
కౌన్ బనేగా క్రోర్‌పతి షోలో అమితాబ్ బచ్చన్
కౌన్ బనేగా క్రోర్‌పతి షోలో అమితాబ్ బచ్చన్

కౌన్ బనేగా క్రోర్‌పతి షోలో అమితాబ్ బచ్చన్

Kaun Banega Crorepati 15: బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసే ప్రముఖ క్విజ్ షో కౌన్ బనేగా క్రోర్‌పతి (Kaun Banega Crorepati) 15వ సీజన్ రాబోతోంది. దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ ను సోనీ టెలివిజన్ సోమవారం (జులై 31) ఓ ప్రోమో ద్వారా రిలీజ్ చేసింది. ఈ కొత్త సీజన్ ఆగస్ట్ 14 నుంచి ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది.

కేబీసీ 15వ సీజన్ సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు రాత్రి 9 గంటలకు టెలికాస్ట్ అవుతుంది. కొత్త ఆరంభం అంటూ ఈ షో ప్రోమోను సోనీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. అమితాబ్ ఫుల్ ఎనర్జీతో ఈ ప్రోమోలో కనిపించాడు. తనదైన సూటు, బూటు స్టైల్లో అమితాబ్ ఈ షో ప్రోమోలో స్టేజ్ పైకి ఎంటరవుతాడు. అతనికి ప్రేక్షకులు స్టాండింగ్ ఒవేషన్ తో వెల్‌కమ్ చెబుతారు.

కొత్త సీజన్ కు ఓ కొత్త ఆరంభం లభించబోతోందంటూ న్యూ బిగినింగ్ అనే హ్యాష్‌ట్యాగ్ ను అమితాబ్ ఈ సందర్భంగా పరిచయం చేశాడు. దేశమంతా ఈ షోను ఎంతగానో ఆదరించింది. ఈ షో ప్రారంభమై రెండు దశాబ్దాలకుపైనే అయినా దీనికున్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. ఈసారి మరింత కొత్తగా షో ఉండబోతున్నట్లు ప్రోమో ద్వారా సోనీ ఛానెల్ వెల్లడించింది.

కౌన్ బనేగా క్రోర్‌పతి కొత్త సీజన్ ప్రారంభం కానుండటంపై ఫ్యాన్స్ ఉత్సాహం కనబరిచారు. ఈ ప్రోమోకు హార్ట్ ఎమోజీల ద్వారా తమ అభిమానాన్ని చాటి చెప్పారు. కొన్ని వారాల కిందటే ఈ కేబీసీ కొత్త సీజన్ షూటింగ్ ప్రారంభమైంది. దానికి సంబంధించిన ఫొటోలను కూడా అప్పట్లో అమితాబ్ షేర్ చేశాడు. అమెరికన్ షో హు వాంట్స్ టు బి ఎ మిలియనీర్ షోకు ఇండియన్ వెర్షన్ గా 2000వ ఏడాదిలో ఈ కేబీసీ షో ప్రారంభమైంది.

తొలి సీజన్ నుంచే అమితాబ్ బచ్చన్ ఈ షోను హోస్ట్ చేస్తున్నాడు. మూడో సీజన్ మాత్రం షారుక్ ఖాన్ హోస్ట్ చేసినా.. తర్వాత మళ్లీ బిగ్ బీ చేతుల్లోకే కేబీసీ వెళ్లింది. ఇప్పుడు 15వ సీజన్ తో మరోసారి అతడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

తదుపరి వ్యాసం