Amitabh on Kamal Haasan: నువ్వు మా అందరికంటే ఎంతో గొప్పోడివి.. కమల్ హాసన్‌పై అమితాబ్ ప్రశంసలు-amitabh on kamal haasan says he is greater than all of them ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Amitabh On Kamal Haasan: నువ్వు మా అందరికంటే ఎంతో గొప్పోడివి.. కమల్ హాసన్‌పై అమితాబ్ ప్రశంసలు

Amitabh on Kamal Haasan: నువ్వు మా అందరికంటే ఎంతో గొప్పోడివి.. కమల్ హాసన్‌పై అమితాబ్ ప్రశంసలు

Hari Prasad S HT Telugu
Jul 21, 2023 11:55 AM IST

Amitabh on Kamal Haasan: నువ్వు మా అందరికంటే ఎంతో గొప్పోడివి అంటూ కమల్ హాసన్‌పై అమితాబ్ ప్రశంసలు కురిపించాడు. అమెరికాలోని శాన్ డీగో కామిక్ కాన్ లో ప్రాజెక్ట్ కే టైటిల్, గ్లింప్స్ లాంచ్ సందర్భంగా వీళ్లు ఒకరినొకరు మెచ్చుకున్నారు.

శాన్ డీగో కామిక్ కాన్ ఈవెంట్లో కల్కి 2898 ఏడీ టీమ్, వీడియో కాల్ ద్వారా మాట్లాడుతున్న అమితాబ్
శాన్ డీగో కామిక్ కాన్ ఈవెంట్లో కల్కి 2898 ఏడీ టీమ్, వీడియో కాల్ ద్వారా మాట్లాడుతున్న అమితాబ్ (AFP)

Amitabh on Kamal Haasan: ఇండియన్ సినిమా గర్వించదగిన నటలు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్. ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న సినిమా కల్కి 2898 ఏడీ. ఇన్నాళ్లూ ప్రాజెక్ట్ కేగా పిలిచిన ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ ను శాన్ డీగో కామిక్ కాన్ ఈవెంట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్లో ఈ ఇద్దరు లెజెండరీ నటులు పాల్గొన్నారు.

కమల్ హాసన్ నేరుగా శాన్ డీగో వెళ్లగా.. అమితాబ్ బచ్చన్ వీడియో కాల్ ద్వారా ఈవెంట్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వీళ్లు ఒకరిపై మరొకరు ప్రశంసలు కురిపించుకున్నారు. "మేమంతా అమిత్ జీ ఎనర్జీతో జీవిస్తుండటం గొప్ప గౌరవంగా ఉంది" అని కమల్ హాసన్ అన్నాడు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న అమిత్ నవ్వుతూ.. "నువ్వు మరీ అంత నిరాడంబరుడిగా ఉండకు కమల్. మా అందరి కంటే నువ్వు చాలా గొప్పోడివి" అని అన్నాడు.

"అతని ప్రతి సినిమా రియాల్టీతో కూడుకొని ఉంటుంది. ప్రతి సినిమాలో అతడు చాలా ఎఫర్ట్ పెడతాడు. అతడు పోషించిన పాత్రలు అద్భుతం. అతడు ఉన్న సినిమాలో నటించడం గౌరవం. మేము ఇంతకుముందు కూడా రెండు సినిమాల్లో చేశాం కానీ ఇది చాలా స్పెషల్" అని కమల్ ను ఉద్దేశించి బిగ్ బీ అన్నాడు. దీనికి కమల్ కూడా సరదాగా స్పందించాడు.

"షోలే సినిమాకు నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నాను. ఆ సినిమా చూసిన రాత్రి నేను అసలు నిద్రపోలేదు. ఎందుకంటే ఆ సినిమాను చాలా ద్వేషించాను. ఆ సినిమా తీసిన వ్యక్తిని మరింత ద్వేషించాను. ఓ గొప్ప ఫిల్మ్ మేకర్ తో కలిసి పని చేసే అవకాశం నాకు వచ్చింది. అప్పుడు నా రియాక్షన్ అది. ఆ విషయం అతనికి చెప్పాను. ఓ టెక్నీషియన్ గా ఆ రోజు రాత్రి నిద్రపోలేదు. అమిత్ జీ అలాంటి ఎన్నో సినిమాలు చేశాడు. నా సినిమాల గురించి అతడు ఇంత గొప్పగా చెబుతాడని ఎప్పుడూ ఊహించలేదు" అని కమల్ అన్నాడు.

నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ కల్కి 2898 ఏడీ మూవీలో అమితాబ్, కమల్ తోపాటు ప్రభాస్, దీపికా పదుకోన్, దిశా పటానీ నటిస్తున్నారు. శాన్ డీగో కామిక్ కాన్ ఈవెంట్లో కనిపించిన తొలి ఇండియన్ సినిమాగా ప్రాజెక్ట్ కే నిలిచింది. ఈ ఈవెంట్లోనే అసలు ప్రాజెక్ట్ కే అంటే ఏంటి అన్నది చెప్పడమే కాదు.. ఈ మూవీ అసలు టైటిల్ కల్కి 2898 ఏడీ అని రివీల్ చేయడంతోపాటు గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు.

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం