Project K Glimpse: గూస్‌బంప్స్ తెప్పిస్తోన్న ప్రాజెక్ట్ కే ఫస్ట్ గ్లింప్స్ - రికార్డులు బద్దలవ్వడం ఖాయమే!
Project K Glimpse: ప్రభాస్ ప్రాజెక్ట్ కే మూవీ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది. శాన్ డియాగోలో జరిగిన కామిక్ కాన్ ఈవెంట్‌లో ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌తో పాటు టైటిల్‌ను రివీల్ చేశారు. ఈ సినిమాకు కల్కి 2898 ఏడీ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
Project K Glimpse: ప్రభాస్ ప్రాజెక్ట్ కే మూవీ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది. ఈ సినిమాకు కల్కి 2898 ఏడీ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ ఫస్ట్ గ్లింప్స్‌ను శాన్ డియాగోలోని కామిక్ కాన్ ఈవెంట్‌లో శుక్రవారం తెల్లవారుజామున రిలీజ్ చేశారు. . అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్, హాలీవుడ్‌కు ధీటైన గ్రాఫిక్స్ హంగులతో విజువల్ ఫీస్ట్‌గా ఈ ఫస్ట్ గ్లింప్స్ అభిమానులను మెస్మరైజ్ చేస్తున్నాయి. కొందరు దుష్టశక్తులు ప్రజలను బందీలను చేయడం, ఆ ప్రజలు పడుతోన్న బాధలను ఫస్ట్ గ్లింప్స్ వీడియో ఆరంభంలో చూపించారు.
ఆ ప్రజలను కాపాడటానికి ఉద్భవించిన సూపర్ హీరోగా ప్రభాస్ ఎంట్రీ ఇచ్చిన సీన్ ఫస్ట్ గ్లింప్స్‌కు హైలైట్‌గా నిలిచింది. ప్రభాస్ లుక్, అతడిపై చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తన్నాయి. చివరలో వాట్ ఈజ్ ప్రాజెక్ట్ అనే ఓ వ్యక్తి అడగ్గా వెంటనే టైటిల్ రివీల్ కావడం ఆకట్టుకుంటోంది.
ఈ మూవీకి కల్కి 2898 ఏడీ అనే పేరును ఫిక్స్ చేశారు. ఈ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్‌తో పాటు కమల్‌హాసన్, దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత అశ్వనీదత్ పాల్గొన్నారు. ఇండియన్ సినీ చరిత్రలోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీస్‌లో ఒకటిగా దాదాపు ఆరు వందల కోట్ల బడ్జెట్‌తో ప్రాజెక్ట్ కే మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కమల్‌హాసన్‌తో పాటు బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలను పోషిస్తున్నారు.
కమల్‌హాసన్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఫస్ట్ గ్లింప్స్‌లో అతడిని చూపించలేదు. ప్రభాస్‌కు జోడీగా దీపికా పడుకోణ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీతోనే దీపికా పడుకోణ్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.
సంక్రాంతి కానుకగా జనవరి 12న పాన్ ఇండియన్ లెవెల్‌లో ఈ మూవీ రిలీజ్ కానుంది. మహానటి తర్వాత దాదాపు ఐదేళ్ల విరామం అనంతరం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తోన్న మూవీ ఇది. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వనీదత్ ఈ మూవీని నిర్మిస్తోన్నాడు.