Kamal Haasan Movies: నాలుగు సినిమాల్ని లైన్‌లో పెట్టిన కమల్ హాసన్ - యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడుగా!
Kamal Haasan Movies: కమల్‌హాసన్ యంగ్ హీరోలకు పోటీపడుతూ వరుసగా సినిమాల్ని సెట్స్‌పైకి తీసుకొస్తున్నాడు. ప్రస్తుతం నాలుగు సినిమాల్ని లైన్‌లో పెట్టాడు. ఆ సినిమాలు ఏవంటే...
Kamal Haasan Movies: విక్రమ్ సినిమాతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు కమల్‌హాసన్. మంచి మాస్ కథ పడితే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయగలిగే సత్తా ఉందో విక్రమ్‌తో మరోసారి చాటిచెప్పాడు కమల్ హాసన్. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో 120 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 500 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది.
తమిళ సినీ ఇండస్ట్రీలో పలు రికార్డులను తిరగరాసింది. ఈ సినిమాతో మళ్లీ తన జోరును పెంచిన కమల్‌హాసన్ యంగ్ హీరోలతో పోటీపడుతూ నాలుగు సినిమాల్ని లైన్‌లో పెట్టాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఇండియన్ 2 సీక్వెల్ పై కమల్‌హాసన్ పూర్తిగా ఫోకస్ పెట్టాడు. 1996లో రిలీజైన ఇండియన్‌కు సీక్వెల్‌గా సోషియో పొలిటికల్ యాక్షన్ మూవీగా ఇండియన్ -2 తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
అలాగే ప్రభాస్ (Prabhas) పాన్ ఇండిన్ మూవీ ప్రాజెక్ట్ కేలో కమల్‌హాసన్ కీలక పాత్ర పోషించనున్నాడు. అతడు ఈ సినిమాలో భాగమైన విషయాన్ని ఇటీవలే చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది. ఈ సైంటిఫిక్ యాక్షన్ మూవీలో కమల్‌హాసన్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమాతో పాటు తునివు దర్శకుడు హెచ్ వినోద్‌తో కమల్ హాసన్ ఓ సినిమా చేయనున్నాడు. ఈ మూవీని మంగళవారం అనౌన్స్‌చేశారు. ఓ పోరాటయోధుడి కథతో పవర్‌ఫుల్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కమల్‌హాసన్ హీరోగా నటిస్తోన్న 233వ సినిమా ఇది. ఈ సినిమాకు స్వయంగా కమల్ కథను అందిస్తూ స్వయంగా నిర్మించబోతున్నాడు.
వీటితో పాటుగా విలక్షణ దర్శకుడు మణిరత్నంతో(Maniratnam) కూడా కమల్‌హాసన్ ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కమల్‌హాసన్. దాదాపు 35 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కమల్‌హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో రాబోతున్న ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. మణిరత్నం శైలిలోనే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందుతోన్నట్లు సమాచారం.
ఈ భారీ బడ్జెట్ మూవీని కమల్‌హాసన్, ఉదయనిధి స్టాలిన్ కలిసి నిర్మిస్తోన్నారు. ప్రస్తుతం ఈ నాలుగు సినిమాల తాలూకు షూటింగ్‌లతో రెండేళ్ల పాటు కమల్‌హాసన్ బిజీగా ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీటితో పాటు బిగ్‌బాస్ రియాలిటీ షోకు హోస్ట్‌గా కమల్‌హాసన్ వ్యవహరించబోతున్నాడు