Prabhas at SDCC Event: శాన్ డీగో కామిక్ కాన్ ఈవెంట్లో ప్రభాస్ స్టైలిష్ లుక్.. ఫొటో వైరల్
Prabhas at SDCC Event: శాన్ డీగో కామిక్ కాన్ ఈవెంట్లో ప్రభాస్ స్టైలిష్ లుక్ ఫొటో వైరల్ అవుతోంది. ప్రాజెక్ట్ కే లాంచ్ కోసం అమెరికా వెళ్లిన ప్రభాస్.. తొలిసారి ఈ ఈవెంట్లో కనిపించాడు.
Prabhas at SDCC Event: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అమెరికాలోని శాన్ డీగోలో హల్‌చల్ చేస్తున్నాడు. అక్కడి కామిక్ కాన్ ఈవెంట్లో పాల్గొనేందుకు వెళ్లిన అతడు.. తొలిసారి ఈ ఈవెంట్లో కనిపించాడు. బ్లాక్ టీషర్ట్, పైన బ్లూ బ్లేజర్ లో ప్రభాస్ అదిరిపోయే లుక్ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. తన ట్విటర్ అకౌంట్లో ప్రభాస్ ఈ ఫొటోలను షేర్ చేసుకున్నాడు.
ఈ శాన్ డీగో కామిక్ కాన్ ఈవెంట్లో ప్రాజెక్ట్ కే గ్లింప్స్ లాంచ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ కోసం రెండు రోజుల ముందే ప్రభాస్, రానా, కమల్ హాసన్ అక్కడికి వెళ్లారు. గురువారం (జులై 20) రాత్రి ఈ ఈవెంట్లో గ్లింప్స్ రానుంది. ఈ ఈవెంట్ కోసం వచ్చిన ప్రభాస్ తన స్టైలిష్ లుక్ తో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఇదే ఈవెంట్లో ప్రాజెక్ట్ కే అసలు టైటిల్ కూడా రివీల్ చేసే అవకాశాలు ఉన్నాయి.
ఈ గ్లింప్స్ కంటే ముందే బుధవారం (జులై 19) ప్రాజెక్ట్ కే నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అయితే ఈ ఫస్ట్ లుక్ అందరినీ తీవ్రంగా నిరాశకు గురి చేసింది. హడావిడిగా సడెన్ సర్‌ప్రైజ్ ఇవ్వడానికి రిలీజ్ చేసినట్లుగా ఉంది తప్ప.. సరైన హోమ్ వర్క్ చేసినట్లు కనిపించలేదని కామెంట్స్ చేస్తున్నారు. అంతకుముందు దీపికా లుక్ పై కూడా ఇలాంటి ట్రోలింగే జరిగింది.
శాన్ డీగో కామిక్ కాన్ ఈవెంట్లో కనిపించనున్న తొలి ఇండియన్ సినిమాగా ప్రాజెక్ట్ కే నిలవనుంది. ఫస్ట్ లుక్స్ నిరాశ కలిగించినా.. మూవీ గ్లింప్స్ అంచనాలను తగినట్లుగా ఉంటుందని ఫ్యాన్స్ ఆశతో ఉన్నారు. ముఖ్యంగా బాహుబలి 2 తర్వాత హ్యాట్రిక్ ఫ్లాపులతో సతమతమవుతున్న ప్రభాస్ కు మంచి హిట్ అత్యవసరం.
ఈ ప్రాజెక్ట్ కే కంటే ముందే సలార్ రూపంలో ప్రభాస్ ఓ పరీక్ష ఎదుర్కోనున్నాడు. ఇక ప్రాజెక్ట్ కే వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీలో ప్రభాస్ తోపాటు దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ నటించారు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశాడు.
సంబంధిత కథనం