తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karthika Deeapam Today November 26: సీఈవోగా తీసేసిన శివన్నారాయణ.. రివర్స్‌లో షాకిచ్చిన కార్తీక్.. జ్యోత్స్న నయా ప్లాన్

Karthika Deeapam Today November 26: సీఈవోగా తీసేసిన శివన్నారాయణ.. రివర్స్‌లో షాకిచ్చిన కార్తీక్.. జ్యోత్స్న నయా ప్లాన్

26 November 2024, 8:32 IST

google News
    • Karthika Deeapam November 26 Today Episode: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. కార్తీక్‍ను సీఈవో పదవి నుంచి తొలగించేస్తాడు శివన్నారాయణ. జ్యోత్స్నను కొత్త సీఈవోగా చేస్తాడు. దీంతో కార్తీక్ కూడా షాకిచ్చినా.. మళ్లీ వెనక్కి తగ్గుతాడు. నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందో పూర్తిగా ఇక్కడ చూడండి.
Karthika Deeapam November 26: సీఈవోగా తీసేసిన శివన్నారాయణ.. రివర్స్‌లో షాకిచ్చిన కార్తీక్.. జ్యోత్స్న నయా ప్లాన్
Karthika Deeapam November 26: సీఈవోగా తీసేసిన శివన్నారాయణ.. రివర్స్‌లో షాకిచ్చిన కార్తీక్.. జ్యోత్స్న నయా ప్లాన్

Karthika Deeapam November 26: సీఈవోగా తీసేసిన శివన్నారాయణ.. రివర్స్‌లో షాకిచ్చిన కార్తీక్.. జ్యోత్స్న నయా ప్లాన్

కార్తీక దీపం 2 నేటి (నవంబర్ 26) ఎపిసోడ్‍లో.. జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ సంస్థ బోర్డ్ మీటింగ్‍ను శివన్నారాయణ నిర్వహిస్తాడు. ఎప్పుడూ మీటింగ్‍లకు రాని జ్యోత్స్న ఈసారి ఎందుకొచ్చిందని మనసులో అనుకుంటాడు కార్తీక్. సాధారణంగా వార్షిక మీటింగ్ నిర్వహిస్తామని, ఈసారి ఒక నెల ముందే పెట్టామని శివన్నారాయణ చెబుతాడు. సంస్థ అంటే విలువలు కూడా చాలా ముఖ్యమంటూ కార్తీక్‍ను టార్గెట్ చేసి పరోక్షంగా మాట్లాడతాడు.

కార్తీక పదవి తొలగింపు.. కొత్త సీఈవోగా జ్యోత్స్న

చైర్మన్‍గా సంస్థ అభివృద్ధికి తాను ఓ నిర్ణయం తీసుకున్నానని శివన్నారాయణ ప్రకటిస్తాడు. “ఇప్పటి వరకు జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్‌కు కార్తీక్ సీఈవోగా ఉన్నారు. ఈసారి సీఈవోగా నా మనవరాలు జ్యోత్స్నను నియమిస్తున్నాను” అని శివన్నారాయణ చెబుతాడు. దీంతో జ్యోత్స్న నవ్వుకుంటుంది. కార్తీక్ నొచ్చుకుంటాడు. జ్యోత్స్నను సీఈవోగా నియమించడంపై బోర్డ్ సభ్యులను అభిప్రాయాలు అడుగుతాడు శివన్నారాయణ. అందరూ దీనికి ఓకే చెబుతారు.

రాజీనామాతో షాకిచ్చిన కార్తీక్.. కానీ

తన అభిప్రాయాన్ని ఒక్క మాటలో చెప్పడం కష్టమని, ఈ లెటర్‌లో రాశానంటూ ఓ లేఖను ఇస్తాడు కార్తీక్. ఏంటిది అని శివన్నారాయణ అడిగితే.. రాజీనామా లెటర్ అని కార్తీక్ అంటాడు. దీంతో శివన్నారాయణ, జ్యోత్స్న షాక్ అవుతారు. ఏంటిది అని జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. సంస్థ నుంచి వెళ్లిపోవాలని అనుకుంటున్నారా అని జ్యోత్స్న అడిగితే.. రాజీనామా లెటర్ అంటే అంతే కదా కొత్త సీఈవో గారు అని వెటకారంగా అంటాడు కార్తీక్. తాను రాజీనామాను అంగీకరించనని జ్యోత్స్న అంటుంది. ప్రైవేట్‍గా మాట్లాడి, అప్పటికీ ఇదే నిర్ణయం మీద ఉంటే రాజీనామాను అంగీకరిస్తానని చెబుతుంది. దీనికి ఓకే చెప్పిన శివన్నారాయణ.. సంస్థ ఎవరి కోసం ఆగదని, అందరూ గుర్తుంచుకోవాలని చెబుతాడు. దీంతో పొమ్మని ఇంత సూటిగా చెబుతున్నప్పుడు నేనెందుకు ఉండాలని కార్తీక్ మనసులో అనుకుంటాడు.

దీపకు మళ్లీ అనుమానం

ఇళ్లు ఊడుస్తుండగా.. శౌర్యకు చెందిన మందుల చీటి దీపకు దొరుకుతుంది. దీంతో శౌర్యకు ఉన్న ఆరోగ్య సమస్య ఏంటో, ఈ మందులు ఎందుకు వాడతారో తెలుసుకోవాలనుకుంటుంది. కార్తీక్ ఏమైనా నిజం దాస్తున్నారా అని మనసులో అనుకుంటుంది. ఆ చీటిని కాంచన దగ్గరికి తీసుకెళ్లి.. ఈ మందులు ఎందుకు వాడతారని అనుమానంగా అడుగుతుంది. కార్తీక్ చెప్పినా దీప అనుమానం పోలేదని, శౌర్య గురించి నిజం చెబితే గుండె పట్టుకొని పడతావని మనసులో కాంచన అనుకుంటుంది. జ్వరం తగ్గాక కూడా శరీరంపై ఉంటుందని, మళ్లీ రాకుండా కొన్నాళ్లు మందులు వాాడాల్సి ఉంటుందని కాంచన కవర్ చేస్తుంది. శౌర్యకు ఏమైందో అని భయం అవసరం లేదని అంటుంది. శౌర్య గురించి కార్తీక్ బాబు నిజం దాచారేమోనని అనవసరం భయపడ్డానని దీప తనలో తానే అనుకుంటుంది. నిజం దాచినందుకు సారీ అని కాంచన కూడా మనసులోనే బాధపడుతుంది.

కార్తీక్‍ను ఒప్పించిన జ్యోత్స్న

రాజీనామాను వెనక్కి తీసుకోవాలని కార్తీక్‍ను అడుగుతుంది జ్యోత్స్న. పబ్లిక్‍గా అడిగినా.. ప్రైవేట్‍గా అడిగినా తన నిర్ణయం మారదని కార్తీక్ అంటాడు. బావామరదదల్లా మాట్లాడుకుందామా అని జ్యోత్స్న అంటుంది. ఎందుకు రాజీనామా చేస్తున్నావో తెలియాలని అడుగుతుంది. తాను సీఈవో అవడం నచ్చలేదా, ఆడదాని కింద పని చేయడానికి ఈగో అడ్డొచ్చిందా అని ప్రశ్నిస్తుంది. ఈ సంస్థను కాపాడే బాధ్యత తనకు కూడా ఉందని జ్యోత్స్న అంటుంది. తనను తాను నిరూపించుకునేందుకు అవకాశం వచ్చిందని, సపోర్ట్‌గా ఉండమంటుంది. అయినా కార్తీక్ ఒప్పుకోడు.

అయితే, తాత గురించి ఉండిపో అని, వదిలేసి వెళితే బాధపడారని, అత్తకు పుట్టింటిని దూరం చేసినట్టు అవుతుందని కార్తీక్‍తో జ్యోత్స్న అంటుంది. దీంతో మీ తాతకు నచ్చిందని చేయాలని దీప చెప్పిన మాటను కార్తీక్ గుర్తు చేసుకుంటాడు. ఈ రాజీనామాను తాను అంగీకరించనని, ఆ లెటర్‌ చించేస్తుంది జ్యోత్స్న. ఎప్పటిలాగే ఈ సంస్థలో కంటిన్యూ కావాలని అంటుంది. దీపకు ఇచ్చిన మాట కోసం కొనసాగుతాను అని అనుకొని.. ఓకే చెబుతాడు కార్తీక్.

జ్యోత్స్న కొత్త ప్లాన్

అడిగి మరీ కాంగ్రాట్స్ చెప్పించుకొని.. కార్తీక్‍తో షేక్ హ్యాండ్ తీసుకుంటుందని జ్యోత్స్న. ఈ చేతులు ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలని అనుకుంటుంది. “ప్రతీ రోజు నువ్వు హాయ్ చెప్పాలి. నాతో తిరగాలి. ఉండాలి. నిన్ను దీప దగ్గరికి పోనివ్వను. దొరికావ్ బావ. ఈసారి వదిలిపెట్టను. దీప నీ మెడలో తాళి తీసేయడానికి రెడీగా ఉండు” అంటూ మనసులో అనుకొని కొత్త ప్లాన్స్ వేసేందుకు జ్యోత్స్న సిద్ధమవుతుంది.

పారిజాతం సంతోషం

ఏ కూర చేయమంటూరు అని దాసును అడుగుతుంది స్వప్న (దిల్లూ). మీ అబ్బాయిని అడిగితే మిమ్మల్ని అడగమంటారు అని చెబుతుంది. వంట గురించి వాళ్లు మాట్లాడుకుంటూ ఉంటారు. పారిజాతంను తలుచుకోవడంతో కాశీ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఆమెను ఇంట్లోకి కూడా రానివ్వొద్దని అంటాడు. మనల్ని ఎవర్రా ఆపేది అంటూ అప్పుడే ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది పారిజాతం.

కార్తీక్‍ను సీఈవోగా తీసేశారంటూ స్వీట్లు పంచుతుంది. ఆనందం వ్యక్తం చేస్తుంది. కార్తీక్‍ను సీఈవో పోస్ట్ నుంచి పీకేశారని దిల్లూకు చెబుతుంది పారిజాతం. బావను తీసేయడమేంటని కాశీ అంటాడు. జ్యోత్స్నను ఆ సీఈవో పదవిలో కూర్చొబెట్టారని ఆనందంగా అంటుంది పారిజాతం. అందరూ షాక్ అవుతారని తనకు తెలుసునని అంటుంది. పగతో ఇలా చేశారు కదా అని స్వప్న కోప్పడుతుంది. ఇది తప్పు అని కాశీ అంటాడు.

నోరు జారిన పారిజాతం

“నీ కూతురు సీఈవో అయిందని సంతోషపడక.. దీప మొగుడికి పదవి పోయిందని బాధపడతావేంట్రా” అని దాసుతో పారిజాతం అంటుంది. దాసుకు జ్యోత్స్న కూతురు అనే విషయంపై నోరు జారుతుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. ఈ విషయంపై కాశీ ప్రశ్నిస్తాడు. దీన్ని కవర్ చేస్తుంది పారిజాతం. జ్యోత్స్న కూతురు ఏంటీ అంటూ కాశీ గట్టిగా అంటాడు. అయితే, జ్యోత్స్న తన కూతురే అని మనసులో అనుకుంటాడు దాసు. ఎక్కడ తొక్కాలో తనకు తెలుసని అంటుంది పారిజాతం. తన అన్న కార్తీక్ తల వంచాడంటే అది గౌరవం అని, చేతకాని తనంకాదని దిల్లు అంటుంది. మళ్లీ వెటకారంగా మాట్లాడుతుంది పారిజాతం. గాల్లో తేలినట్టుందే అంటూ పాట పాడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అమ్మా అంటూ దాసు పిలిచినా అలాగే సంతోషంగా వెళ్లిపోతుంది. తమకు ఈ విషయంలో బాధగా ఉందని దాసుతో కాశీ, దిల్లూ అంటారు.

నీ వల్లే ఒక్క మాట అనలేదు

ఆ తర్వాత ఇంటికి వస్తాడు కార్తీక్. కారు దిగగానే మీటింగ్‍లో ఏమైందని, తాతయ్య ఏమైనా అన్నారా అని దీప అడుగుతుంది. తనను ఘోరంగా అవమానించారని, మాటలతో కాదు చేతలతో చేశారని కార్తీక్ అంటాడు. తాను ఇప్పటి వరకు సీఈవోగా ఉండే వాడినని, ఇప్పుడు ముఖ్యమైన పోస్ట్ నుంచి తనను తీసేశారని చెబుతాడు. దీంతో దీప, కాంచన షాక్‍కు గురవుతుంది. సీఈవో ఎవరు అని కాంచన అడిగితే.. జ్యోత్స్న అని కార్తీక్ సమాధానం ఇస్తాడు. నాన్న ఇలా అవమానిస్తాడని తాను అనుకోలేదని కాంచన అంటుంది. సంస్థలో పని చేయలేనని రాజీనామా ఇచ్చానని కార్తీక్ అంటాడు. జ్యోత్స్న లెటర్ చించేసి కొనసాగాలని చెప్పిందని చెబుతాడు. శత్రువుగా చూస్తుంది వారని, తాను కాదని కార్తీక్ అంటాడు. తాను వద్దాన్నా అప్పుడు సీఈవోను చేశారని, ఇప్పుడు తీసేశారని బాధపడతాడు. అంతా వాళ్ల ఇష్టం ప్రకారం జరుగుతుందని అంటారు.

తాను ఏదో మాట అనే వాడనని, దీప చెప్పడం వల్ల ఏమీ అనలేదని అంటాడు. తాత మనసుకు నచ్చిన విధంగా నడుచుకోవాలని ఈ దీప చెప్పింది కదా.. అందుకే అన్నీ ఆలోచించి మౌనంగా వచ్చేశానని అంటాడు. కలిసి పని చేస్తామా.. విడిపోతా అని భవిష్యత్తే నిర్ణయించాలని కార్తీక్ అంటాడు. “ఇప్పుడు జ్యోత్స్నకు అధికారం ఇస్తే ఈయనను ప్రశాంతంగా ఉండనిస్తుందా. ఇదంతా కార్తీక్ బాబు నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే” అంటూ దీప మనసులోనే బాధపడుతుంది. దీంతో కార్తీక దీపం 2 నేటి (నవంబర్ 26) ఎపిసోడ్ ముగిసింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం