తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kareena Kapoor Khan: షర్ట్ వేసుకో.. చూడలేకపోతున్నా: సిక్స్ ప్యాక్ హీరోలకు బాలీవుడ్ నటి పంచ్

Kareena Kapoor Khan: షర్ట్ వేసుకో.. చూడలేకపోతున్నా: సిక్స్ ప్యాక్ హీరోలకు బాలీవుడ్ నటి పంచ్

Hari Prasad S HT Telugu

19 December 2023, 11:00 IST

google News
    • Kareena Kapoor Khan: సిక్స్ ప్యాక్ బాడీ ఉంటే స్టార్ అయిపోరు అంటూ బాలీవుడ్ నటి కరీనా కపూర్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఒక్కోసారి అలాంటి హీరోలకు షర్ట్ వేసుకో.. చూడలేకపోతున్నా అని చెప్పాలనిపిస్తుందని కూడా ఆమె అనడం విశేషం.
బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్
బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ (AFP)

బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్

Kareena Kapoor Khan: బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ సిక్స్ ప్యాక్ హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేసింది. సిక్స్ ప్యాక్ యాబ్స్ ఉన్నంత మాత్రాన పెద్ద స్టార్ అయిపోరని, టాలెంట్ ఉండాలని అనడం విశేషం. ఒక్కోసారి షర్ట్ వేసుకో.. చూడలేకపోతున్నా అని వాళ్లతో చెప్పాలనిపిస్తుందని ఆమె అనడం గమనార్హం. ఎవరిని ఉద్దేశించి ఆమె ఇలాంటి కామెంట్స్ చేసిందన్న చర్చ ఇప్పుడు మొదలైంది.

ఈ మధ్యే నెట్‌ఫ్లిక్స్ లో జానే జాన్ అనే మూవీ చేసిన కరీనా కపూర్ ఫిల్మ్ కాంపానియన్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చాలా ఘాటు కామెంట్స్ చేసింది. టాలెంట్ ఉండి, ప్రేక్షకులతో కనెక్ట్ అయితే స్టార్‌డమ్ దానికదే వస్తుందని ఆమె స్పష్టం చేసింది.

"మీరు గొప్ప టాలెంట్ ఉన్న వ్యక్తులైతే, ప్రేక్షకులు మిమ్మల్ని ఆదరిస్తే, స్టార్ డమ్ దానికదే వస్తుంది. అతనికి సిక్స్ ప్యాక్ యాబ్స్ ఉన్నాయి.. అతడు చాలా హాట్.. అతడో పెద్ద స్టార్ అని ఏమీ ఉండదు. ఒక్కోసారి అలాంటి నటుల దగ్గరికి వెళ్లి షర్ట్ వేసుకో.. చూడలేకపోతున్నా అని చెప్పాలనిపిస్తుంది" అని కరీనా అనడం విశేషం.

ఒకప్పుడు తన తాత రాజ్ కపూర్, అంకుల్ రిషీ కపూర్, నాన్న రణ్‌ధీర్ కపూర్ సినిమాలు చేసే సమయానికి ఇప్పటికీ చాలా మారిపోయిందని కరీనా చెప్పింది. మంచి నటులైతే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉంటారని ఆమె తెలిపింది. తాజాగా కరీనా నటించిన జానే జాన్ సినిమాలో ఆమె పోషించిన మాయా పాత్రకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

కరీనా కపూర్ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నిజానికి సైఫ్ కూడా చాలా సినిమాల్లో షర్ట్ లేకుండా కనిపించాడు. బాలీవుడ్ లో హీరోలు సిక్స్ ప్యాక్ బాడీ పెంచి షర్ట్ లేకుండా నటించడం అన్నది చాలా సాధారణంగా మారిపోయింది. ఒకప్పుడు సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ నుంచి ఇప్పటి టైగర్ ష్రాఫ్ దాకా ఆ ట్రెండ్ నడుస్తూనే ఉంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం