తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Karan Johar : సూపర్ హిట్ సినిమాతో భారీగా నష్టపోయిన కరణ్ జోహార్

Karan Johar : సూపర్ హిట్ సినిమాతో భారీగా నష్టపోయిన కరణ్ జోహార్

Anand Sai HT Telugu

02 May 2023, 16:18 IST

    • Karan Johar : కరణ్ జోహార్ నిర్మించి, దర్శకత్వం వహించిన సూపర్ హిట్ సినిమాతో నష్టం వచ్చిందట. ఈ విషయాన్ని స్వయంగా కరణ్ చెప్పుకొచ్చాడు. తనకు వచ్చిన నష్టాన్ని గురించి మాట్లాడాడు. ఆ సినిమా ఏంటి?
కరణ్ జోహార్
కరణ్ జోహార్

కరణ్ జోహార్

సినిమా హిట్ అయితే కచ్చితంగా భారీ వసూళ్లు రాబట్టడం ఖాయం. సూపర్ హిట్(Super Hit) సినిమాకి నష్టం వచ్చిందంటే ఎవరూ నమ్మరు. అయితే కొన్ని కొన్నిసార్లు సినిమా ఇండస్ట్రీలో ఇది జరుగుతుంది. సూపర్ హిట్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవుతుంటాయి., ఫ్లాప్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద లాభాలు తీసుకొస్తాయి. ఈ విషయమై మాట్లాడిన బాలీవుడ్ ప్రముఖ నిర్మాత , దర్శకుడు కరణ్ జోహార్(Karan Johar).. తాను దర్శకత్వం వహించి నిర్మించిన సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ భారీ మొత్తంలో నష్టాన్ని చూశాడు. ఆ సినిమా ద్వారా తను పోగొట్టుకున్న డబ్బును ఎలా తిరిగి తెచ్చుకున్నాడో కూడా చెప్పాడు.

ట్రెండింగ్ వార్తలు

Prabhas: ప్ర‌భాస్ చేతుల మీదుగా మొద‌లై రిలీజ్ కానీ దీపికా ప‌డుకోణ్ ఫ‌స్ట్ స్ట్రెయిట్ తెలుగు మూవీ ఏదో తెలుసా!

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలోకి 10 సినిమాలు.. కచ్చితంగా చూడాల్సినవి 3 మాత్రమే.. ఎక్కడ చూస్తారంటే?

Abhay Movie: థియేట‌ర్ల‌లో రిలీజైన 23 ఏళ్ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చిన క‌మ‌ల్‌హాస‌న్ సైకో థ్రిల్ల‌ర్ మూవీ!

Brahmamudi May 18th Episode: బ్రహ్మముడి- కిడ్నాపర్ల నుంచి బయటపడిన కావ్య.. భార్యను కొట్టబోయిన రాజ్.. మరదలిపై ఫైర్

2012లో కరణ్ జోహార్ 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్'(Student Of The Year) అనే యూత్ ఫుల్ మూవీని తీశాడు. ఈరోజు బాలీవుడ్ స్టార్‌లుగా ఉన్న అలియా భట్(Alia Bhatt), సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్‌లకు ఇదే తొలి సినిమా. ఈ చిత్రాన్ని కరణ్‌కి చెందిన ధర్మ ప్రొడక్షన్స్(dharma productions) మరియు షారూఖ్ ఖాన్ రెడ్ చిల్లీస్ నిర్మించాయి. సినిమా విడుదలయ్యాక భారీ హిట్‌ అయింది. సినిమా విడుదలైన కొద్ది రోజుల్లోనే ముగ్గురు స్టార్స్ అయిపోయారు. బాలీవుడ్(Bollywood) అంతా ఈ సినిమా గురించే మాట్లాడుకున్నారు. థియేటర్లు కాలేజ్ అబ్బాయిలు, అమ్మాయిలతో నిండిపోయాయి. కానీ సినిమా నష్టపోయేలా చేసిందని కరణ్ చెప్పాడు.

సినిమా బిజినెస్‌కి సంబంధించిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కరణ్ జోహార్(karan Johar) నష్టం గురించి చెప్పుకొచ్చాడు. 'ఆ సినిమా సూపర్ హిట్ అయింది. కోట్లు పోగొట్టుకున్నాను. ఎందుకంటే ఆ సినిమా కోసం నేను భారీ మొత్తంలో ఖర్చు చేశాను. అలియా, సిద్ధార్థ్, వరుణ్ స్టార్స్ అవుతారని నమ్మి భారీ మొత్తంలో ఖర్చు చేసి సినిమా చేశాను. సినిమా హిట్టయినా.., మొత్తం పెట్టుబడి కంటే 15-20 కోట్లు తక్కువ డబ్బు తిరిగి వచ్చింది.' అని కరణ్ చెప్పాడు.

అయితే కరణ్ గతంలో ఆలియా, సిద్ధార్థ్, వరుణ్‌లతో తలా మూడు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకున్నందున తదుపరి సినిమాలలో ఆ నష్టాన్ని భర్తీ చేశాడు. అందుకే సిద్ధార్థ్ మల్హోత్రాతో హసితో పాసి, వరుణ్ ధావన్-అలియా భట్‌లతో బద్రీనాథ్ కి దుల్హనియా, ఆలియాతో టూ స్టేట్స్ సినిమాలు చేశాడు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో వచ్చిన నష్టాన్ని పూడ్చుకున్నాడు.

అన్ని సినిమాలూ ఇలా కవర్ చేశాయా అంటే అదీ లేదు. కరణ్ జోహార్ కొన్ని చిత్రాలు ఘోర పరాజయం పాలైనట్లు తెలుస్తోంది. సైఫ్ అలీఖాన్, కరీనా నటించిన ఖుర్బాన్, కళంక్, ఇలా పెద్ద స్టార్లతో సినిమాలు కూడా కరణ్‌కు చాలా బాధ కలిగించాయి. డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ తదితరాల ద్వారా పెట్టుబడి పెట్టిన డబ్బును వెనక్కి తీసుకోవాలని కరణ్ చెప్పుకొచ్చాడు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం