తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Indian 2: భారతీయుడు మొదలుపెట్టారు.. కమల్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్

Indian 2: భారతీయుడు మొదలుపెట్టారు.. కమల్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్

24 August 2022, 7:40 IST

    • కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రానున్న ఇండియన్ 2 షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. మంగళవారం నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు దర్శకుడు శంకర్ ట్విటర్ వేదికగా తెలియజేశారు.
ఇండియన్ 2 షూటింగ్ పునఃప్రారంభం
ఇండియన్ 2 షూటింగ్ పునఃప్రారంభం (Twitter)

ఇండియన్ 2 షూటింగ్ పునఃప్రారంభం

లోకనాయకుడు కమల్ హాసన్, దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన భారతీయుడు చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా ఇండియన్ 2ను ప్రారంభించింది చిత్రబృందం. అయితే ఈ సినిమా షూటింగ్ కొంత భాగం పూర్తయింది. అయితే ఈ చిత్రం మొదలైనప్పటి నుంచి అడ్డంకులు, దర్శక నిర్మాతల మధ్య విభేదాలు కారమంగా మద్యలోనే ఆగిపోయింది. ఇటీవలే ఈ సినిమా తిరిగి ప్రారంభిస్తామని కమల్ హాసన్ ప్రకటించారు. అనుకున్నట్లే.. ఇండియన్ 2 షూటింగ్‌పై దర్శకుడు తాజాగా అప్డేట్ ఇచ్చారు. బుధవారం నుంచి చిత్ర షూటింగ్ మొదలు కానుందని స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Kannappa Prabhas: కన్నప్ప షూటింగ్‌లో ప్రభాస్.. ఆ మూడు రోజుల్లోనే పూర్తి చేయాలంటూ..

Koratala Siva on Devara: నాకు, అభిమానులకు స్పెషల్ సినిమా: దేవరపై దర్శకుడు కొరటాల శివ.. అప్‍డేట్లపై కామెంట్

Manjummel Boys OTT Response: ఓటీటీలో మంజుమ్మల్ బాయ్స్ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తోందంటే!

The Family Man Season 3: ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3పై గుడ్ న్యూస్ చెప్పిన ప్రైమ్ వీడియో

"గుడ్ మార్నింగ్ ఇండియన్స్, ఇండియన్ 2కు సంబంధించిన మిగిలిన షూటింగ్ ఈ రోజు ప్రారంభం కాబోతుంది. ఈ ప్రకటన చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది. మీ సపోర్ట్, అభినందనలు మాకు కావాలి" అని దర్శకుడ శంకర్ ట్విటర్ వేదికగా ప్రకటించారు.

కమల్ హాసన్ తన విక్రమ్ మూవీ ప్రచార కార్యక్రమాల్లోనే ఈ విషయాన్ని గురించి తెలియజేశారు. భారతీయుడు 2ను త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. తాజాగా శంకర్ షూటింగ్ అప్డేట్‌తో అభిమానులను ఖుషీ చేశారు. కమల్, శంకర్ కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రారంభం నుంచి అనుకోని అవాంతరాలు ఎదురయ్యాయి. మూడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సినిమాలో కాజల్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. కొన్ని నెలల పాటు షూటింగ్ కూడా జరిగింది. అయితే ఈ సినిమా సెట్స్‌లో ప్రమాదం జరగడం, డైరెక్టర్ శంకర్-నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌తో విభేదాలు తదితర కారణాల వల్ల ఈ సినిమా తాత్కాలికంగా వాయిదా పడింది.

ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా చేస్తున్నారు. హీరో సిద్ధార్థ్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. బాబీ సింహ, ప్రియా భవానీ శంకర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ కాగా.. పీటర్ హెయిన్స్ స్టంట్లు రూపొందిస్తున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.