తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kl Rahul-athiya Shetty: బాయ్ ఫ్రెండ్‌తో కొత్త ఇంటికి మకాం మార్చిన హీరో కుమార్తే

KL Rahul-Athiya Shetty: బాయ్ ఫ్రెండ్‌తో కొత్త ఇంటికి మకాం మార్చిన హీరో కుమార్తే

24 August 2022, 6:29 IST

    • బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తే అతియా శెట్టి తన బాయ్ ఫ్రెండ్ కేఎల్ రాహుల్‌తో కలిసి కొత్త ఇంటికి మకాం మార్చింది. ఇకపై వీరిద్దరూ ఇక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది.
కేఎల్ రాహుల్-అతియా శెట్టి
కేఎల్ రాహుల్-అతియా శెట్టి (Instagram)

కేఎల్ రాహుల్-అతియా శెట్టి

బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముద్దుల తనయ అతియా శెట్టి.. టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్‌తో పీకల్లోతూ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ తమ బంధం గురించి బహిరంగంగానే చెప్పకనే చెప్పారు. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇరువురి కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం ఇద్దరూ లివింగ్‌లోనే ఉన్నారు. తాజాగా అతియా శెట్టి.. తన బాయ్ ఫ్రెండ్ కేఎల్ రాహుల్‌తో కలిసి నూతన ఇంటికి మకాం మార్చిందని సమాచారం.

ట్రెండింగ్ వార్తలు

Anand Devarakonda: బొంబాయి చట్నీ చేసిన కుర్రాడిగానే తెలుసు, కానీ.. ఆనంద్ దేవరకొండ కామెంట్స్

Brahmamudi: ఆఫీస్ సీసీ కెమెరాలో రాజ్ సీక్రెట్.. చూసేసిన కావ్య, అప్పు- వసుధార కొత్త స్కెచ్- మీరా షాక్‌లో మురారి, కృష్ణ

Heeramandi OTT: ఓటీటీలో దూసుకుపోతున్న పీరియాడికి డ్రామా.. నెటిజన్ల ప్రశంసలు.. సిరీస్ ఎక్కడ చూస్తారంటే?

Adivi Sesh: అదే కొనసాగిస్తే గర్వపడే స్థాయికి వెళ్తుంది.. హీరోయిన్‌పై అడవి శేష్ కామెంట్స్ వైరల్

ముంబయి కార్టర్ రోడ్డులోని సీ పేసింగ్ ఇంటికి రాహుల్, అతియా మారినట్లు తెలుస్తోంది. ఈ నూతన ఇంటి గృహప్రవేశం కూడా ఇటీవలే పూర్తియినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలను ఇరువురి తల్లిదండ్రులు నిర్వహించారట. ఇకపై వీరిద్దరూ ఇక్కడే నివాసముండబోతున్నట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత కూడా ఇక్కడే ఏకాంతంగా, ఆనందంగా గడిపేలా ఈ జోడీ ప్లాన్ చేసుకుందట.

ఈ ఏడాదే వీరిద్దరూ ప్లాన్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే అతియా మాత్రం తన వివాహ బాధ్యతలను పూర్తిగా తన తండ్రి సునీల్‌కే అప్పజెప్పినట్లు సమాచారం. ఈ విషయంపై ఆయన స్పందించారు. "ఈ విషయంలో వారు ఏం చేయాలనుకుంటున్నారో వారిష్టం. కాలం మారినందున వారే నిర్ణయం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నా ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉంటాయి" అని సునీల్ శెట్టి స్పష్టం చేశారు.

గత మూడేళ్లుగా కేఎల్ రాహుల్-అతియా శెట్టి ప్రేమలో ఉన్నప్పటికీ.. తమ బంధం గురించి ఇప్పటి వరకు బహిర్గత పరచలేదు. తమ రిలేషన్ గురించి గోప్యంగానే ఉంచుతూ బంధాన్ని కొనసాగిస్తున్నారు. అయితే వీరిద్దరూ తమ రిలేషన్ గురించి బయట పెట్టకుండా.. తాము సన్నిహితంగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉన్నారు. ఈ విధంగా తమ బంధం గురించి బయటకు చెప్పకనే చెప్పారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.