తెలుగు న్యూస్  /  Entertainment  /  Kamal Haasan And Prithviraj Sukumaran On Kantara Says This Movie Blew Their Minds

Kamal Haasan and Prithviraj on Kantara: ఈ ఏడాది అత్యుత్తమ సినిమా కాంతారా: కమల్‌ హాసన్‌

HT Telugu Desk HT Telugu

13 December 2022, 21:58 IST

    • Kamal Haasan and Prithviraj on Kantara: ఈ ఏడాది అత్యుత్తమ సినిమా కాంతారా అని అన్నారు తమిళ, మలయాళ సూపర్‌ స్టార్లు కమల్‌ హాసన్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌. ఈ సినిమా సెలబ్రిటీ అభిమానుల జాబితాలో మరో ఇద్దరు చేరారు.
కాంతారా మూవీలోని ఓ సీన్
కాంతారా మూవీలోని ఓ సీన్

కాంతారా మూవీలోని ఓ సీన్

Kamal Haasan and Prithviraj on Kantara: కాంతారా మూవీ థియేటర్లలో సంచలనం సృష్టించి ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం ఆగడం లేదు. ముఖ్యంగా ఎంతో మంది సెలబ్రిటీలు ఈ మూవీ అభిమానుల జాబితాలో చేరుతున్నారు. ఇన్నాళ్లూ ఎవరూ పెద్దగా పట్టించుకోని కన్నడ ఫిల్మ్‌ ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది వచ్చిన కేజీఎఫ్‌ 2, కాంతారా సినిమాలు పెను సంచలనం సృష్టించాయి.

ట్రెండింగ్ వార్తలు

Andre Russel Hindi Song: బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మరో వెస్టిండీస్ క్రికెటర్.. హిందీ పాట పాడిన రసెల్

Hollywood Thrillers on OTT: ఓటీటీల్లోని ఈ హాలీవుడ్ థ్రిల్లర్స్ చూశారా? అసలు థ్రిల్ అంటే ఏంటో తెలుస్తుంది

Panchayat 3 OTT Release Date: సస్పెన్స్‌కు తెరపడింది.. పంచాయత్ 3 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే

Pushpa 2 first single: యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న పుష్ప 2 ఫస్ట్ సింగిల్.. వరల్డ్ వైడ్ నంబర్ వన్

ఈ రెండు సినిమాలతో అసలు ఇన్నాళ్లూ కన్నడ సినిమా ఇండస్ట్రీపై అందరిలో ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించగా.. తాజాగా తమిళ సూపర్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌, మలయాళ స్టార్‌ యాక్టర్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కూడా కాంతారా ఫ్యాన్స్‌గా మారిపోయారు. ఈ ఏటి మేటి సినిమా అంటూ పొగడుతున్నారు.

ఫిల్మ్‌ కంపానియన్‌తో మాట్లాడిన సందర్భంగా కమల్‌ హాసన్‌.. ఈ కాంతారాపై స్పందించాడు. 2022లో వచ్చిన సినిమాలు ఇండియన్‌ సినిమాను ఎలా మార్చేశాయన్న అంశంపై కమల్ మాట్లాడాడు. ఈ ఏడాది అత్యుత్తమ సినిమా కాంతారా తన సినిమా మెదడుపై ఎంతో ప్రభావం చూపిందని కమల్‌ అన్నాడు.

"కాంతారా ఓ మంచి ఉదాహరణ. నేను కూడా కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వాడిని కావడం వల్ల మరింత సంతోషంగా ఉంది. ఇప్పుడు కన్నడ ఫిల్మ్‌ ఇండస్ట్రీ గురించి ఎంతో మంది మాట్లాడుకుంటున్నారు. ఇప్పటి వరకూ ఈ ఇండస్ట్రీ నుంచి వంశ వృక్ష, ఒందనొండు కలదల్లి, కాడులాంటి సినిమాలు వచ్చాయి. మళ్లీ ఆ రోజులు తిరిగి వస్తున్నాయనిపిస్తోంది" అని కమల్‌ అన్నాడు.

ఇందులోనే పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కూడా మాట్లాడాడు. "2022లో వివిధ ఇండస్ట్రీల నుంచి గొప్ప సినిమాలు వచ్చాయి. కానీ ఒక్క సినిమా మాత్రం నాపై చాలా ప్రభావం చూపింది. ఈ సినిమా మలయాళంలో వచ్చి ఉంటే బాగుండేది లేదంటే కనీసం నేను అందులో భాగమై ఉండాల్సింది అనిపించేలా చేసింది కాంతారా" అని పృథ్వీరాజ్‌ అన్నాడు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.