Kalyan Ram: ‘బింబిసారుడి’లా కల్యాణ్ రామ్ ఎలా మారాడో చూడండి.. ఫ్యాట్ టు ఫిట్
28 July 2022, 14:54 IST
- కల్యాణ్ రామ్ హీరోగా రానున్న చిత్రం బింబిసార. ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం కోసం కల్యాణ్ రామ్ తన బాడీని పూర్తిగా మార్చుకున్నారు. బరువు తగ్గడమే కాకుండా.. ఫిట్‌గానూ మారారు.
కల్యాణ్ రామ్
నందమూరి కల్యాణ్ రామ్ నటిస్తోన్న తాజా చిత్రం బింబిసార. త్రిగర్తల సామ్రాజ్యాధిపతి బింబిసారుడి పాత్రలో ఈ నందమూరి హీరో కనిపించనున్నాడు. అంతేకాకుండా రెండు విభిన్న పాత్రల్లో ఆయన దర్శనమివ్వనున్నాడు. సోషియో ఫాంటసీ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. మల్లాడి వశిష్ట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా కోసం కల్యాణ్ రామ్ తాను ఎంత కష్టపడ్డారో వివరించారు. బింబిసారుడి వలే కనిపించేందుకు బరువు తగ్గడమే కాకుండా ఫిట్‌గా మారానని ఆయన తెలిపారు.
నేను ఎప్పటి నుంచో ఇలాంటి సినిమాలు చేయాలనుకున్నా. నా మనస్సులో ఉన్న ఐడియాన్ని కరెక్టుగా డైరెక్టర్ వశిశష్ట్ వచ్చి చెప్పారు. ఎంత మంచివాడవురా చేసే సమయంలో ఈ సినిమా కథ చెప్పారు. అప్పుడు నేను 88 కేజీల వరకు బరువు ఉండే వాడిని. బింబిసారుడి పాత్ర కోసం వర్కౌట్ చేయడం ప్రారంభించి 75 కేజీల వరకు తగ్గాను. అంతేకాకుండా ఫిట్‌గా మారాను అని కల్యాణ్ రామ్ తెలిపారు. క్రూరమైన రాజుగా మారేందుకు తనను తాను ఎంతో మార్చుకున్నానని కూడా ఆయన తెలిపారు.
బింబిసార కోసం ఆయన పడిన కష్టాన్ని మేకింగ్‌ను వీడియో రూపంలో ముందుకు తీసుకొచ్చారు. ఇంతేకాకుండా సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం ఆయన బాడీ ఛేంజ్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ సరసన కేథరిన్ తెరిస్సా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటలు, టీజర్, ట్రైలర్ విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇటీవలే ఈ చిత్ర రెండో ట్రైలర్ కూడా విడుదలై సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తీసుకురానున్నారు.
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కల్యాణ్ రామే ఈ చిత్రాన్ని నిర్మించారు. మల్లాడి వశిష్ట్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు చిరంతన్ భట్ స్వరాలు అందించగా.. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సమకూర్చారు. తమ్మిరాజు ఎడిటర్‌గా పనిచేశారు. చోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు.
టాపిక్