Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ హోరు.. నార్త్ అమెరికాలో మరో బిగ్ మైల్‍స్టోన్ క్రాస్.. హైదరాబాద్‍లో బుకింగ్స్ సునామీ
23 June 2024, 20:09 IST
- Kalki 2898 AD Movie: కల్కి 2989 ఏడీ సినిమాకు నార్త్ అమెరికాలో కళ్లు చెదిరే బుకింగ్స్ జరుగుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్‍ల్లో ఇప్పటికే రికార్డులను బద్దలుకొట్టిన ఈ చిత్రం తాజాగా మరో మైల్‍స్టోన్ దాటేసింది.
Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ హోరు.. నార్త్ అమెరికాలో మరో బిగ్ మైల్‍స్టోన్ క్రాస్.. హైదరాబాద్‍లో బుకింగ్స్ సునామీ
Kalki 2898 AD Movie: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ సినిమా క్రేజ్ గ్లోబల్ రేంజ్‍లో విపరీతంగా ఉంది. ఈ చిత్రం జూన్ 27వ తేదీన విడుదల కానుంది. అయితే, నార్త్ అమెరికాలో ఒక రోజు ముందుగానే జూన్ 26వ తేదీన ప్రీమియర్లు ఉండనున్నాయి. అక్కడ కల్కి 2898 ఏడీ మూవీకి రికార్డుస్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రీ-సేల్స్ విషయంలో ఈ చిత్రం కొత్త రికార్డులను సృష్టించింది. ఈ విషయంలో ఆర్ఆర్ఆర్ రికార్డును కూడా బద్దలుకొట్టేసింది. తాజాగా నార్త్ ఇండియా ప్రీ-సేల్స్‌లో మరో భారీ మైల్‍స్టోన్ దాటింది కల్కి.
అప్పుడే 3 మిలియన్ దాటి..
నార్త్ అమెరికా (అమెరికా, కెనడా)లో కల్కి 2898 ఏడీ సినిమా ప్రీ-సేల్స్ అప్పుడే ఏకంగా 3 మిలియన్ డాలర్ మార్క్ దాటేసింది. ప్రీమియర్లకు ఇంకా నాలుగు రోజులు ఉండగానే ఈ భారీ మైలురాయి అధిగమించింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది. నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు 1.13లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్టు, 3 మిలియన్ డాలర్ మార్క్ దాటేసినట్టు ప్రకటించింది. ఈ చిత్రం నార్త్ అమెరికాలో ఫుల్ రన్‍లోనూ కొత్త రికార్డులను నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తోంది.
అమెరికా ప్రీ-సేల్స్ విషయంలో ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డులను కల్కి 2898 ఏడీ చెరిపేసింది. ప్రీ-సేల్స్ ద్వారా అత్యధిక మొత్తం దక్కించుకున్న భారతీయ చిత్రంగా నిలిచింది. ఇంకా నాలుగు రోజుల సమయం ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్స్ జోరు ఇంకా పెరిగే అవకాశం ఉంది.
హైదరాబాద్‍లో నిమిషాల్లోనే..
తెలంగాణలో కల్కి 2898 ఏడీ మూవీ బుకింగ్స్ నేటి (జూన్ 23) సాయంత్రం షురూ అయ్యాయి. హైదరాబాద్‍లో కల్కి టికెట్ల బుకింగ్ హోరు కనిపించింది. చాలా థియేటర్లలో బుకింగ్స్ మొదలైన కొన్ని నిమిషాల్లోనే హౌస్ ఫుల్ అయ్యాయి. బుకింగ్స్ సునామీ కనిపించింది. మరిన్ని థియేటర్లలో బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి. తెలంగాణలోనూ మిగిలిన చోట్ల కూడా ఇదే జోరు కనిపిస్తోంది. రష్ ఎక్కువవడంతో ఓ దశలో బుక్‍మైషో యాప్‍లోనూ ఎర్రర్స్ వచ్చాయి. ఈ మూవీకి టికెట్ల ధరలు భారీగా పెరిగినా సినీ ప్రేక్షకులు ఏ మాత్రం లెక్కచేయలేదు. టికెట్ ధర పెంపుపై జీవో వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్‍లోనూ టికెట్ల బుకింగ్స్ మొదలవుతాయి.
కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రభాస్, బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్, దీపికా పదుకొణ్ ప్రధాన పాత్రలు పోషించారు. భారత పురాణాల స్ఫూర్తితో సైన్స్ ఫిక్షన్ మూవీగా ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ రూపొందించారు. ఈ చిత్రం ఎమోషన్లు కూడా ఎక్కువగానే ఉంటాయని రెండో ట్రైలర్‌తో మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. గ్రాండ్ విజువల్స్, మైథాలజీ, యాక్షన్, ఎమోషన్ ఇలా అన్ని అంశాలతో ప్రేక్షకులను ఈ చిత్రం మరో లోకంలోకి తీసుకెళుతుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు.
కల్కి 2898 ఏడీ చిత్రం భారీ బడ్జెట్‍తో రూపొందింది. సుమారు రూ.600కోట్ల బడ్జెట్‍తో వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించినట్టు అంచనా. భారత సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన మూవీగా వస్తోంది. అంచనాలు కూడా ఆ రేంజ్‍లోనే ఉన్నాయి.
టాపిక్