తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Joker Sequel: అత్యంత చెత్త రేటింగ్ వచ్చిన డీసీ మూవీస్‌లో ఇదీ ఒకటి.. సైకలాజికల్ థ్రిల్లర్ జోకర్ సీక్వెల్‌కు బిగ్ షాక్

Joker Sequel: అత్యంత చెత్త రేటింగ్ వచ్చిన డీసీ మూవీస్‌లో ఇదీ ఒకటి.. సైకలాజికల్ థ్రిల్లర్ జోకర్ సీక్వెల్‌కు బిగ్ షాక్

Hari Prasad S HT Telugu

04 October 2024, 17:22 IST

google News
    • Joker Sequel: బ్లాక్‌బస్టర్ మూవీ జోకర్ కు సీక్వెల్ గా వచ్చిన జోకర్: ఫోలీయడు మూవీని ప్రేక్షకులు దారుణంగా తిరస్కరించారు. తొలి రోజు ఈ సినిమా రోటెన్ టొమాటోస్ అత్యంత చెత్త రేటింగ్ సాధించిన డీసీ మూవీస్ లో ఒకటిగా నిలవడం గమనార్హం.
అత్యంత చెత్త రేటింగ్ వచ్చిన డీసీ మూవీస్‌లో ఇదీ ఒకటి.. సైకలాజికల్ థ్రిల్లర్ జోకర్ సీక్వెల్‌కు బిగ్ షాక్
అత్యంత చెత్త రేటింగ్ వచ్చిన డీసీ మూవీస్‌లో ఇదీ ఒకటి.. సైకలాజికల్ థ్రిల్లర్ జోకర్ సీక్వెల్‌కు బిగ్ షాక్

అత్యంత చెత్త రేటింగ్ వచ్చిన డీసీ మూవీస్‌లో ఇదీ ఒకటి.. సైకలాజికల్ థ్రిల్లర్ జోకర్ సీక్వెల్‌కు బిగ్ షాక్

Joker Sequel: జోక్విన్ ఫీనిక్స్ ఐదేళ్ల కిందట నటించిన జోకర్ మూవీ తెలుసు కదా. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా బిలియన్ డాలర్లకుపైగా వసూలు చేసిన బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే తాజాగా శుక్రవారం (అక్టోబర్ 4) రిలీజైన ఈ మూవీ సీక్వెల్ జోకర్: ఫోలీయడు (Joker: Folie à Deux)ని మాత్రం ప్రేక్షకులు తిరస్కరించారు. తొలి రోజే ఈ సినిమాకు దారుణమైన రేటింగ్స్ వచ్చాయి.

జోకర్: ఫోలీయడు రేటింగ్

జోకర్: ఫోలీయడు మూవీలో జోక్విన్ ఫీనిక్స్ తోపాటు లేడీ గాగా నటించింది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీకి తొలి షో నుంచే మిక్స్‌డ్ రియాక్షన్స్ వచ్చాయి. లేడీ గాగా తప్ప ఈ మూవీలో పెద్దగా చెప్పుకోవాల్సిందేమీ లేదని ప్రేక్షకులు తేల్చి చెప్పారు. దీంతో రోటెన్ టొమాటోస్ లో ఈ మూవీకి కేవలం 39 శాతం స్కోరు మాత్రమే వచ్చింది.

ఈ క్రమంలో అత్యంత చెత్త రేటింగ్ సాధించిన డీసీ మూవీస్ లో ఒకటిగా అపవాదు మూటగట్టుకుంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా అసలు ఆ అంచనాలను అందుకోలేకపోయిందని, ఎంతో నీరసంగా సాగిందన్న రివ్యూలు వచ్చాయి. రోటెన్ టొమాటోస్ ఓ అమెరికన్ రివ్యూ అగ్రిగేటర్. సినిమాలు, టీవీ సిరీస్ లకు ఇందులోని రేటింగ్ ను ప్రామాణికంగా తీసుకుంటారు.

జోకర్ సీక్వెల్ కుళ్లిపోయింది

రోటెన్ టొమాటోస్.. అంటే కుళ్లిపోయిన టొమాటోలు అని అర్థం. ఇందులో 60 శాతం అంతకంటే ఎక్కువ స్కోరు సాధించే సినిమాలు, సిరీస్ లు ఫ్రెష్ గా ఉన్నాయని, అంతకంటే తక్కువగా ఉంటే కుళ్లిపోయింది అని చెబుతారు. ఆ లెక్కన జోకర్ సీక్వెల్ కుళ్లినట్లే అని సినిమా చూసిన ప్రేక్షకులు తేల్చేశారు.

అయితే డీసీ గతంలో నిర్మించిన సూసైడ్ స్క్వాడ్ (26 శాతం), గ్రీన్ లాంటెర్న్ (25 శాతం) మూవీస్ కంటే జోకర్: ఫోలియడు బెటర్ గానే ఉన్నా.. ఇది మాత్రం ఊహించని రేటింగే. ఈ చెత్త రేటింగ్ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లపైనా దారుణమైన ప్రభావం చూపనుంది. ఈ సీక్వెల్లో లీడ్ యాక్టర్స్ కు నటనకు మంచి మార్కులే పడ్డా.. స్టోరీ చెప్పిన విధానం మాత్రం ఎవరికీ నచ్చలేదు.

ఈ జోకర్ సీక్వెల్ నార్త్ అమెరికాలో ఇప్పటికీ చాలా థియేటర్లలో రిలీజ్ కాలేదు. ఇప్పుడీ చెత్త రేటింగ్స్ వల్ల తర్వాత రిలీజైనా ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. జోకర్ మూవీ బిలియన్ డాలర్ల మార్క్ దాటగా.. ఈ సీక్వెల్ మాత్రం అందుకు చాలా దూరంలోనే నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తదుపరి వ్యాసం