OTT psychological thriller: ఓటీటీలోకి వచ్చేస్తున్న అమలా పాల్ మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ-ott malayalam psychological thriller movie level cross to stream on amazon prime video from 27th september ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Psychological Thriller: ఓటీటీలోకి వచ్చేస్తున్న అమలా పాల్ మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ

OTT psychological thriller: ఓటీటీలోకి వచ్చేస్తున్న అమలా పాల్ మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ

Hari Prasad S HT Telugu

OTT psychological thriller: ఓటీటీలోకి లేటెస్ట్ మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ రాబోతోంది. ఆసిఫ్ అలీ, అమలా పాల్ లాంటి వాళ్లు నటించిన ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ రాగా.. రెండు నెలల తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.

ఓటీటీలోకి వచ్చేస్తున్న అమలా పాల్ మలయాళం సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ

OTT psychological thriller: మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ లెవల్ క్రాస్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. జులై 26న థియేటర్లలో రిలీజై హిట్ కొట్టిన ఈ సినిమా శుక్రవారం (సెప్టెంబర్ 27) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. ఆసిఫ్ అలీ, అమలా పాల్, షరాఫుదీన్ లాంటి వాళ్లు నటించిన ఈ సినిమాకు అర్ఫాజ్ ఆయుబ్ దర్శకత్వం వహించాడు.

లెవల్ క్రాస్ ఓటీటీ రిలీజ్ డేట్

మలయాళం ఇండస్ట్రీలో నుంచి వచ్చిన మరో సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ లెవల్ క్రాస్. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా.. శుక్రవారం (సెప్టెంబర్ 27) నుంచే మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మలయాళ స్టార్ నటుడు ఆసిఫ్ అలీ నటించిన సినిమా కావడంతో లెవల్ క్రాస్ పై ఓటీటీ ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఆసిఫ్ అలీ నటించిన తలవన్, అడియోస్ అమిగో మూవీస్ ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడీ థ్రిల్లర్ మూవీ లెవల్ క్రాస్ కూడా వచ్చేస్తోంది.

ఏంటీ లెవల్ క్రాస్ మూవీ?

లెవల్ క్రాస్ మూవీ రఘు అనే ఓ రైల్వే గేట్ కీపర్, అతని జీవితంలోకి అనుకోకుండా వచ్చిన ఓ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఏళ్ల పాటు అదే గేటు దగ్గర ఒంటరిగా గడిపిన రఘు దగ్గరికి ఓ రైల్లో నుంచి దిగిన అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ తర్వాత ఆ ఇద్దరి మనసులు కలుస్తాయి.

అయితే చైతాలీ(అమలా పాల్) అనే అమ్మాయికి అప్పటికే పెళ్లవడం, ఆమె భర్త వీళ్ల జీవితాల్లోకి రావడంతో కథ మలుపు తిరుగుతుంది. ఊహించని ట్విస్టులతోపాటు భయపెట్టే నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఈ లెవల్ క్రాస్ మూవీకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.

సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ లెవల్ క్రాస్ మూవీ బాగా నచ్చుతుంది. సినిమాలోని ట్విస్టులు మంచి థ్రిల్ ను పంచుతాయి. డైరెక్టర్ అర్ఫాజ్ ఆయుబ్ ఈ మూవీని ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా జాగ్రత్తగా మలిచిన తీరు మూవీలో కనిపిస్తుంది. థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడీ సినిమాను ప్రైమ్ వీడియోలో చూసే అవకాశం దక్కనుంది.