Sci fi Thriller OTT: ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చిన కోలీవుడ్ సూపర్ హిట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ
01 November 2024, 14:32 IST
Black OTT: జీవా హీరోగా నటించిన తమిళ సూపర్ హిట్ మూవీ బ్లాక్ థియేటర్లలో రిలీజై ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చింది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ మూవీ శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించింది.
బ్లాక్ ఓటీటీ
Black OTT: సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన కోలీవుడ్ మూవీ బ్లాక్ థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చింది. బ్లాక్ మూవీలో జీవా, ప్రియా భవానీ శంకర్ హీరోహీరోయిన్లుగా నటించారు. కేజీ బాలసుబ్రమణి దర్శకత్వం వహించిన ఈ మూవీ హిట్ టాక్‌ను తెచ్చుకున్నది.
అక్టోబర్ 11న థియేటర్లలో రిలీజ్...
అక్టోబర్ 11న థియేటర్లలో రిలీజైన బ్లాక్ మూవీ సరిగ్గా ఇరవై రోజుల్లోనే ఓటీటీ ఆడియెన్స్ ముందుకొచ్చింది. శుక్రవారం నుంచి సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం తమిళ వెర్షన్‌ను మాత్రమే మేకర్స్ రిలీజ్ చేశారు. త్వరలోనే తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
హాలీవుడ్ మూవీకి రీమేక్...
బ్లాక్ కాన్సెప్ట్‌తో పాటు దర్శకుడి టేకింగ్, ట్విస్ట్‌లు ఆడియెన్స్‌ను మెప్పించాయి. చాలా రోజుల తర్వాత హీరో జీవాకు బ్లాక్ మూవీతో హిట్ దక్కింది. ఐఎమ్‌డీబీలో 7.7 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది.
హాలీవుడ్ మూవీ కొహెరెన్స్‌కు ఇది రీమేక్ అని ప్రచారం జరిగింది. దాదాపు పది కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఇరవై ఐదు కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది.
బ్లాక్ మూవీ కథ ఇదే...
వసంత్ (జీవా), అరణ్య (ప్రియా భవానీ శంకర్) భార్యాభర్తలు. బీచ్ దగ్గరలోని ఓ విల్లా కొంటారు. వీకెండ్‌ను సరదాగా గడిపేందుకు విల్లాకు వస్తారు. వారి విల్లాకు ఎదురుగా ఉన్న బిల్డింగ్‌లో వసంత్, అరణ్య రూపంలోనే మరో జంట కనిపిస్తుంది. వాళ్లను చూసి వసంత్, అరణ్య షాకవుతారు. ఆ తర్వాత అరణ్య మిస్సవుతుంది.
ఆమె కోసం అన్వేషించే క్రమంలో వసంత్‌కు 1960 కాలం నాటికి చెందిన మనో అనే వ్యక్తికి విల్లాకు సంబంధం ఉందని తెలుస్తుంది. మనో ఎవరు? అదృశ్యమైన అరణ్యను వసంత్ ఎలా కాపాడుకున్నాడు అన్నదే ఈ మూవీ కథ. బ్లాక్ మూవీకి సామ్ సీఎస్ మ్యూజిక్ అందించాడు. వివేక్ ప్రసన్న, యోగ్ జపీ, షారా కీలక పాత్రలు పోషించారు.
రంగం తో బ్లాక్‌బస్టర్ హిట్...
జీవా, ప్రియా భవానీ శంకర్ ఇద్దరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. జీవా హీరోగా నటించిన తమిళ మూవీ కో...రంగం పేరుతో తెలుగులోకి అనువాదమై పెద్ద విజయాన్ని దక్కించుకున్నది. వైఎస్ జగన్ జీవితం ఆధారంగా రూపొందిన యాత్ర 2 మూవీలో టైటిల్ రోల్ చేశాడు.
రాజా, సూర్యవంశంతో పాటు తెలుగులో పలు సినిమాలు చేసిన ఆర్‌బీ చౌదరి తనయుడే సూర్య కావడం గమనార్హం. ప్రియా భవానీ శంకర్ కూడా తెలుగులో కళ్యాణం కమనీయం, భీమాతో పాటు మరికొన్ని సినిమాలు చేసింది.