తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jawan In Ott: ఓటీటీలో జవాన్ అరుదైన రికార్డు.. అత్యధిక మంది చూసిన బాలీవుడ్ మూవీ ఇదే.. ఆర్ఆర్ఆర్ రికార్డు బ్రేకవుతుందా?

Jawan in OTT: ఓటీటీలో జవాన్ అరుదైన రికార్డు.. అత్యధిక మంది చూసిన బాలీవుడ్ మూవీ ఇదే.. ఆర్ఆర్ఆర్ రికార్డు బ్రేకవుతుందా?

Hari Prasad S HT Telugu

08 November 2023, 15:08 IST

    • Jawan in OTT: ఓటీటీలో జవాన్ అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ షారుక్ ఖాన్ సినిమా.. ఆ ఓటీటీలో అత్యధిక మంది చూసిన బాలీవుడ్ మూవీగా నిలవడం విశేషం.
ఓటీటీలో జవాన్ దూకుడు
ఓటీటీలో జవాన్ దూకుడు

ఓటీటీలో జవాన్ దూకుడు

Jawan in OTT: బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాయడమే కాదు.. ఓటీటీలోనూ దుమ్ము రేపుతోంది. అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ ఓటీటీలో అత్యధిక మంది చూసిన బాలీవుడ్ సినిమాగా నిలిచింది. ఈ క్రమంలో గంగూబాయి కఠియావాడి రికార్డు బ్రేక్ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Janhvi Kapoor Partner: తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పిన జాన్వీ కపూర్.. ఈ లక్షణాలు తప్పనిసరిగా ఉండాల్సిందేనట

Panchayat 3 Trailer: పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ వచ్చేసింది.. మరింత రాజకీయం, నవ్వులతో అదిరిపోయింది

Getup Srinu: ఆ ఇద్దరు హీరోలపై నమ్మకం కుదర్లేదు.. గెటప్ శ్రీను పర్ఫెక్ట్.. డైరెక్టర్ కామెంట్స్

Suchitra Dhanush: హీరో ధనుష్ గే.. రాత్రి 3 గంటలకు నా భర్తతో ఏం పని.. సింగర్ సుచిత్ర కామెంట్స్

జవాన్ మూవీ అక్టోబర్ 30 నుంచి నవంబర్ 5 మధ్య ఏకంగా 1.49 కోట్ల వాచింగ్ హవర్స్ నమోదు చేయడం విశేషం. గతంలో ఆలియా భట్ నటించిన గంగూబాయి కఠియావాడి పేరు మీద ఈ రికార్డు ఉండేది. ఆ సినిమా 1.38 కోట్ల వాచింగ్ హవర్స్ నమోదు చేసింది. జవాన్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూసిన ఫ్యాన్స్.. ఈ మూవీ వచ్చీ రాగానే ఎగబడి చూసేశారు.

హిందీతోపాటు తెలుగు, తమిళ వెర్షన్లు కూడా నెట్‌ఫ్లిక్స్ లోనే స్ట్రీమ్ అవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ మూవీస్ లో జవాన్ హిందీ వెర్షన్ ఫస్ట్ ఫ్లేస్ లో ఉండగా.. తెలుగు వెర్షన్ 5, తమిళ వెర్షన్ 8వ స్థానాల్లో ఉండటం విశేషం.

ఆర్ఆర్ఆర్ రికార్డును బ్రేక్ చేస్తుందా?

గతేడాది టాలీవుడ్ తోపాటు పాన్ ఇండియా స్థాయిలో రిలీజై సంచలనం సృష్టించిన ఆర్ఆర్ఆర్ మూవీ రికార్డుకు కూడా జవాన్ చేరువవుతోంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో అత్యధిక మంది చూసిన ఇండియన్ మూవీ రికార్డు ఆర్ఆర్ఆర్ పేరిటే ఉంది. ఈ సినిమా ఏకంగా 1.84 కోట్ల వ్యూయింగ్ హవర్స్ నమోదు చేయడం విశేషం. జవాన్ జోరు చూస్తుంటే ఈ రికార్డు బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

బాక్సాఫీస్ దగ్గర కూడా జవాన్ దుమ్ము రేపిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రూ.వెయ్యి కోట్లకుపైగా వసూలు చేసింది. పఠాన్ తర్వాత ఒకే ఏడాది రూ.1000 కోట్ల కలెక్షన్ల సినిమాలు రెండు ఇచ్చిన తొలి హీరోగా షారుక్ నిలిచాడు. అట్లీ కుమార్ డైరెక్ట్ చేసిన జవాన్ మూవీలో నయనతార, దీపికా పదుకోన్, విజయ్ సేతుపతి, ప్రియమణి నటించారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం