Mad in Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్ము రేపుతున్న మ్యాడ్.. జవాన్‌నే వెనక్కి నెట్టేసింది
Mad in Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్ము రేపుతోంది మ్యాడ్(Mad) మూవీ. ఏకంగా షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీనే వెనక్కి నెట్టేసింది. ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ లిస్ట్ లో మ్యాడ్ రెండో స్థానంలో ఉంది.
Mad in Netflix: మ్యాడ్ మూవీ (Mad) నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో దూసుకెళ్తోంది. గత వారం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా.. టాప్ ట్రెండింగ్ మూవీస్ లో రెండోస్థానంలో ఉండటం విశేషం. ఈ క్రమంలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీని కూడా ఈ మూవీ వెనక్కి నెట్టడం విశేషం. జవాన్ హిందీ వెర్షన్ మినహాయిస్తే మిగతా భాషల వెర్షన్లు మ్యాడ్ కంటే కిందే ఉన్నాయి.
అక్టోబర్ 6న థియేటర్లలో రిలీజైన మ్యాడ్ మూవీకి యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర కూడా చెప్పుకోదగిన వసూళ్లు సాధించింది. నెల రోజుల్లోపే నెట్‌ఫ్లిక్స్ లో రిలీజైన ఈ సినిమా.. అక్కడా సత్తా చాటుతోంది. నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ మూవీస్ లో జవాన్ హిందీ వెర్షన్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. మ్యాడ్ రెండో స్థానంలో ఉంది.
ఆ తర్వాత జవాన్ తమిళం, తెలుగు వెర్షన్లు మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఓ చిన్న సినిమాగా రిలీజై థియేటర్లలో సంచలన విజయం సాధించిన మ్యాడ్.. నెట్‌ఫ్లిక్స్ లాంటి ప్రముఖ ఓటీటీ టాప్ ట్రెండింగ్ లోనూ ఉండటం విశేషమే. కల్యాణ్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ కాలేజ్ డ్రామా ద్వారా జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ హీరోగా పరిచయం అయ్యాడు.
మ్యాడ్ మూవీ ఎలా ఉందంటే?
మ్యాడ్ రెండు గంటల పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ మూవీ. కథ, కథనాలు, లాజిక్స్ గురించి ఆలోచించకుండా చూస్తే ఫుల్ టైమ్‌పాస్ అవుతుంది.
మ్యాడ్ ద్వారా కొత్త కథ చెప్పాలనో, సందేశం ఇవ్వాలనో దర్శకుడు కళ్యాణ్ శంకర్ అనుకోలేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వించడమే ధ్యేయంగా పెట్టుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. శుభం కార్డు వరకు నవ్వుల డోసు తగ్గకుండా జాగ్రత్తపడ్డాడు. లాజిక్స్ అసలే ఫాలో కాకూడదని ఫిక్స్ అయ్యాడు.
లాజిక్స్ విషయంలో నెగెటివ్ కామెంట్స్ వస్తాయని ముందు జాగ్రత్తగానే ఊహించి లాజిక్స్ గురించి సినిమాలో డైలాగ్ కూడా పెట్టాడు. సినిమాటిక్ రూల్స్ తో సంబంధం లేకుండా కామెడీ కోసమే క్రియేట్ చేసిన చాలా క్యారెక్టర్స్ సినిమాలో చాలా కనిపిస్తాయి.