Maa Oori Polimera 2 Box Office Collections: మా ఊరి పొలిమేర 2 బాక్సాఫీస్ కలెక్షన్లు.. రెండు రోజుల్లోనే భారీగా..
Maa Oori Polimera 2 Box Office Collections: మా ఊరి పొలిమేర 2 బాక్సాఫీస్ కలెక్షన్లు దుమ్ము రేపుతున్నాయి. రెండు రోజుల్లోనే భారీగా వసూలు చేసిన ఈ సినిమా.. మూడో రోజు బ్రేక్ ఈవెన్ అందుకునే అవకాశాలు ఉన్నాయి.

Maa Oori Polimera 2 Box Office Collections: మా ఊరి పొలిమేర 2 మూవీ గత శుక్రవారం (నవంబర్ 3) రిలీజైన విషయం తెలిసిందే. ఈ చిన్న సినిమా అంచనాలను మించి బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు సాధిస్తోంది. మూవీకి తొలి రోజు నుంచే మంచి టాక్ రావడంతో శుక్ర, శని వారాల్లో మంచి కలెక్షన్లు వచ్చాయి. మూడో రోజైన ఆదివారం (నవంబర్ 5) ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది.
మా ఊరి పొలిమేర 2 మూవీ తొలి రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.6.6 కోట్లు వసూలు చేయడం విశేషం. గతంలో నేరుగా ఓటీటీలోకి వచ్చిన మా ఊరి పొలిమేర మూవీకి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా.. థియేటర్లలో అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది. అనిల్ విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సత్యం రాజేష్, గెటప్ శ్రీను, కామాక్షి భాస్కర్లలాంటి వాళ్లు నటించారు.
మా ఊరి పొలిమేర 2 మూవీ చేతబడుల చుట్టూ తిరిగే కథతో తెరకెక్కింది. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను ప్రదర్శించే థియేటర్లు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. తాజాగా ఆదివారం మరో 50 స్క్రీన్లలో ఈ సినిమా వచ్చింది. దీంతో మూవీ కలెక్షన్లు మరింత పెరగనున్నాయి. కేవలం రెండో రోజే మా ఊరి పొలిమేర 2 మూవీ 70 వేల టికెట్లు అమ్ముడైనట్లు బుక్ మై షో వెల్లడించింది.
మూడో రోజైన ఆదివారమే సినిమా బ్రేక్ ఈవెన్ దాటి లాభాల్లోకి వెళ్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఆటో డ్రైవర్ కొమరయ్య, అతని సోదరుడు జంగయ్య, కవిత అనే మహిళ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. కొమరయ్య, ఆ ఊరి పొలిమేరల్లో ఉండే గుడి, చేతబడులకు ఏమిటి సంబంధం అన్నది ఇందులో చూడొచ్చు.
మా ఊరి పొలిమేర 2 మూవీ టీమ్ ఇప్పటికే సక్సెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ సినిమా డిసెంబర్ తొలి వారంలో ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.