Polimera 2 OTT: ఓటీటీలోకి మా ఊరి పొలిమేర 2.. ఈ నెలలోనే స్ట్రీమింగ్! ఎక్కడంటే?-satyam rajesh maa oori polimera 2 ott likely to release in disney plus hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Satyam Rajesh Maa Oori Polimera 2 Ott Likely To Release In Disney Plus Hotstar

Polimera 2 OTT: ఓటీటీలోకి మా ఊరి పొలిమేర 2.. ఈ నెలలోనే స్ట్రీమింగ్! ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu
Nov 08, 2023 01:26 PM IST

Maa Oori Polimera 2 OTT Release: మా ఊరి పొలిమేరతో సూపర్ హిట్ కొట్టిన సత్యం రాజేష్ తాజాగా నటించిన చిత్రం మా ఊరి పొలిమేర 2. నవంబర్ 3న థియేటర్లలో విడుదలైన మా ఊరిపొలిమేర 2 ఓటీటీ విడుదల తేదిపై ఆసక్తి నెలకొంది.

సత్యం రాజేష్ మా ఊరి పొలిమేర 2 ఓటీటీ విడుదల తేది
సత్యం రాజేష్ మా ఊరి పొలిమేర 2 ఓటీటీ విడుదల తేది

Maa Oori Polimera 2 OTT Streaming: రెండేళ్ల కిందట నేరుగా ఓటీటీలోకి వచ్చి సూపర్ హిట్ కొట్టిన చిత్రం మా ఊరి పొలిమేర. సస్పెన్స్, హారర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా హిట్‌తో సీక్వెల్‌కు ప్లాన్ చేశారు నిర్మాతలు. అలా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిందే మా ఊరి పొలిమేర 2. డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన మా ఊరి పొలిమేర 2 చిత్రానికి గౌరికృష్ణ నిర్మాత‌గా వ్యవహరించారు. మొదటి పార్టులో నటించిన స‌త్యం రాజేష్‌, డా. కామాక్షి భాస్కర్ల, గెట‌ప్ శ్రీను, రాకెండ్ మౌళి, బాలాదిత్య మా ఊరి పొలిమేర 2 మూవీలో కూడా ముఖ్య పాత్రలు పోషించారు.

వారితోపాటు సాహితి దాస‌రి, ర‌వి వ‌ర్మ‌, చిత్రం శ్రీను, అక్ష‌త శ్రీనివాస్‌ కూడా కీలక పాత్రలు చేశారు. ఇక ఎంతో హైప్‌తో వచ్చిన మా ఊరి పొలిమేర 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 3న విడుదలైంది. సినిమా ఊహించని ట్విస్టులతో అదిరిపోయిందని కామెంట్స్ వినిపించాయి. అలాగే క్లైమాక్స్ స్లోగా సాగిందని తెలిసింది. మొత్తానికి మా ఊరి పొలిమేర 2 మూవీ పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది. తొలి రోజు నుంచే కలెక్షన్స్ కొల్లగొడుతోంది.

మా ఊరి పొలిమేర 2కి ఇప్పటివరకు రూ. 12 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, ప్రస్తుతం మా ఊరి పొలిమేర 2 ఓటీటీ విడుదల తేది ఆసక్తిగా మారింది. మా ఊరి పొలిమేర 2 మూవీ ఊహించని విధంగా ఇదే నెల అంటే నవంబర్ చివరి వారంలో ఓటీటీలోకి రానుందని ఓ న్యూస్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. నవంబర్ 3న విడుదలైన ఈ సినిమా నెల కాకముందే ఓటీటీలోకి రానుందన్నట్లు.

అయితే, మా ఊరి పొలిమేర 2 థియేటర్లో విడుదలైన తర్వాత సరిగ్గా నెల రోజులకు డిసెంబర్ మొదటి వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని మరో న్యూస్ వైరల్ అవుతోంది. రిలీజ్ డేట్ విషయంలో ఇప్పటికీ క్లారిటీ లేదు గానీ, మా ఊరి పొలిమేర 2ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. మా ఊరి పొలిమేర మూవీ సైతం హాట్‌స్టార్‌లోనే స్టీమింగ్ అయింది. కాబట్టి రెండో పార్టును కూడా డిస్నీ హాట్‌స్టార్‌ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనే రిలీజ్ చేయనున్నట్లు టాక్.

IPL_Entry_Point