Mark Antony: విశాల్ ‘మార్క్ ఆంటోనీ’ రిలీజ్‍పై కోర్టు స్టే ఇచ్చిందా? స్పందించిన నిర్మాత
08 September 2023, 21:44 IST
- Mark Antony: మార్క్ ఆంటోని సినిమా విడుదలపై మద్రాస్ హైకోర్టు స్టే ఇచ్చిందని రూమర్లు వస్తున్నాయి. దీనిపై చిత్ర నిర్మాత స్పందించారు.
Mark Antony: విశాల్ ‘మార్క్ ఆంటోనీ’ రిలీజ్‍పై కోర్టు స్టే ఇచ్చిందా? స్పందించిన నిర్మాత
Mark Antony: టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో రూపొందిన ‘మార్క్ ఆంటోనీ’ చిత్రంపై మంచి బజ్ ఉంది. ఈ చిత్రంలో విశాల్ హీరోగా నటించగా.. ఎస్‍జే సూర్య కూడా ప్రధాన పాత్ర చేశారు. ఇటీవలే ‘మార్క్ ఆంటోనీ’ ట్రైలర్ రాగా బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంపై అంచనాలను భారీగా పెంచింది. టైమ్ ట్రావెల్, గ్యాంగ్‍స్టర్స్, యాక్షన్, కామెడీ ఇలా విభిన్న అంశాలతో మార్క్ ఆంటోనీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈనెల (సెప్టెంబర్) 15వ తేదీన ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ తరుణంలో ఈ సినిమా రిలీజ్ కాకుండా కోర్టు స్టే ఆర్డర్స్ ఇచ్చిందనే పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వివరాలివే..
మార్క్ ఆంటోనీ చిత్రం రిలీజ్‍పై మద్రాస్ హైకోర్టు స్టే విధించిందని సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో దీనికి కారణేంటని చాలా మంది ఆలోచిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌కు విశాల్ కొంత మొత్తాన్ని బకాయి పడ్డారని, దీంతో ఆ ప్రొడక్షన్ హౌస్ కోర్టును ఆశ్రయించిందనే ఊహాగానాలు కనిపించాయి. అయితే, ‘మార్క్ ఆంటోనీ’పై కోర్టు స్టే పుకార్లపై చిత్ర నిర్మాత స్పందించారు. అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు.
మార్క్ ఆంటోనీ సినిమా రిలీజ్‍పై కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఆ చిత్ర నిర్మాత వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. “అలాంటి కోర్టు ఆర్డర్స్ ఏమీ లేవు. ఈ ఛానెల్‍పై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం” అని పోస్ట్ చేశారు.
చంద్రముఖి 2 విడుదల సెప్టెంబర్ 28కు వాయిదా పడటంతో ‘మార్క్ ఆంటోనీ’కి పోటీ లేకుండా పోయింది. సెప్టెంబర్ 15న ‘మార్క్ ఆంటోనీ’ సోలోగా రానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది. కాగా, మార్క్ ఆంటోని చిత్రం నుంచి నాలుగో పాట రేపు (సెప్టెంబర్ 9) సాయంత్రం 6.30 గంటలకు రిలీజ్ కానుంది.
మార్క్ ఆంటోనీ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించగా.. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. సునీల్, సెల్వరాఘవన్, రితూ వర్మ, అభినయ, కింగ్‍స్లే ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.
టాపిక్